
ప్రియమైన తిరోగామి భారతమా.. నాకు రాత్రింబవళ్లతో పని లేదు.. నచ్చింది చేస్తా. నన్ను ఆపగలిగే హక్కు నీకుందని ఎన్నడూ అనుకోవద్దు. # ఐ యామ్ నాట్ సిండ్రిల్లా వీధి వేధింపులకు గురైన డీజే వర్ణికా కుందును తప్పు పడుతూ రాజకీయ నాయకుడు రామ్‌వీర్ భట్టి చేసిన వ్యాఖ్యలపై ఓ యువతి ప్రకటించిన నిరసన ఇది. మగాళ్లు మగాళ్లే అంటారు రామ్‌వీర్ లాంటి నాయకులు. బాధితులపైనే నోరు పారేసుకుంటారు. అమ్మాయిల తల్లిదండ్రులకు సుద్ధులు చెబుతుంటారు.
ఈ తరం యువతులు ఇలాంటి ఆంక్షల్ని ప్రశ్నిస్తున్నారు. రామ్‌వీర్ ధోరణిని తప్పుపడుతూ యువతులు చేసిన ట్వీట్లు ఇందుకు ఒక ఉదాహరణ. నగర యువతులు అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వచ్చి ఫొటోలు తీసుకుని ‘ఆ యామ్ నాట్ సిండ్రిల్లా’ హ్యాష్‌టాగ్‌తో వాటిని పోస్ట్ చేశారు. ప్రస్తుతం స్టాకింగ్ బాధితులకు భద్రత ఇవ్వగల చట్టాలు లేవంటున్నారు వర్ణిక. భయంకరమైన తన అనుభవాల నేపథ్యంలో ఆమె స్టాకింగ్ వ్యతిరేక ప్రచారం చేపట్టారు.
స్టాకింగ్‌ను నాన్‌బెయిలబుల్ నేరంగా పరిగణించాలని కోరుతూ హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహిళా శిశు అభివృద్ధిశాఖ మంత్రి మేనకాగాంధీలకు పిటిషన్ పెట్టారు. దీనిపై ఇప్పటికి 1,54,000 మందికి పైగా సంతకాలు చేశారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం – స్టాకింగ్ కేసు నిందితుల్లో 80% మంది.. చార్జిషీట్ ఫైల్ కాక ముందే బెయిల్ మీద బయటకు వస్తున్నారు. స్త్రీ సాధికారత కోసం వర్ణిక చేస్తున్న ప్రచారానికి గుర్తింపుగా 24టీవీ చానల్ ఆమెకు జషే యంగిస్తాన్ అవార్డు ప్రదానం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment