Potatos
-
Recipe: ఈ పదార్థాలు ఉంటే చాలు.. చికెన్ పొటాటో నగ్గెట్స్ తయారు చేసుకోవచ్చు!
బోన్‌లెస్ చికెన్.. బంగాళదుంపలు.. మొక్కజొన్న పిండి.. గుడ్లు... నోరూరించే చికెన్ పొటాటో నగ్గెట్స్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. చికెన్ పొటాటో నగ్గెట్స్ తయారీకి కావలసినవి: ►బోన్‌లెస్ చికెన్ – అర కప్పు (మెత్తగా ఉడికించి.. చల్లారాక చేత్తో చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి) ►బంగాళదుంపలు – 2 (మెత్తగా ఉడికించి.. తురుములా చేసుకోవాలి) ►జీలకర్ర పొడి, మిరియాల పొడి – 1 టీ స్పూన్ చొప్పున ►గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ చొప్పున ►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ ►కొత్తిమీర తురుము – కొద్దిగా ►మొక్కజొన్న పిండి – 3 టేబుల్ స్పూన్లు ►గుడ్లు – 2 (ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్లు, అర టేబుల్ స్పూన్ పాలు పోసుకుని.. బాగా కలిపి పెట్టుకోవాలి) ►బ్రెడ్ పౌడర్ – గార్నిష్ కోసం ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా ఒక బౌల్లో బంగాళదుంప తురుము, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, ►మొక్కజొన్న పిండి, చికెన్ ముక్కలు వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ►అనంతరం చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. చిత్రంలో ఉన్న విధంగా చతురస్రాకారంగా నలువైపులా ఒత్తుకోవాలి. ►వీటిని గుడ్డు–పాల మిశ్రమంలో ముంచి.. బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి. ►వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Moringa Chutney Recipe: ఇడ్లీ, దోశలోకి.. మొరింగా చట్నీ, వాల్నట్ చట్నీ! తయారీ ఇలా! Banana Coffee Cake Recipe: బనానా– కాఫీ కేక్ ఇలా తయారు చేసుకోండి! -
ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్ చూసేవాళ్లు! ఇవి ట్రై చేస్తే..
Tips To Relax Eyes- Stress Relief: ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్ లేదా మొబైల్ స్క్రీన్ చూడడం వల్ల కళ్లు ఒత్తిడికి గురై అలసిపోతుంటాయి. ఇలాంటి కళ్ల ఒత్తిడిని తగ్గించి ఉపశాంతిని కలిగించే మాస్క్‌లను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... రోజ్‌వాటర్‌తో.. ►రోజ్‌వాటర్‌లో కాటన్ ముక్కను కాసేపు నానబెట్టాలి. తరువాత కాటన్‌ను రెండుకళ్లపై మొత్తం కప్పి ఉంచి, పదిహేను నిమిషాలు తరువాత తీసేయాలి. ఒకసారి ఇలా చేసిన తరువాత కాటన్‌ను రిఫ్రిజిరేటర్లో పెట్టి మరోసారి కూడా వాడుకోవచ్చు. నల్లని వలయాలు సైతం తగ్గుముఖం ►టీ బ్యాగ్‌లను చల్లటి నీటిలో నానబెట్టాలి. తరువాత టీ బ్యాగ్‌లను నీటి నుంచి బయటకు తీసి, టీబ్యాగ్లో అధికంగా ఉన్న నీటిని పిండి కళ్లమీద పెట్టుకుని పదినిమిషాలు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు ఒత్తిడి తగ్గడంతోపాటు, కంటిచుట్టూ ఏర్పడిన నల్లని వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. బంగాళదుంప, పుదీనా పుదీనాతో.. ►బంగాళదుంప, పుదీనా ముఖాన్ని అందంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ►అదేవిధంగా కళ్ల ఒత్తిడిని తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. ►పుదీనా రసం, బంగాళ దుంప రసాన్ని సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి పదినిమిషాలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ►మిశ్రమం చల్లబడిన తరువాత .. కాటన్ బాల్‌ను ముంచి కళ్లమీద పెట్టుకుని ఐదు నిమిషాలు ఉంచుకోవాలి. ►కళ్ల ఒత్తిడి తగ్గడంతోపాటు, కళ్లచుట్టూ ఏర్పడిన ముడతలు తగ్గుముఖం పడతాయి. ►వీటిలో ఏ ఒక్కటి పాటించినా కళ్లకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. చదవండి: Tips To Increase Platelet Count: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే.. Mental Health: ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? ఆ మూడింటిపై నియంత్రణ లేకపోతే! అంతే ఇక.. -
Recipe: అన్నం, రుమాలీ రోటీలోకి అదిరిపోయే మటన్ రోగన్ జోష్!
పర్యాటకుల్ని ఆకర్షించే ప్రదేశాల్లో కశ్మీర్ అందాలు మొదటి స్థానంలో ఉంటాయి. అక్కడి పర్యావరణానికి తగ్గట్టుగానే కశ్మీరి వంటకాలు అమోఘమైన రుచితో నోరూరిస్తుంటాయి. కశ్మీరీలనేగాక పర్యాటకుల్ని విపరీతంగా ఆకట్టుకునే కొన్ని వంటకాలను మన ఇంట్లోనే ఎలా వండుకోవచ్చో తెలుసుకుందాం... దమ్ ఆలూ కావలసినవి: బేబీ పొటాటోలు – పది, నీళ్లు – కప్పు, ఆయిల్ – డీప్‌ఫ్రైకి సరిపడా. కూర కోసం: ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర – అరటేబుల్ స్పూను, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, నల్ల యాలుక్కాయలు – రెండు, సాధారణ యాలుక్కాయలు – రెండు, లవంగాలు – ఐదు, ఇంగువ – చిటికెడు, కశ్మీరి ఎండు మిర్చి కారం – టీస్పూను, నీళ్లు – కప్పు, పెరుగు – ముప్పావు కప్పు, శొంఠి పొడి – టీస్పూను, సోంపు పొడి – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, గరం మసాలా – పావుటీస్పూను. తయారీ.. ►ముందుగా పొటాటోలను శుభ్రంగా కడిగి కప్పు నీళ్లుపోసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. ►ఉడికిన దుంపలను తొక్కతీసి ఫోర్క్‌తో చిన్న రంధ్రాలు పెట్టుకోవాలి. ►ఇప్పుడు బాగా వేడెక్కిన ఆయిల్లో దుంపలను బంగారు వర్ణం, క్రిస్పీగా మారేంత వరకు డీప్‌ఫ్రై చేయాలి. ►ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి ఆయిల్ వేసి, వేడెక్కిన తరువాత జీలకర్ర, దాల్చిన చెక్క, నల్ల యాలుక్కాయలు, యాలుక్కాయలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. ►ఇవన్నీ వేగాక స్టవ్ ఆపేసి కశ్మీరి కారం వేసి తిప్పాలి. ►తర్వాత పెరుగు వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ►ఇప్పుడు శొంఠిపొడి, సోంపు పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ►ఈ మసాలా మిశ్రమంలో డీప్‌ఫ్రై చేసిన బేబీపొటాటోలను వేయాలి. ►అరకప్పునుంచి కప్పు నీళ్లుపోసి మూతపెట్టి అరగంటపాటు సన్నని మంటమీద మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుకోవాలి. ∙అరగంట తరువాత ఆయిల్ పైకితేలుతుంది. ఇప్పుడు గరం మసాలా వేసి తిప్పి దించేయాలి. అన్నం, రోటీలలోకి ఇది మంచి సైడ్ డిష్‌గా పనిచేస్తుంది. రోగన్ జోష్ కావలసినవి: మటన్ ముక్కలు – అరకేజీ, పెరుగు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఆవనూనె – అరకప్పు, నల్ల యాలుక్కాయలు – రెండు, సాధారణ యాలుక్కాయలు – నాలుగు, లవంగాలు – నాలుగు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, బిర్యానీ ఆకు – ఒకటి, మిరియాలపొడి – అరటీస్పూను, సోంపు పొడి∙– టీస్పూను, ఇంగువ – అరటీస్పూను, కశ్మీరీ ఎండుమిర్చికారం – రెండు టీస్పూన్లు, రత్నజోట్ (ఒక రకమైన వేరు, రంగుకోసం వాడుతారు) – అరంగుళం ముక్క, కొత్తిమీర – గార్నిష్ కు సరిపడా మ్యారినేషన్ కోసం: సోంపు గింజలు – టీస్పూను, దాల్చిన చెక్క పొడి – పావు టీస్పూను, కశ్మీరీ ఎండు మిర్చికారం – టీస్పూను, మిరియాల పొడి – అరటీస్పూను, యాలుక్కాయ పొడి – అరటీస్పూను. తయారీ.. ►మటన్ ముక్కలను నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వడగట్టాలి. ►మటన్ ముక్కలకు మ్యారినేషన్ కోసం తీసుకున్న పదార్థాలు, కొద్దిగా ఉప్పు వేసి చక్కగా కలిపి గంటన్నరపాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి ►మందపాటి బాణలిలో ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ►కాగిన తరువాత బిర్యానీ ఆకులు, యాలుక్కాయలు, దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులన్నీ వేయాలి. ►ఇవన్నీ ఒకనిమిషం పాటు వేగిన తరువాత నానబెట్టుకున్న మటన్‌ను వేసి పెద్ద మంట మీద తిప్పుతూ ఉడికించాలి. ►ఐదు నిమిషాల తరువాత ఇంగువ వేసి తిప్పాలి. ►తరువాత కప్పు నీళ్లుపోసి కలిపి, మూతపెట్టి సన్నని మంటమీద అరగంటపాటు ఉడికించాలి ►మరొక గిన్నెను తీసుకుని పెరుగు, కారం, సోంపు పొడి వేసి చక్కగా కలుపుకోవాలి. ►ఉడుకుతున్న మటన్ మిశ్రమంలో పెరుగు మిశ్రమాన్ని వేసి కలపాలి. ►ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ►ఇప్పుడు రతన్ జోట్‌ను ఒక గిన్నెలో వేసి వేడినూనె పోసి ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి. ►నానిన రతన్ జోట్ మిశ్రమాన్ని ఉడుకుతోన్న మటన్ మిశ్రమంలో వేయాలి. ►మటన్ ముక్కలు మెత్తబడిన తరువాత కొత్తి మీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన రోగన్ జోష్ రెడీ. అన్నం, రుమాలీ రోటీలోకి ఇది చాలా బావుంటుంది. ఇది కూడా ట్రై చేయండి: Chepala Iguru In Telugu: ఘుమఘుమలాడే చేపల ఇగురు చేసుకోండిలా! -
నోరూరించే ఆలూ శాండ్ విచ్ తయారీ విధానం..
పన్నిర్ పొటాటో కార్న్బాల్స్ కావలసినవి: ఉడికించిన బంగాళ దుంప ముక్కలు – ఒకటిన్నర కప్పు, సన్నగా తరిగిన పన్నిర్ – కప్పు, పచ్చిమిర్చి ముక్కలు – రెండు టీస్పూన్లు, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను, ఉడికించిన స్వీట్ కార్న్ – అర కప్పు, చీజ్ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి – ముప్పావు కప్పు (కప్పు నీళ్లల్లో ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి), బ్రెడ్ పొడి – రోలింగ్‌కు సరిపడా, ఆయిల్ – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – రుచికి తగినంత. సాస్: బటర్ – రెండు టేబుల్ స్పూన్లు, మైదా – రెండు టేబుల్ స్పూన్లు, పాలు – ముప్పావు కప్పు. తయారీ: ∙ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి బటర్ వేయాలి. బటర్ వేడెక్కిన తరువాత మైదా వేసి నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు పాలు పోసి సన్నని మంట మీద మూడు నిమిషాలు తిప్పుతూ ఉడికిస్తే సాస్ రెడీ అవుతుంది. దీనిని పక్కన పెట్టాలి. ∙బంగాళ దుంప ముక్కలు , పన్నీర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, స్వీట్ కార్న్, చీజ్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. దీనిలోనే సాస్ కూడా వేసి కలపాలి. ∙ఈ మిశ్రమాన్ని గుండ్రని మీడియం సైజు బాల్స్‌లా చుట్టుకోవాలి. ∙బాల్స్‌ను కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో ముంచి, తరువాత బ్రెడ్ పొడిలో ముంచాలి. ∙బాల్‌కు చక్కగా కోటింగ్ పట్టిన తరువాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ∙గోల్డెన్ బ్రౌన్ రంగులోకి బాల్స్ మారితే పన్నిర్ పొటాటో కార్న్ బాల్స్ రెడీ. చట్నీ, టొమాటో కెచప్‌లతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి. మూంగ్ దాల్ చిల్లా కావలసినవి: పొట్టుతీసిన పెసరపప్పు – కప్పు, పసుపు – పావు టీస్పూను, కారం – పావు టీస్పూను, వేయించిన జీలకర్ర – అర టీస్పూను, ఇంగువ – చిటికెడు, కొత్తిమీర తరుగు – పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, అల్లం తరుగు – టీస్పూను, పచ్చిమిర్చి – రెండు (సన్నగా తరగాలి), ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్ – చిల్లా వేయించడానికి సరిపడా. తయారీ: ∙ముందుగా పెసరపప్పుని మూడు నాలుగు సార్లు కడిగి మూడు కప్పులు నీళ్లుపోసి రాత్రంతా నానపెట్టుకోవాలి. సమయం తక్కువగా ఉన్నప్పుడు కనీసం నాలుగు గంటలైనా నానబెట్టాలి. ∙పప్పు నానాక నీళ్లు తీసేసి గరిట జారుడుగా రుబ్బుకోవాలి. ∙రుబ్బిన పిండిలో పసుపు, కారం, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ∙ఈ మిశ్రమంలోనే కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగు, ఇంగువ వేసి కలిపి ఇరవై నిమిషాలపాటు పక్కనబెట్టాలి. ∙ఇరవై నిమిషాల తరువాత పిండి మరీ మందంగా అనిపిస్తే..కొద్దిగా నీళ్లు పోసుకుని దోశపిండిలా కలుపుకోవాలి ∙వేడెక్కిన పెనంపై కొద్దిగా ఆయిల్ వేసి దోశలా పోసుకోవాలి. ∙దోశను రెండు వైపులా క్రిస్పీగా, బ్రౌన్ రంగులోకి మారేంత వరకు కాల్చితే మూంగ్ దాల్ చిల్లా రెడీ. ∙టొమాటో సాస్, చట్నీతో రుచిగా ఉంటుంది. ఆలూ శాండ్ విచ్ కావలసినవి: ఉడికించిన బంగాళ దుంపలు – రెండు (మెత్తగా చిదుముకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు, క్యాప్సికం ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను, కారం – అరటీస్పూను, చాట్ మసాలా – టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, బ్రెడ్ స్లైసులు – ఎనిమిది, టొమాటో సాస్ – నాలుగు టేబుల్ స్పూన్లు, గ్రీన్ సాస్ – నాలుగు టేబుల్ స్పూన్లు, టొమాటో – ఒకటి( సన్నగా చక్రాల్లా తరగాలి), మిరియాల పొడి – టీస్పూను, చీజ్ తరుగు – మూడు టేబుల్ స్పూన్లు, బటర్ – రోస్ట్‌కు సరిపడా. తయారీ: ∙గిన్నెలో చిదుముకున్న బంగాళ దుంపలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, కొత్తిమీర తరుగు, కారం, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ∙రెండు బ్రెడ్ స్లైసులను తీసుకుని ఒక స్లైసుకు టొమాటో సాస్, మరో స్లైసుకు గ్రీన్ చట్నీ రాయాలి. ∙గ్రీన్ చట్నీ రాసిన స్లైసు మీద టొమాటో ముక్కలు పరిచి, వాటి మీద దుంపల మసాలా మిశ్రమాన్ని పెట్టాలి. దీని మీద మిరియాలపొడి, చీజ్‌ను చల్లాలి. ∙ఈ స్లైస్కు టొమాటో సాస్ రాసిన బ్రెడ్స్లైస్ను పెట్టి బటర్‌తో రోస్ట్ చేస్తే ఆలూ శాండ్ విచ్ రెడీ. బ్రెడ్ వడ కావలసినవి: బ్రెడ్ స్లైసులు – ఆరు, బొంబాయి రవ్వ – పావు కప్పు, బియ్యప్పిండి – అరకప్పు, పెరుగు – ముప్పావు కప్పు, ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి), అల్లం పేస్టు – టీస్పూను, పచ్చిమిర్చి – ఒకటి( సన్నగా తరగాలి), కరివేపాకు – రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర – టీస్పూను, ఉప్పు – రుచికి తగినంత, ఆయిల్ – డీప్ ఫ్రైకిసరిపడా. తయారీ: ∙గిన్నెలో బ్రెడ్ స్లైసులను ముక్కలు చేసి వేసుకోవాలి. ∙దీనిలో బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్టు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి ముద్దగా కలపుకోవాలి. ∙మరీ గట్టిగా అనిపిస్తే పిండిలో మరో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి కలుపుకోవచ్చు. ∙ఇప్పుడు చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకుని పిండిని గారెల్లా చేసి ఆయిల్లో డీప్‌ఫ్రై చేసుకోవాలి. ∙మీడియం మంట మీద క్రిస్పీ, గోల్డెన్ బ్రౌన్ లోకి మారేంత వరకు ఫ్రై చేస్తే బ్రెడ్ వడ రెడీ. పెరుగుప్మా కావలసినవి: పెరుగు – అరకప్పు, బొంబాయి రవ్వ – కప్పు, పచ్చిమిర్చి పేస్టు – టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు – అరటీస్పూను, మినపపప్పు – అర టీస్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ∙ముందుగా ఒక గిన్నెలో పెరుగు, పచ్చిమిర్చి పేస్టు, కొద్దిగా ఉప్పు, రెండున్నర కప్పులు నీళ్లుపోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ∙స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ∙తరువాత మినప పప్పు, కరివేపాకు వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ∙ఉల్లిపాయ దోరగా వేగిన తరువాత బొంబాయి రవ్వ వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ∙రవ్వ వేగిన తరువాత కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం, కొత్తిమీర తరుగు వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. ∙మధ్యమధ్యలో తిప్పుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికిస్తే పెరుగుప్మా రెడీ. -
చిప్స్ ప్యాకెట్లో అది చూసి షాక్ అయిన కస్టమర్..!
లండన్: ఇటీవల ఆన్లైన్లో వస్తువులు కొంటున్న వారి సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అలా కొనుగోలు చేసిన వాటిలో ఒకటికి బదులు వేరొక వస్తువులు కస్టమర్లు అందుకున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు ఆనలైన్‌లోనే కాకుండా కొన్ని సార్లు ఆఫ్‌లైన్ కస్టమర్లకు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆలూ చిప్స్ ప్యాకెట్ కొని తెరిచి చూడగా అందులో చిప్స్‌కు బదులు ఒక ఆలుగడ్డ ఉండడం చూసి షాక్ అయ్యాడు. ఈ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. లింకన్షైర్లోని ఉప్పింగ్‌హామ్ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడైన డేవిడ్ బాయ్స్ ఈ నెల 17న కెటిల్ చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. ఎంతో ఆశగా చిప్స్ తినాలని ఆ ప్యాకెట్ తెరిచి చూడగా అందులో ఒక బంగాళదుంప గడ్డ మాత్రమే ఉండడం చూసి ఖంగుతిన్నాడు. షాక్‌లోంచి తేరుకుని దాన్ని ఫొటో తీసి ట్విటర్లో పోస్ట్ చేయడంతో పాటు ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు. ఆ పోస్ట్‌కి క్యాప్షన్‌గా.. ‘నేను ఈ రోజు కెటిల్ చిప్స్ ప్యాకెట్ తెరిచాను. అందులో క్రిప్స్ కనిపించలేదు. కేవలం బంగాళాదుంప గడ్డ మాత్రమే ఉందని తెలిపాడు. దీనిపై సదరు సంస్థ స్పందిస్తూ అతనికి క్షమాపణలు చెప్పింది. ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలియదని.. ఆ ప్యాకెట్‌ను వారికి అందజేస్తే తమ బృందం నుంచి వివరాలు సేకరిస్తామంటూ రీట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారి సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. So I opened a bag of @KETTLEChipsUK today to find no crisps. Just a whole potato. 😮 pic.twitter.com/PGEqGMqIWF — Dr David Boyce (@DrDavidBoyce) October 16, 2021 చదవండి: తల్లిదండ్రులకు షాకిచ్చిన చైనా.. ఇకపై పిల్లలు తప్పు చేశారో అంతే సంగతి.. -
వంట చేను
బంగాళదుంప, పాలకూర, కీరదోస, టొమాటో, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, యాపిల్... ప్రతి కూరగాయ, పండు.. పొలం నుంచి మన ఇంటికి వచ్చే లోపు ఎన్నో మజిలీలు తీసుకుంటుంది. ప్రతి దశలోనూ ఈ కూరగాయలు నేలను తాకుతాయి, మట్టిలో ఈదుతాయి. పండ్ల మీద పురుగులు దాడి చేస్తుంటాయి. పంట చేనులో మొదలయ్యే కల్మషం వంట చేను వరకు ప్రయాణిస్తుంది. కాౖయెనా, ఆకైనా, పండైనా మన కడుపులోకి వెళ్లే ముందు వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. అలా శుభ్రం చేయడానికి జాతీయ, అంతర్జాతీయ పోషకాహార నిపుణులు సూచించిన ఓ ఐదు రకాల పద్ధతులను చూద్దాం. చన్నీటి ధార కింద కడగడం ఇది అత్యంత సులువైన పద్ధతి. కూరగాయలను ఒక పాత్రలో వేసి అవి మునిగేటట్లు నీటిని నింపాలి. నాలుగైదు నిమిషాల తర్వాత వాటిని ఆ నీటిలో నుంచి తీసి నీటి ధార కింద పెట్టి చేత్తో రుద్ది కడగాలి. ఇలా కడిగిన వాటిని మళ్లీ ఒకసారి పాత్రలో నిండుగా నీరు పోసి కడిగి ఆ నీటిని వంపేయాలి. పండ్లు అయినా ఇదే పద్ధతి. పుట్ట గొడుగులను నీటి ధార కింద పెట్టి కడిగితే అవి నలిగిపోతాయి. కాబట్టి నానబెట్టిన తర్వాత వాటిని తడి వస్త్రంతో తుడిచి ఆ తర్వాత నీటిలో ముంచి తేలిగ్గా వేళ్లతో రుద్ది కడగాలి. వెనిగర్ నీటితో కడగడం ఒక లీటరు నీటిలో పది మిల్లీలీటర్ల వెనిగర్ కలిపి ఆ మిశ్రమంలో కూరగాయలను నానబెట్టి, ఇరవై నిమిషాల తర్వాత చేత్తో రుద్ది కడగాలి. ఆ తర్వాత మంచి నీటిలో ముంచి కడగాలి. ఉప్పు నీటితో పండ్లను, కూరగాయలను వెనిగర్ నీటికి బదులుగా ఉప్పు నీరు లేదా బేకింగ్ సోడా నీటితో కూడా శుభ్రం చేయవచ్చు. ఒక లీటర్ నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కానీ ఉప్పు కానీ కలపాలి. ఆ నీటిలో కూరగాయలను ఐదు నిమిషాల సేపు ఉంచాలి. పండ్లు అయితే అరగంట సేపు నానబెట్టాలి. ఆ తర్వాత తిరిగి మంచి నీటితో కడగాలి. బ్లాంచింగ్ ఇది వేడి నీటితో శుభ్రం చేసే ప్రక్రియ. వెడల్పు పాత్రలో నీటిని మరిగించి స్టవ్ ఆపేసి కూరగాయలను వేయాలి. రెండు లేదా మూడు నిమిషాల లోపే వాటిని తీసి చన్నీటి పాత్రలో వేయాలి. వెనిగర్ స్ప్రే దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు బాటిల్లో నిల్వ చేసుకోవచ్చు. ఉపయోగించే ముందు బాటిల్‌ను బాగా కదిలించి కొద్ది మిశ్రమాన్ని చేతుల్లోకి తీసుకుని కూరగాయలకు, పండ్లకు పట్టించి ఒక నిమిషం పాటు రుద్ది తర్వాత చన్నీటితో కడగాలి. జీర్ణవ్యవస్థలో ఎదురయ్యే అనేక అసౌకర్యాలకు కారణం కూరగాయలు, పండ్లను సరైన పద్ధతిలో శుభ్రం చేయకపోవడమే. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మర్చిపోకూడదు. -
ఇంటిప్స్
వంకాయలను కోసిన వెంటనే ఒక స్పూను పాలు కలిపిన నీళ్లలో వేస్తే ముక్కలు నల్లబడవు.బంగాళాదుంపలను వారం పాటు నిలవ చేస్తే మొగ్గలు వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే బంగాళాదుంపలతో పాటు ఒక ఆపిల్‌ను ఉంచాలి.బెండకాయల జిగురు పోవాలంటే వండేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం కాని ఒక స్పూను పెరుగు కాని కలపాలి. కాఫీ కప్పులకు పట్టిన మరకలు పోవాలంటే సోడా నింపి మూడు గంటల తర్వాత కడగాలి. టొమాటోలను తొడిమ కింది వైపుకు వచ్చేటట్లుగా ఉంచితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. -
పండేది నేల కింద... ఉండేది నాల్క మీద!
దుంప వంటకాల టేస్టే వేరు. ఒక్కసారి గానీ వాటి రుచిమరిగితే మళ్లీ మళ్లీ తినేదాకా దుంపతెంపుతాయవి. క్యారట్‌తో హల్వా చేసినా బిట్రూట్తో కబాబ్ కాల్చినా ముల్లంగి కోఫ్తా, ఆలూగోబీల ఫీస్టును మరవలేక మనసు మళ్లీ మళ్లీ ఆ రుచులనే కోరుతుంది. రుచి మూలాలన్నీ కందమూలాల్లోనే ఉన్నాయన్న వాస్తవం మనందరికీ తొలి టేస్టులోనే తెలిసొస్తుంది. స్వీట్ పొటాటో రబ్డీ కావలసినవి: చిలగడ దుంప (కొద్దిగా పెద్దది) – 1 (ఉడికించి తొక్కతీసి మెత్తగా చేయాలి); పాలు – కప్పు; పంచదార – అర టీ స్పూను; గోరు వెచ్చని నీరు – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; నేతిలో వేయించిన జీడిపప్పులు + కిస్మిస్ + బాదం పప్పులు – 2 టీ స్పూన్లు. తయారి: ఒక గిన్నెలో పాలు పోసి, స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙పంచదార, ఉడికించిన చిలగడ దుంప ముద్ద జత చేసి, బాగా కలిపి, చిక్కపడేవరకు ఉడికించాలి ∙అర కప్పుడు గోరు వెచ్చని నీటిలో కుంకుమ పువ్వు వేసి, కరిగించి, ఉడుకుతున్న పాల మిశ్రమంలో వేసి కలిపి, మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి ∙ఏలకుల పొడి, నేతిలో వేయించిన జీడిపప్పు మిశ్రమాన్ని జత చేసి బాగా కలిపి దించేయాలి.చల్లారాక ఫ్రిజ్‌లో సుమారు గంట సేపు ఉంచి గ్లాసులలో పోసి, చల్లగా అందించాలి. మూలీ కే కోఫ్తా కావలసినవి: తెల్ల ముల్లంగి – అరకిలో; పచ్చి కొబ్బరి తురుము – టేబుల్ స్పూను; పల్లీలు – అర టేబుల్ స్పూన్; వేయించిన సెనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు; గరం మపాల – టీ స్పూను; ఎండు మిర్చి – 2; పచ్చి మిర్చి – 1 (చిన్న ముక్కలు చేసుకోవాలి); ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి) సన్నగా తరిగిన కొత్తిమీర – టేబుల్ స్పూను; ఉప్పు తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా గ్రేవీ కోసం... ఎండు మిర్చి – 4; వెల్లుల్లి ముద్ద – టీ స్పూను; ధనియాల పొడి – టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; ఉల్లిపాయ ముద్ద – రెండు టేబుల్ స్పూన్లు; నూనె – 100 మిలీ; పెరుగు – కప్పు; గరం మసాల – టీ స్పూను; ఏలకుల పొడి – అర టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; తయారి: ∙ముల్లంగిని శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా తరిగి, తగినన్ని నీళ్ళు జతచేసి మెత్తగా అయ్యే వరకూ ఉడికించి దింపేయాలి ∙చల్లారాక నీళ్ళు ఒంపేసి ఉడికిన ముల్లంగిని మిక్సీలో వేసి మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙కొబ్బరి తురుము, పల్లీలు, వేయించిన సెనగపప్పు, గరం మసాల, ఎండు మిర్చిలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, చిన్న పాత్రలోకి తీసుకోవాలి. ∙మెత్తగా చేసిన ముల్లంగిలో... పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు, మెత్తగా చేసిన కొబ్బరి తురుము మిశ్రమం జత చేసి బాగా కలపాలి ∙బాణలిలో నూనె కాగాక, ముల్లంగి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. గ్రేవీ తయారీ: ∙మిక్సీలో ఎండు మిర్చి, ఉప్పు, వెల్లుల్లి, ధనియాల పొడి, పసుపు వేసి మెత్తగా చేయాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి మిశ్రమం వేసి దోరగా వేయించాలి ∙ఉల్లి తరుగు, ఉల్లిపాయ పేస్ట్, జత చేసి సుమారు ఐదు నిమిషాలు వేయించాలి ∙పెరుగు, గరం మసాల, ఏలకుల పొడి, అల్లం తురుము ఒకదాని తరవాత ఒకటి జత చేసి బాగా కలపాలి. కప్పుడు నీళ్లు జత చేసి సుమారు మూడు నిమిషాలు ఉడికించాలి ∙తయారుచేసి ఉంచుకున్న మూలీ కోఫ్తాలు వేసి బాగా ఉడికించి వేడివేడిగా అందించాలి. భర్వాన్ ఆలు గోబీ కావలసినవి: బంగాళదుంపలు – 2 (తొక్కు తీసి ముక్కలు చేయాలి); క్యాలీఫ్లవర్ తరుగు – కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఫిల్లింగ్ కోసం... చీజ్ తురుము – అర కప్పు; కిస్మిస్ – 15; దానిమ్మ గింజలు – 3 లేబుల్స్పూన్లు; సన్నగా తరిగిన జీడిపప్పు – 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; అల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి కోవా – 4 టేబుల్ స్పూన్లు పిండి కోసం... సెనగ పిండి – 2 కప్పులు; వాము – టేబుల్ స్పూను; వెల్లుల్లి ముద్ద – టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; మిరపపొడి – కొద్దిగా; నీళ్లు – తగినన్ని తయారి: ∙ఒక పాత్రలో నీళ్లు, ఉప్పు, క్యాలీఫ్లవర్, బంగాళదుంప ముక్కలు, పసుపు వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించి పక్కన ఉంచాలి ∙పిండి కోసం తీసుకున్న పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి, తగినన్ని నీళ్లు జత చే సి, పకోడీల పిండిలా కలుపుకోవాలి ∙ఒక పాత్రలో ఫిల్లింగ్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి బాగా కలపాక, ఉడికించిన బంగాళదుంప ముక్కల మిశ్రమం జత చేసి మరోమారు కలిపి, చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె కాగాక సెనగపిండి మిశ్రమంలో ... బజ్జీల మాదిరిగా ఈ ఉండలను ఒక్కక్కటిగా ముంచుతూ కాగిన నూనెలో వేసి ముదురు గోధుమ రంగులోకి వచ్చాక తీసేయాలి ∙టొమాటో సాస్‌తో వేడివేడిగా అందించాలి. బీట్రూట్ కబాబ్ కావలసినవి: బీట్రూట్ తురుము – కప్పు; పనీర్ తురుము – అర కప్పు; వెల్లుల్లి ముద్ద – అర టేబుల్ స్పూను; ఆమ్చూర్ పొడి – టేబుల్ స్పూను; వేయించిన నువ్వుల పొడి – టేబుల్ స్పూను; చాట్ మసాలా – చిటికెడు; ఉప్పు – తగినంత; సన్నగా తరిగిన జీyì పప్పులు – పావు కప్పు; పొడి చేసిన ఓట్స్ – అర కప్పు; నూనె – తగినంత తయారి: ∙ఒక పాత్రలో బీట్రూట్ తురుము, పనీర్ తురుము, వెల్లుల్లి ముద్ద, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, ఉప్పు, నువ్వుల పొడి వేసి బాగా కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చేసి, చేతిలోకి తీసుకుని ఒక్కో ఉండను చేతితో అదమాలి ∙జీడిపప్పు పొడిని మధ్యలో ఉంచి చుట్టూ మూసేయాలి ∙ఓట్స్ పొడిలో దొల్లించి పక్కన ఉంచాలి ∙పాన్ మీద నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న కబాబ్‌లను రెండు వైపులా కాల్చి కొత్తిమీర చట్నీతో అందించాలి. గాజర్ హల్వా కావలసినవి: గాజర్ తురుము – కప్పు; పాలు – అర లీటరు; పంచదార – 3 టేబుల్ స్పూన్లు; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూన్; జీడి పప్పు పలుకులు – టేబుల్ స్పూన్; కిస్మిస్ – టేబుల్ స్పూన్. తయారి: ∙స్టౌ మీద బాణలిలో పాలు పోసి మరిగించాలి ∙బాగా మరిగి సగం అయ్యేవరకూ కలుపుతుండాలి ∙వేరొక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక గాజర్ తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి మరిగిన పాలలో వేయాలి ∙బాగా కలుపుతూ, పంచదార జత చేసి సన్నని మంటపై ఉడికించాలి ∙బాణలిలో నెయ్యి వేసి, కరిగాక జీడిపప్పు, కిస్మిస్ వేయించి ఉడికిన గాజర్ హల్వాలో వేయాలి ∙ఏలకుల పొడి జత చేసి, బాగా కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి. -
సీఎం ఇంటిముందు ఆలుగడ్డల నిరసన
సాక్షి, లక్నో : సీఎం యోగి ఆదిత్యానాథ్ నిర్ణయాలపై ఉత్తర ప్రదేశ్ రైతులు ఉగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆలుగడ్డ పంటకు ఇచ్చిన మద్దతు ధరపై రైతులు మండిపడుతున్నారు. క్వింటాల్‌కు రూ. 1000 రూపాయలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తే యోగి ఆదిత్యనాథ్.. కేవలం రూ.487 ఇచ్చారు. యోగీ నిర్ణయంతో ఆలు రైతులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ క్రమంలోనే యోగి ఆదిత్యనాథ్‌కు రైతులు వినూత్నంగా తమ నిరసన తెలిపారు. శనివారం రాత్రి.. రైతులు క్వింటాళ్ల మొత్తంలో తీసుకువచ్చిన ఆలుగడ్డలను యోగి ఆదిత్యనాథ్ ఇంటి ఆవరణలో పడేసి వెళ్లిపోయారు. నిరసన తెలిపేందుకు వస్తున్న రైతులను నిలువరించలేదన్న కారణంతో.. ఒక సబ్ ఇన్స్పెక్టర్, నలుగురు కానిస్టేబుళ్లపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇదిలావుండగా.. రైతుల సమస్యలను పరిష్కరించేక్రమంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ మీరట్‌లో తెలిపారు. గత పాలకులు రైతుల సమస్యలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయాని ఆయన చెప్పారు. -
ఆరోగ్యానికి ఆలూ మేలు ఇలా!
ఆలుగడ్డ లేదా ఆలూ లేదా బంగాళదుంప అని పిలిచే ఈ దుంప మీద కాస్త వివక్ష ఉంది. ఇవి తింటే లావెక్కుతారనీ కొందరి అపోహ. అలాగే డయాబెటిస్ రోగులు వీటిని తినకూడదని కూడా అంటారు. ఇది పాక్షిక సత్యం మాత్రమే. ఇందులో చాలా పోషకాలతో పాటు పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) చాలా ఎక్కువ కాబట్టి తక్షణ క్యాలరీలను అంటే శక్తిని ఇస్తాయి. అందుకే కొంతమంది ఇవి డయాబెటిస్ రోగులకు మంచివి కావని అంటారు. అయితే ఆలూను స్టోర్‌హౌజ్ ఆఫ్ ఎనర్జీ అంటారు. అంటే ఇవి ఎక్కువ క్యాలరీలను తక్షణం అందిస్తాయి కాబట్టి ఒక మోతాదుకు మించకుండా తినడం చాలా మేలు చేస్తుంది. ♦ ఆలుగడ్డల్లో పీచు చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా దాని పై పొట్టులో పీచు ఎక్కువ. అందుకే మరీ తప్పకపోతే తప్ప తొక్క తియ్యకుండా వండితింటేనే మంచిది. ఎందుకంటే పొట్టులోని పీచు పొట్టను శుభ్రం చేస్తుంది. మలబద్ధకం లేకుండా చూస్తుంది. ♦ఆలూలో విటమిన్–సి, బి–కాంప్లెక్స్‌తో పాటు పొటాషియమ్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, జింక్ ఉంటాయి. ఇవన్నీ మేనికి నిగారింపు ఇచ్చే పదార్థాలే. ఏజింగ్ ప్రక్రియను ఆలస్యం చేసి మేను మిలమిలలాడేలా చేస్తాయి. ♦ ఆలూ రక్తపోటును తగ్గిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... ఆలూను వేపుళ్ల రూపంలో తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఉడికించి తినడం ఉత్తమం. -
బంగాళా దుంప బంగారం అవుతుందా?
సాక్షి, గాంధీనగర్ : గుజరాత్‌లోని పటానలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ బంగాళా దుంపలతోని బంగారాన్ని తయారు చేసే యంత్రం గురించి వివరించారంటూ సోషల్ మీడియా గత రెండు రోజులుగా ఆయన్ని హేళన చేస్తోంది. ‘రాహుల్ గాంధీజీ! ఒకపక్క నుంచి బంగాళా దుంపలను పెడితే మరోపక్క నుంచి బంగారం వచ్చే మీ యంత్రం గురించిన ఫార్ములాను తెలియజేయండి. నేను స్టార్టప్ కంపెనీ పెడతానని ఒకరు... అసలు రెండు పక్కల నుంచి కూడా బంగాళా దుంపలను పెడితే ఏం వస్తుందని మరోకరు.. బంగాళా దుంపల ఫ్యాక్టరీలోకి వెళ్లేముందు బప్పీలహరీ అన్న శీర్షికతో మెడలో తరిగిన బంగాళా దుంపల దండవేసుకున్న ఫొటోను, ఆ తర్వాత బంగాళా దుంపల ఫ్యాక్టరీ నుంచి వస్తున్న బప్పీలహరీ అంటూ.. మెడలో బంగారు గొలుసు వేసుకున్న బప్పీలహరి ఫొటోను ట్వీట్ చేయగా, ఏకంగా ముగి బంగారాన్ని అమ్ముతున్న రాహుల్ గాంధీ.. అంటూ ఆలు గడ్డలుగల తోపుడు బండీతో రాహుల్ (మార్ఫింగ్) ఫొటోను ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడిన సందర్భాన్ని తీసేసి కేవలం కేవలం ‘ఇటు నుంచి ఆలు పెడితే అటు నుంచి బంగారం వచ్చే యంత్రాన్ని ఇస్తాను. ఇటు నుంచి ఆలు పెట్టండి, అటు నుంచి బంగారాన్ని తీసుకోండి. దీనివల్ల ఎంత డబ్బుస్తొందంటే దాన్ని ఏం చేసుకోవాలో కూడా మీకు తెలియదు’ అన్న మాటలను మాత్రమే కత్తిరించి సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో ఇలాంటి ట్వీట్లు వెల్లువెత్తాయి. వాస్తవానికి దేశ ప్ర«ధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని ఆదివాసీలకు 40వేల కోట్ల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేస్తానని చెప్పి చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేక పోయారని, వరదల వచ్చిన సందర్భంగా తక్షణ ఆర్థిక సహాయం కింద 500 కోట్ల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి, అందులో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇక ఆలు రైతులకు ఎలాంటి హామీ ఇచ్చారంటే ఇటు నుంచి ఆలు పెడితే అటు నుంచి బంగారం వచ్చే యంత్రాన్ని ఇస్తానని, ఇటు నుంచి ఆలు పెట్టండి, అటు నుంచి తీసుకోండి’ అని రాహుల్ వ్యంగ్యంగా విమర్శించారు. ఏ మీడియాలోనైనా సరే వ్యంగ్యమైన, హాస్యమైనా, ఛలోక్తులైనా వాస్తవానికి విరుద్ధంగా ఉండకూడదు, ఓ క్యారెక్టర్‌ను హత్య చేసే విధంగా అసలే ఉండకూడదు. ఇక్కడ సోషల్ మీడియాలో రాహుల్‌పై హేళన వ్యాఖ్యలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి మరి. అసలు బంగాళా దుంపలతో బంగారం అవుతుందా? ఈ వ్యాఖ్యను చూడగానే ఎవరికైనా అది వ్యంగోక్తి అని అర్థం అవుతుంది కదా! -
వీటి దుంపతెగ!
బ్రిటన్: కండలు తిరిగిన మల్లయోధుల్లా కలబడుతోన్న ఈ గొరిల్లాలను చూశారా..? చూపరులకు రోమాలు నిక్కబొడిచే ఈ పోరాటం బ్రిటన్‌లోని ఓ జూలో జరిగింది. 33 ఏళ్ల పెర్టినాక్స్, 13 ఏళ్ల కియాండోలు భీకరంగా పోరాడింది దేనికోసమో తెలుసా..? ఉడికించిన బంగాళాదుంప కోసం!! అవును, శాకాహారులైన ఈ భారీ క్షీరదాలు మంచి ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇస్తాయి. -
దీని ‘దుంప’తెగ.. ఏం రేటు!!
ఈ బంగాళదుంప ఫొటోను చూస్తే సాదాసీదాగా కనిపిస్తోంది కదూ. కానీ ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫొటోల్లో ఒకటి. దీన్ని గతేడాది 10 లక్షల డాలర్లకు విక్రయించారు. కెవిన్ అబోస్ అనే ఫొటో గ్రాఫర్ దీన్ని చిత్రీకరించారు. ఆయన సిలికాన్ వ్యాలీ టెక్‌లోని ప్రముఖ వ్యాపారులకు ఫొటో షూట్ తీసి భారీ మొత్తంలో వసూలు చేస్తుంటాడు. ఒక ఫొటో షూట్ కోసం లక్షా 50 వేల డాలర్ల నుంచి అత్యధికంగా 5 లక్షల డాలర్ల వరకు తీసుకుంటాడు. ఇతనిలో దీంతో పాటు ఫైన్ ఆర్ట్ ఫొటో గ్రాఫర్(లలిత కళా ఛాయాకారుడు) కూడా దాగి ఉన్నాడు. దాని మూలంగానే ఈ ఫొటో రూపుదిద్దుకుంది. ఎన్ని రకాలుగా ఉన్నా మనుషులుగా గుర్తించవచ్చని.. అలాగే బంగాళదుంపలను కూడా అని.. అందుకే తనకు ఇవి ఇష్టమని ఆయన తెలిపాడు. కాగా, ఇలాంటి ఫొటోలను సేకరించే పీటర్ అనే ఒక సంపన్న వ్యక్తి 2015లో కెవిన్ ఇంటిని సందర్శించినప్పుడు ఈ బంగాళ దుంప ఫొటోను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం టాప్ 20 అత్యంత విలువైన ప్రారంభ కొనుగోలు ధరల్లో దీనికి చోటు లభించింది. - పారిస్