
సాక్షి, లక్నో : సీఎం యోగి ఆదిత్యానాథ్ నిర్ణయాలపై ఉత్తర ప్రదేశ్ రైతులు ఉగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆలుగడ్డ పంటకు ఇచ్చిన మద్దతు ధరపై రైతులు మండిపడుతున్నారు. క్వింటాల్‌కు రూ. 1000 రూపాయలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తే యోగి ఆదిత్యనాథ్.. కేవలం రూ.487 ఇచ్చారు. యోగీ నిర్ణయంతో ఆలు రైతులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
ఈ క్రమంలోనే యోగి ఆదిత్యనాథ్‌కు రైతులు వినూత్నంగా తమ నిరసన తెలిపారు. శనివారం రాత్రి.. రైతులు క్వింటాళ్ల మొత్తంలో తీసుకువచ్చిన ఆలుగడ్డలను యోగి ఆదిత్యనాథ్ ఇంటి ఆవరణలో పడేసి వెళ్లిపోయారు. నిరసన తెలిపేందుకు వస్తున్న రైతులను నిలువరించలేదన్న కారణంతో.. ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, నలుగురు కానిస్టేబుళ్లపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
ఇదిలావుండగా.. రైతుల సమస్యలను పరిష్కరించేక్రమంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ మీరట్‌లో తెలిపారు. గత పాలకులు రైతుల సమస్యలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయాని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment