IELTS (International English Language Testing System) The British Council
-
IELTS Row: అడ్డంగా దొరికిపోయి భారత్ పరువు తీశారు!
అహ్మదాబాద్: అగ్రరాజ్యం గడ్డపై భారత్ పరువు పోయిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంగ్లీష్ భాష సామర్థ్యపు పరీక్ష ఐఈఎల్‌టీఎస్‌లో అర్హత సాధించిన ఆరుగురు భారతీయ విద్యార్థులు.. అమెరికాలో అక్రమ చొరబాటుకు ప్రయత్నించడంతో పాటు కోర్టులో ఇంగ్లీష్‌లో సమాధానాలు ఇవ్వలేక మౌనంగా ఉండిపోయారు. దీంతో అమెరికా నేరవిభాగం ఆదేశాలతో.. ఐఈఎల్టీఎస్ పరీక్ష అవకతవకలపై గుజరాత్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. రెండు వారాల కిందట.. అమెరికా-కెనడా సరిహద్దులో అక్వేసాసేన్ వద్ద సెయింట్ రెగిస్ నదిలో మునిగిపోతున్న ఓ పడవ నుంచి కొందరిని అమెరికా సిబ్బంది రక్షించారు. అందులో ఆరుగురు భారత విద్యార్థులు ఉన్నారు. అయితే ఆ ఆరుగురు జడ్జి అడిగిన ప్రశ్నలకు ఇంగ్లీష్‌లో సమాధానాలు ఇవ్వలేక తడబడ్డారు. దీంతో అప్పటికప్పుడు ఓ హిందీ ట్రాన్స్‌లేటర్ సాయంతో కోర్టు వాళ్ల నుంచి వాంగ్మూలం సేకరించింది. ► కెనడా నుంచి వాళ్లు అక్రమంగా అమెరికాలోకి చొరబడాలని ప్రయత్నించినట్లు తేలింది. అయితే ఐఈఎల్‌టీఎస్‌లో వీళ్లు 6.5 నుంచి 7 మధ్య స్కోర్ చేశారని తెలియడంతో కోర్టు సైతం ఆశ్చర్యపోయింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ముంబైలోని అమెరికా క్రిమినల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్.. దర్యాప్తు చేపట్టాల్సిందిగా మెహ్సనా(గుజరాత్) పోలీసులకు మెయిల్ చేసింది. ► ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ IELTS.. ఇంగ్లీష్ సామర్థ్యాన్ని నిరూపించుకునే పరీక్ష. చాలా దేశాల్లో మంచి కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షలో మంచి స్కోర్ అవసరం కూడా. అయితే.. ► భారతీయ విద్యార్థుల అక్రమ చొరబాటు వార్త వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో భిన్న చర్చ నడిచింది. జుగాద్ కల్చర్ అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లారంటూ కొందరు సెటైర్లు పేలుస్తుంటే.. పరీక్షలో మోసం చేసి న్యూజెర్సీ దాకా వెళ్లి మరీ భారత దేశ పరువు తీశారని, మరికొందరు విద్యార్థుల ప్రయత్నాలపై ఇది ప్రభావం చూపెడుతుందని అంటున్నారు. ► విద్యార్థులంతా 19 నుంచి 21 ఏళ్లలోపు వాళ్లే. వారిలో నలుగురు దక్షిణ గుజరాత్ నవసారీ టౌన్లో సెప్టెంబర్ 25, 2021లో పరీక్ష రాశారని పోలీసులు ధృవీకరించారు. స్టూడెంట్ వీసా మీద మార్చి 19న కెనడాకు వెళ్లారు. అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందారు. ఆపై అక్రమంగా అమెరికాలోకి చొరబడే ప్రయత్నాలు చేస్తూ.. రెండు వారాల కిందట యూఎస్-కెనడా సరిహద్దులో అడ్డంగా దొరికిపోయారు. ఇక ఈ ఘటనపై గుజరాత్ పోలీసులు స్పందించారు. IELTS పరీక్ష జరిగిన రోజున.. నవసారీ టౌన్‌లోని ఎగ్జామ్ సెంటర్లోని సీసీటీవీ కెమెరాలన్నీ ఆఫ్‌లో ఉన్నాయని స్థానిక అధికారి రాథోడ్ తెలిపారు. విచారణలో భాగంగా విద్యార్థులు పరీక్షలకు హాజరైన ఏజెన్సీ నిర్వాహకులను సైతం పిలిపించుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇక ఈ రాకెట్ గుట్టువీడడంతో మరో మూడు కేంద్రాలను సైతం పరీలిస్తున్నారు కూడా. -
చదువుకు వయస్సుతో పని లేదు
పంజాబ్: చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడు ఒక వృద్థుడు. వివరాల్లోకి వెళ్తే పంజాబ్‌కు చెందిన 83 ఏళ్ల సోహన్ సింగ్ గిల్ జలందర్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ ఇంగ్లీష్ మాస్టర్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. పంజాబ్ హోషియార్‌పూర్‌లో, 1937,ఆగస్టు15న జన్మించిన గిల్ 1957లో అమృత్సర్ జిల్లాలో గల కల్సా కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, టీచింగ్ కోర్స్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా గిల్ మాట్లాడుతూ కాలేజీలో చదివే రోజుల్లో వైస్ ప్రిన్సిపల్ వర్యమ్ సింగ్ నాకు మాస్టర్స్ చదవాలనే ప్రేరణ కలిగించారు. డిగ్రీ తరువాత పీజీ చేయాలనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కెన్యా నుంచి టీచర్ ఉద్యోగం రావడంతో పీజీ చేయాలనే నా కోరిక తీరలేదు’ అన్నాడు గిల్. 1991లో భారత్‌కు తిరిగి వచ్చాక వివిధ పాఠశాలల్లో అధ్యాపకునిగా సేవలందించానని, అయితే పీజీ చేయాలనే బలమైన కోరిక తీరలేదనే బాధ ఉండేదని గిల్ అన్నాడు. కానీ నేడు తన కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. చిన్నప్పటి నుంచి తాను ఆంగ్లాన్ని విపరీతంగా ఇష్టపడేవాడినని తెలిపాడు. ప్రస్తుతం తాను విద్యార్థులకు ప్రతిష్టాత్మక ఐఈఎల్‌టీఎస్‌కు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపాడు. గిల్ చదువులోనే కాక హాకీ, ఫుట్‌బాల్‌లో రాణించేవాడు. జర్నైల్ సింగ్ వంటి హాకీ లెజెండ్‌తో ఆడటం తనకు గుర్తిండిపోయే మదుర జ్ఞాపకం అని గిల్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. కెన్యాలో అధ్యాపక వృత్తితో పాటు హాకీని నిరంతరం ఆడేవాడినని చెప్పుకొచ్చాడు. ఆటతో పాటు అంపైరింగ్ అనుభవం కూడా తనకుందని చెప్పడం విశేషం. తన విజయానికి ఆరోగ్యకరమైన జీవనశైలీ, సానుకూల దృక్పథాలే ప్రధాన పాత్ర పోషించాయని, భవిష్యత్తులో చిన్న పిల్లల కోసం పుస్తకాలు రాయాలని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు. -
ఐఈఎల్టీఎస్ స్కాలర్షిప్ అవార్డ్
స్కాలర్షిప్ ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించాలనుకునేవారికి ఇచ్చే ఐఈఎల్టీఎస్ (ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) స్కాలర్షిప్ అవార్డ్‌కు ప్రకటన విడుదలైంది. ఈ స్కాలర్‌షిప్స్‌ను బ్రిటిష్ కౌన్సిల్ అందిస్తోంది. మొత్తం స్కాలర్షిప్స్: 8 ఒక్కో స్కాలర్షిప్ విలువ: రూ.3 లక్షలు (ట్యూషన్ ఫీజుల కోసం) అర్హత: భారతీయ పౌరులై, భారతదేశంలోనే నివసిస్తుండాలి. ఇటీవల ఐఈఎల్టీఎస్ రాసి కనీసం 6.0 స్కోర్ సాధించి ఉండాలి. 2014 అకడెమిక్ ఇయర్లో విదేశాల్లో అండర్గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులు చదవడానికి సిద్ధంగా ఉండాలి. ఐఈఎల్టీఎస్ స్కోర్‌తో ప్రవేశం పొందినట్లు సంబంధిత విదేశీ విద్యా సంస్థ పంపిన ఆఫర్ లెటర్/ప్రవేశ పత్రం ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 30, 2014 వెబ్సైట్: www.britishcouncil.in