1918 - 2018: వందేళ్ల క్రితం ఆడవాళ్లు | hundred years of Womens have a right to vote | Sakshi
Sakshi News home page

1918 - 2018: వందేళ్ల క్రితం ఆడవాళ్లు

Published Thu, Feb 8 2018 12:19 AM | Last Updated on Sat, Feb 10 2018 3:57 PM

hundred years of Womens have a right to vote - Sakshi

మహిళలకు ఓటు హక్కు వచ్చి నూరేళ్లు అయిన సందర్భంగా బ్రిటన్‌ పార్లమెంటులో మహిళా ఎంపీల గ్రూప్‌ ఫొటో 

►వారసత్వంగా ఆస్తి పొందడానికి లేదు.  (1922లో ‘లా ఆఫ్‌ ప్రాపర్టీ’ వచ్చాక ఆ పరిస్థితి మారింది).
►అకౌంటెంట్‌ అవడానికి,  మేజిస్ట్రేట్‌ అవడానికి లేదు. ( 1919 నాటి సెక్స్‌ డిస్‌క్వాలిఫికేషన్‌ (రిమూవల్‌) యాక్ట్‌ వచ్చాక ఆ పరిస్థితి మారింది).
►బ్యాంకు అకౌంట్‌ తెరవడానికి లేదు. బ్యాంకు రుణం పొందడానికి లేదు. (1975లో ఆ పరిస్థితి మారింది). 
►పబ్బుల్లో సొంతంగా డబ్బు ఖర్చు చేయడానికి లేదు.  ( 1982లో ఆ పరిస్థితి మారింది).
►సమాన వేతన హక్కు లేదు.(1970 నాటి సమాన వేతన చట్టంతో ఆ పరిస్థితి మారింది).
►చట్టం దృష్టిలో ఒక ‘వ్యక్తి’ కాదు! (1929లో ఆ పరిస్థితి మారింది).
►‘హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’లో కనిపించడానికి లేదు.(1958 లో ‘లైఫ్‌ పీరేజస్‌ యాక్ట్‌’తో ఆ పరిస్థితి మారింది.)
►లండన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో పని చేయడానికి లేదు. (1973లో ఆ పరిస్థితి మారింది).
►క్రూరుడైన భర్తకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లేందుకు లేదు.(1976 డొమెస్టిక్‌ వయలెన్స్‌ అండ్‌ మ్యాట్రిమోనియల్‌ ప్రొసీడింగ్స్‌ యాక్ట్‌తో ఆ పరిస్థితి మారింది).
►అవివాహిత అయితే గనుక గర్భనిరోధక మాత్రలు కొనడానికి లేదు.(1967లో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ యాక్టుతో ఆ పరిస్థితి మారింది. 
►చట్టపరంగా గానీ, వైద్యపరంగా గానీ సురక్షితమైన అబార్షన్‌ చేయించుకోడానికి లేదు. (1967 అబార్షన్‌ యాక్ట్‌ తో ఆ పరిస్థితి మారింది). 
►భర్త రేప్‌ చేస్తున్నాడని ఫిర్యాదు చేయడానికి లేదు. ( 1991లో ఆ పరిస్థితి మారింది).

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement