ఐఈఎల్‌టీఎస్ స్కాలర్‌షిప్ అవార్డ్
స్కాలర్‌షిప్
ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించాలనుకునేవారికి ఇచ్చే ఐఈఎల్‌టీఎస్ (ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) స్కాలర్‌షిప్ అవార్డ్‌కు ప్రకటన విడుదలైంది. ఈ స్కాలర్‌షిప్స్‌ను బ్రిటిష్ కౌన్సిల్ అందిస్తోంది.
మొత్తం స్కాలర్‌షిప్స్: 8
ఒక్కో స్కాలర్‌షిప్ విలువ: రూ.3 లక్షలు (ట్యూషన్ ఫీజుల కోసం)
అర్హత: భారతీయ పౌరులై, భారతదేశంలోనే నివసిస్తుండాలి.
ఇటీవల ఐఈఎల్‌టీఎస్ రాసి కనీసం 6.0 స్కోర్ సాధించి ఉండాలి.
2014 అకడెమిక్ ఇయర్‌లో విదేశాల్లో అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులు చదవడానికి సిద్ధంగా ఉండాలి.
ఐఈఎల్‌టీఎస్ స్కోర్‌తో ప్రవేశం పొందినట్లు సంబంధిత విదేశీ విద్యా సంస్థ పంపిన ఆఫర్ లెటర్/ప్రవేశ పత్రం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 30, 2014 వెబ్‌సైట్: www.britishcouncil.in