ఇంటిప్స్‌ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్‌

Published Tue, Oct 31 2017 12:27 AM | Last Updated on Tue, Oct 31 2017 12:27 AM

 home made tips

►గ్రేవీ చిక్కగా రావాలంటే, కొద్దిగా కొబ్బరి పాలు లేదా గిలక్కొట్టిన పెరుగు వేసుకోవచ్చు
►కూరలో నూనె ఎక్కువైతే, రెండు బ్రెడ్‌స్లైసుల్ని పొడిలా చేసి అందులో వేస్తే సరి.
►బంగాళదుంపల వేపుడు కరకరలాడేలా ఉండాలంటే, ముక్కలు తరిగాక అరగంటసేపు చల్లని నీళ్లలో ఉంచి ఆ తరవాత వేయించాలి.
►బాదం పప్పులు ఉంచిన డబ్బాలో ఒక గుప్పెడు పంచదార, రెండు లవంగాలు వేస్తే పురుగు పట్టకుండా తాజాగా ఉంటాయి.
►బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే చిటికెడు పసుపు, చెంచాడు వేరుసెనగనూనె కలపాలి.
►ఉల్లిపాయల్ని వేపుడులో వాడటానికి ముందు కొద్దిసేపు పాలలో నాననిస్తే, పదార్థాలకి మరింత రుచి వస్తుంది.
►నెయ్యి తాజాగా ఉండాలంటే గిన్నె అడుగున చిన్న బెల్లం ముక్క వేస్తే సరి.
►కూరల్లో వెల్లుల్లి వేయాలనుకుంటే, ముందు వాటిని దోర గా వేయించి వాడాలి. అప్పడు పదార్థాలకు మంచి రుచి వస్తుంది. గాఢమైన వాసన లేకుండా ఉంటుంది.
►రసం తీసిన నిమ్మచెక్కలను పారేయకుండా, ఉడికించి ఆ నీళ్లలో స్పాంజిని ముంచి స్టౌవ్‌లు, స్టీలు సామాన్లను తుడిస్తే త్వరగా శుభ్రపడతాయి.
►లంచ్‌ బాక్సులను కడిగి తుడిచి కాస్త వంటసోడా వేసి మూతపెడితే, ఆహార పదార్థాల తాలూకు దుర్వాసన రాకుండా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement