శీతాకాలం అనగానే మనకు గుర్తుకు వచ్చేవి ఎలర్జీ సమస్యలు. మన పరిసరాలలో లేదా మన ఇంట్లోనే ఇలాంటి ఎలర్జీలతో బాధపడేవారిని చూస్తూ ఉంటాం. శీతాకాలంలో వీరు చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. దీనివల్ల పిల్లలు స్కూల్‌కి వెళ్లకుండా, పెద్దవారైతే ఆఫీస్‌లకి వెళ్లలేక, దినచర్య లో ఇబ్బందులు ఎదుక్కొంటారు. ప్రతీ సంవత్సరం శీతాకాలం వస్తుంది అనగానే చాలామంది వారివారి ఆహారపు అలవాట్లను, జీవన విధానాలను మార్చుకుంటారు. చల్లని నీరు, శీతల పానీయాలు సేవించకుండా, ఇతరేతర జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎలర్జీ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురవుతారు.
‘ఎలర్జీ’ అంటే ఏంటి?
మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ యొక్క అసందర్భ ప్రతిచర్యను ‘ఎలర్జీ’ అంటారు. అంటే ఏదైనా ఒక పదార్థానికి శరీరం సాధారణ స్థితి కంటే ఎక్కువ మొత్తంలో ప్రతిక్రియను చూపడం. ఆ పదార్థాలను ‘ఎలర్జెంట్’ అని, ప్రతిచర్యను ‘ఎలర్జిక్ రియాక్షన్’ అని అంటారు.
సర్వసాధారణంగా మనం చూసే శ్వాసకోశ ఎలర్జీలు
ఎలర్జిక్ రైనైటిస్: ఎలర్జిక్ రైనైటిస్ అనగా ఒక వ్యక్తి, పైన తెలిపిన ఎలర్జిక్ కారకాలకు గురైనప్పుడు ముక్కులోని శ్లేష్మ పొర వాపునకు గురై ముక్కు నుండి నీరులాంటి ద్రవం కారటం, తుమ్ములు, ముక్కుదిబ్బడ, కళ్లల్లో, అంగిలిలో దురద, చికాకు, నిద్రలేమి, మగతగా ఉండటం, స్వల్ప జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కనిపిస్తాయి.
ఎలర్జిక్ సైనసైటిస్: సైనస్ అంటే ప్రతిమనిషి ముఖంలో కళ్ల కింద, ముక్కు పక్కల ఎముకలలో ఉండే సన్నని గాలి నిండిన ప్రాంతాలు. ఇవి మనం స్పష్టంగా మాట్లాడటానికి ఉపకరిస్తాయి. సైనస్‌లోని శ్లేష్మ పొర వాపునకు గురికావడాన్ని సైనసైటిస్ అంటాం. దీర్ఘకాలికంగా ఎలర్జిక్ రైనైటిస్‌తో బాధపడేవారు ఎలర్జిక్ సైనసైటిస్‌కు దారితీసే అవకాశం ఉంటుంది. దీనిలో ముఖ్యంగా తలనొప్పి, చిరాకు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం, జ్వరం రావటం, చెవినొప్పి, ముఖం స్వల్పంగా వాపునకు గురై నొప్పి కలుగుతుంది. పోస్ట్ నాజల్ డ్రిప్.
ఎలర్జిక్ బ్రాంకైటిస్, ఆస్తమా: శరీరతత్వానికి సరిపడని ఎలర్జిన్‌లు గాలి ద్వారా శరీరంలోని శ్వాసనాళాలలోకి చేరినప్పుడు ప్రతిచర్యగా మన రోగనిరోధకశక్తి స్పందించి వివిధరకాల రసాయనాలు విడుదల చేసి శ్వాసనాళాలలోని శ్లేష్మపొర వాపునకు గురి అవుతాయి. దీనివల్ల శ్వాసనాళాలు సంకోచానికి గురై గాలి రవాణాకు ఆటంకం కలిగి... దగ్గు, ఆయాసం, ఛాతి బరువుగా ఉండటం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, పిల్లికూతలు మొదలగు లక్షణాలు చూస్తాం. ఈ ఎలర్జిక్ ఆస్తమా వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఇది ముఖ్యంగా పిల్లల్లో సర్వసాధారణంగా చూస్తాం. పైన తెలిపిన ఎలర్జిక్ కారకాల వల్ల ఆస్తమా వ్యాధి తీవ్రతరం కావచ్చు. కాబట్టి ఈ ఎలర్జిక్ కారకాలకు దూరంగా ఉండడం వల్ల దీనిని అదుపులో ఉంచవచ్చును.
వ్యాధి నిర్థారణ పరీక్షలు:
=సి.బి.పి, ఇ.ఎస్.ఆర్.
=అబ్‌సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ (ఎ.ఇ.సి)
=ఐజి. ఇ. యాంటిబాడీస్ ఎక్స్‌రే - పి.ఎన్.ఎస్.
=సి.టి.స్కాన్ - పి.ఎన్.ఎస్. ఎక్స్‌రే - చెస్ట్
= స్పిరోమెట్రీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్
మొదలగు వ్యాధి నిర్థారణ పరీక్షల ద్వారా వ్యాధి త్రీవతను, ఇతర
వ్యాధులను నిర్థారణ చేయవచ్చు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
=దుమ్ము, ధూళి నుండి దూరంగా ఉండాలి
= శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్‌లు తినకూడదు
= పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి
= ఇంటి పరిసర ప్రాంతాలలో ఉండే పార్థినియం మొక్కలను తొలగించి, పుప్పొడికి దూరంగా ఉండాలి.
హోమియో చికిత్స
మానవుడు ప్రకృతిని పరిశీలించి అనుకరించడం వల్ల వివిధరకాల విజ్ఞానశాస్త్రాలను కనుగొన్నాడు. అందులో హోమియోపతి కూడా ఒకటి. ఇది పూర్తిగా ప్రకృతి నియమాలపై ఆధారపడి పనిచేస్తుంది (సిమిలియా - సిమిలిబస్ కురాంటర్). హోమియో వైద్యవిధానం ద్వారా అన్నిరకాల ఎలర్జిక్ సమస్యలను పూర్తిగా నయం చేయవచ్చును. హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ఎలాంటి ఎలర్జీలకు సంబంధించిన వ్యాధినైనా అధునాతన జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ సిమిలిమమ్ ద్వారా, అసమతుల్యతలకు గురైనటువంటి రోగనిరోధకశక్తిని సరిచేస్తారు. వ్యాధి తిరగబెట్టకుండా సంపూర్ణంగా తగ్గించడమే కాకుండా, పైన తెలిపిన ఎలర్జిక్ పదార్థాలకు సమర్థవంతంగా తట్టుకునేలా ఇమ్యూన్ సిస్టమ్‌ను బూస్ట్ చేసి అన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా ఆరోగ్యవంతంగా ఉండేలా దోహదం చేస్తుంది.
ఎలర్జీ కారకాలు
=వాతావరణ మార్పు... ముఖ్యంగా శీతాకాలం
=దుమ్ము, ధూళి
= ఘాటైన వాసనలు, మస్కిటో రిపెలెంట్స్, వివిధ రకాలైన స్ప్రేలు
= పెంపుడుజంతువులు, వాటి వెంట్రుకలు, విసర్జకాలు, పూలమొక్కల నుండి వచ్చే పుప్పొడి రేణువులు (పార్థినియం హిస్టిరోఫోనికా)
=శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్స్
= చాలామందిలో ఈ ఎలర్జీలు వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి.