ఆలుగడ్డ లేదా ఆలూ లేదా బంగాళదుంప అని పిలిచే ఈ దుంప మీద కాస్త వివక్ష ఉంది. ఇవి తింటే లావెక్కుతారనీ కొందరి అపోహ. అలాగే డయాబెటిస్ రోగులు వీటిని తినకూడదని కూడా అంటారు. ఇది పాక్షిక సత్యం మాత్రమే. ఇందులో చాలా పోషకాలతో పాటు పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) చాలా ఎక్కువ కాబట్టి తక్షణ క్యాలరీలను అంటే శక్తిని ఇస్తాయి. అందుకే కొంతమంది ఇవి డయాబెటిస్ రోగులకు మంచివి కావని అంటారు. అయితే ఆలూను స్టోర్‌హౌజ్ ఆఫ్ ఎనర్జీ అంటారు. అంటే ఇవి ఎక్కువ క్యాలరీలను తక్షణం అందిస్తాయి కాబట్టి ఒక మోతాదుకు మించకుండా తినడం చాలా మేలు చేస్తుంది.
♦ ఆలుగడ్డల్లో పీచు చాలా ఎక్కువ. మరీ ముఖ్యంగా దాని పై పొట్టులో పీచు ఎక్కువ. అందుకే మరీ తప్పకపోతే తప్ప తొక్క తియ్యకుండా వండితింటేనే మంచిది. ఎందుకంటే పొట్టులోని పీచు పొట్టను శుభ్రం చేస్తుంది. మలబద్ధకం లేకుండా చూస్తుంది.
♦ఆలూలో విటమిన్–సి, బి–కాంప్లెక్స్‌తో పాటు పొటాషియమ్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, జింక్ ఉంటాయి. ఇవన్నీ మేనికి నిగారింపు ఇచ్చే పదార్థాలే. ఏజింగ్ ప్రక్రియను ఆలస్యం చేసి మేను మిలమిలలాడేలా చేస్తాయి.
♦ ఆలూ రక్తపోటును తగ్గిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... ఆలూను వేపుళ్ల రూపంలో తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఉడికించి తినడం ఉత్తమం.
ఆరోగ్యానికి ఆలూ మేలు ఇలా!
Published Thu, Nov 30 2017 1:17 AM | Last Updated on Thu, Nov 30 2017 4:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment