we-Discremination
-
వివక్షపై మారతమ్మ పంచ్
విశాఖపట్నం, పెందుర్తి : కొందరు జీవితాలను తెరిచి చూస్తే ఎంతో స్ఫూర్తి కలిగిస్తుంటాయి. కష్టాలకు..కన్నీళ్లకు బెదిరిపోకుండా..కరిగిపోకుండా ముందుకు వెళ్లే వారి ధైర్యం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయి. రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఇద్దరు ఆడపిల్లల భారాన్ని మోయలేక వెళ్లిపోయాడు. మరి ఆ కన్నతల్లి అలా అనుకోలేదు. పేగుతెంచుకున్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు కష్టాలెన్ని వచ్చినా ఎదుర్కొంది. ఉగ్గుపాలల్లో ధైర్యం నింపి పట్టిందేమో గానీ రెండో కుమార్తె తల్లి కల నెరవేర్చేలా ఎదిగింది. ఓ నిరుపేద కుటుంబం..రెక్కాడితేగాని డొక్కాడని వైనం..అప్పటికే ఓ కూతురు..రెండోకాన్పులో కొడుకే పుడతాడని ఆమె భర్త గట్టిగా నమ్మాడు..కానీ మరోసారి ఆడబిడ్డే..తప్పు భార్యదే అన్నట్టు ఇళ్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడా మగాడు..ఇద్దరు ఆడపిల్లలతో పూటగడవడం కూడా కష్టమైన దుస్థితి ఆ తల్లిది..ఏదోలా ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్‌ఉమెన్‌గా ఆ తల్లికి ఉపాధిమార్గం దొరికింది..కిష్టపరిస్థితిలో సంసారజీవీతాన్ని భారంగా ఈడుస్తూ ఆ తల్లి పడుతున్న కష్టం కళ్లారా చూస్తూ పెరిగింది ఆ రెండో బిడ్డ..ఈ క్రమంలో పురుషుల క్రీడగా పేరొందిన కఠినమైన బాక్సింగ్ వైపు మళ్లింది ఆ చిన్నారి మనసు..తాను కుటుంబం పరంగా గడిపిన అత్యంత కఠినమైన రోజులతో పాటు బాక్సింగ్‌లో ప్రత్యర్థి నుంచి ఎదురైన కఠోర పంచ్‌లు ఆమెను మరింత రాటుదేల్చాయి..నాడు ఆడపిల్ల అని తండ్రి చేత ఛీదరించుకున్న ఆ బిడ్డే నేడు అంతర్జాతీయస్థాయిలో మెరుస్తూ ‘సబల’గా ప్రజల మన్ననలు అందుకుంటుంది. పెందుర్తికి చెందిన సతివాడ మారతమ్మ ప్రస్తుతం భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న బాక్సర్. నిరుపేద కుటుంబం జన్మించిన మారతమ్మ కఠోర శ్రమ, అకుంటిత దీక్షతో అంతర్జాతీయ వేదికపై మెరుస్తోంది. చిన్నతనం నుంచే.. మారతమ్మ తల్లి రామలక్ష్మి కాయకష్టం చేసుకుని కుటుంబాన్ని ఈదుతున్న సమయంలో మారతమ్మకు బాక్సింగ్‌పై ఆసక్తి కలిగింది. స్థానికుల సహాయంతో ప్రాక్టిస్ మొదలుపెట్టిన మారతమ్మ అనతికాలంలోనే మేటి బాక్సర్‌గా తయారైంది. అంతర్జాతీయ స్థాయిలో రెండు(ఒక రజతం, ఓ కాంస్యం) పతకాలు సాధించిన ఆమె జాతీయ స్థాయిలో మూడు బంగారు పతకాలను కొల్లగొట్టింది. అంతే కాకుండా జాతీయస్థాయిలో సీనియర్ బాక్సింగ్‌లో రెండు కాంస్యాలు గెలుచుకుంది. ఏడాదిన్నర జరిగిన జాతీయ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించింది. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించిన మారతమ్మ అంతకంటే మంచి ఉద్యోగం కోసం అన్వేషిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మారతమ్మ రానున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించి పతకాలను సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. -
ఎన్ని శో.. కా.. లో!
మీరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి ఫొటోలు అప్లోడ్ చేస్తుంటారు? ఇదేం ప్రశ్న! అందంగా దిగిన సెల్ఫీలు, అద్భుతం అనిపించిన ప్రకృతి దృశ్యాలు, ఫ్యామిలీ ఫొటోలు.. ఇలాంటివే కదా పోస్ట్ చేస్తాం ఎవరిమైనా! కానీ, కావియా ఇల్లంగ్.. లైంగిక అంశాలు, ఆరోగ్యం, స్త్రీల దేహధర్మాలు, కాలకృత్యాలు, ఇంటా బయట మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు.. ఇలాంటి వాటిని ఇలస్ట్రేషన్లుగా గీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటారు. ముంబయ్‌కి చెందిన ఈ ఆరిస్ట్ ‘100 డేస్ ఛాలెంజ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకొని మన సామాజిక వ్యవస్థలోని వివక్షల్ని ఉతికేసే పనిలో పడ్డారు. ‘‘స్త్రీలు చాలా వరకు ఫిల్టర్ చేసిన సెల్ఫీలు, సందర్శన స్థలాలు, ఫిట్నెస్ లక్ష్యాల విజయాలు, స్టైలిష్ దుస్తులు, ఫ్యాన్సీ రెస్టారెంట్స్ పోస్టులు పెడుతుంటారు. అయితే.. రంగుకాగితాలు అంటించి కళ్లద్దాలుగా పెట్టుకున్న సోషల్ మీడియాలో ఒక సీరియస్ ఇష్యూ చేరితే ఎలా ఉంటుందో చూడాలనిపించింది. అదీ సంక్లిష్ట బాంధవ్యాలు, దైనందిన యాంత్రికత, మానసిక ఆరోగ్యం, వ్యసనంగా మారిన మొబైల్ ఫోన్ల వాడకం, లైంగికత్వం, శారీరక ప్రతికూలత.. వంటి అంశాలను అర్ధవంతంగా చూపించాలనుకున్నాను. మనుషుల మనసుల్లో దాగి ఉన్న మురికిని ప్రక్షాళన చేయడానికి ఆన్లైన్ వేదిక వీలు కలిపిస్తుందని భావించాను’’ అంటారు కావియా! కావియా ‘100 డేస్ ఆఫ్ డర్టీ లాండ్రీ’ (#100daysofdirtylaundry) ఇన్స్టాగ్రామ్ పేజ్ని 2017 జూన్ 6న మొదటిసారి అప్లోడ్ చేసింది. చాలామంది ఈ ఇలస్ట్రేషన్లను మొదట తేలికగా తీసుకున్నారు. కానీ, ఇది మనిషి లోలోతుల్లోని పేగులను కదిలించే ఉద్యమం. మహిళల శరీరంలో లోపాలుగా భావించే అంశాలను కావియా బట్టబయలు చేస్తున్నారు. బ్యూటీ పేరుతో నరకాన్ని పంటిబిగువున భరిస్తున్న ఆకృతులను తన రేఖలలో ఆవిష్కరిస్తున్నారు. మోసపూరిత బంధాలు, ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్.. ఒకటేమిటి ఇవి కూడా ఓ సమస్యలేనా అని అంతా భావించే పెద్ద పెద్ద అంశాలను ‘డర్టీ లాండ్రీ’గా ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు కావియా. వీటిని చూడటం, తెలుసుకోవడం అసౌకర్యంగానే అనిపించవచ్చు. కానీ, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన తప్పనిసరి విషయం అని ఒప్పుకోక తప్పదు. – ఎన్.ఆర్. -
శీలాపనిందలు
లేని నిందల్ని నీలాపనిందలు అంటారు. శీలం ఉన్నా లేదని అంటే? అది శీలాపనిందే అవుతుంది. మహిళపై దాడికి గొడ్డళ్లు, కొడవళ్లు అక్కర్లేదు. శీలం మీద ఇంత బురద చల్లితే చాలు.. తను చచ్చిపోతుందనుకుంటారు. ఊహు.. మేం ఒప్పుకోం. మా చెల్లి తామరాకు. తనకు ఏ బురదా అంటుకోదు. ఈ కేస్ స్టడీ చదవండి. మగాడి నీచత్వం, స్త్రీ ఔన్నత్యం తెలుస్తుంది. ‘ఈమె డాక్టర్ సౌమ్య. గుడ్ రీసెర్చర్ ఇన్ ట్రైబల్ డెవలప్మెంట్. పోస్ట్ లంచ్ సెషన్లో ప్రజంటేషన్ ఇస్తారు’ మిస్టర్ మీనన్‌కి నన్ను పరిచయం చేశారు మా డైరెక్టర్. మీనన్ చిరునవ్వుతో గ్రీట్ చేశారు. ‘విమెన్ ఎంపవర్మెంట్ మీద మీ పేపర్ చదివాను. ఎ గుడ్ ఐ – ఓపెనర్’ అన్నారు మీనన్. చాయ్ తాగుతూ ఆ సబ్జెక్టు గురించి పది నిమిషాలు మాట్లాడుకున్నాం. దూరం నుంచి రెండు కళ్లు నా వైపు పదేపదే పరిశీలనగా చూస్తున్నాయి. బహుశా ఇప్పుడు ‘అతడు’ మరో ‘కుట్రకథ’ అల్లుతూ ఉంటాడనుకుంటాను. గిట్టని స్త్రీల ‘క్యారెక్టర్’తో అడుకోవడం.. రాజకీయం చేయడం.. రకరకాల కథలల్లడం అతడి అలవాటు. ఉద్యోగ జీవితంలో పైకి రావడానికి వీటినే నమ్ముకున్నాడు అతడు. ఇక్కడ ‘అతడు’ అంటే అతడొక్కడే కాదు సుమా!‘అతడు’ లాంటి ఇంకొందరి గురించి కూడా నేను మాట్లాడుతున్నా. ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును బాగా చేశానని ప్రశంసించారు మా డైరెక్టర్. కొత్త ప్రాజెక్టుల గురించి అరగంటసేపు చర్చించారు. చాలా సంతోషంగా అనిపించింది. అది నా కష్టానికి లభించిన గుర్తింపు. ఆ లెవిల్‌కి రాలేకపోయాడు ‘అతడు’. సంస్థలో తనకు ప్రాధాన్యత లేకపోవడం భరించలేకపోయాడు. ఒక ఉద్యోగినిగా నన్ను ‘చంపేసేందుకు’ పావులు కదిపాడు. ‘క్యారెక్టర్’పై కథలల్లాడు. ఆమె ఉద్యోగం చేయదు.. ఆవిడగారి కోసం ఎవరెవరో వచ్చిపోతుంటారు.. డైరెక్టర్‌కు ఆమె చాలా స్పెషల్.. ఇట్లాంటి మాటలు అనేకంగా ప్రచారంలో పెట్టాడు అతడు. మొదట్లో నేనెంత భయపడిపోయానంటే – సీటులో నుంచి కదల బుద్ధయ్యేది కాదు. నా చుట్టూ ఉన్న వాళ్లని తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాను. డైరెక్టర్ సార్ దగ్గరకి వెళ్లడం బాగా తగ్గించేశాను. నాది వైబ్రెంట్ పర్సనాలిటీ అని ఎక్కడైతే కితాబులు అందుకున్నానో అక్కడే నాలోకి నేను ముడుచుకుపోయాను. తట్టుకోలేక ఏడుస్తూ అమ్మకు అన్నీ చెప్పేశాను. ‘ఎవడు ఎంత చెత్త వాగినా పట్టించుకోవద్దు. పని చేసుకుంటూ పో’ అని సలహా ఇచ్చింది మా అమ్మ. నా వల్ల కాలేదు. కావడం లేదు. తరచూ మనసంతా ఒత్తిడి. ఎడతెరిపి లేని ఆలోచనలు. ‘అమ్మ కూడా ఈ విషప్రచారం నమ్మేస్తే..’ అనే ఆలోచన వచ్చినప్పుడు మరింత దుఃఖం. ‘సౌమ్య హజ్బెండ్ నిన్న ఇక్కడికొచ్చాడు. చాలా పెద్ద హోదాలో ఉన్నాట్ట’ ‘మరెందుకో ఈవిడగారికి ఉద్యోగాలు... హాయిగా ఇంటిపట్టున ఉండొచ్చు కదా’ ‘వాళ్ల రిలేషన్షిప్ లీగలా? ఇల్లీగలా?’ ‘ఆ పైవాడికే తెలియాలి. అతడే భర్తని ఆమె చెప్పుకుంటూ ఉంటది’ ఇలాంటి సంభాషణలకు నారు పోసి నీరు పెట్టింది ‘అతడే’. లేడీ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలాంటి మాటలు విన్నప్పుడు కుతకుతలాడిపోతుంటారు. మరి వాళ్లు కూడా ‘అతడి’ బాధితులే. నేను రకరకాల ఆలోచనలతో కుంగిపోవడం గమనించాక – లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీకి ఫిర్యాదు చేయమన్నారు నా హజ్బెండ్. ఈలోపే ఇంకో ఘోరం. ప్రమోషన్ లిస్ట్‌లో నా పేరు లేకుండా బోయింది. మనసంతా దిగులు కమ్మేసింది. ఎన్నో మెచ్చుగోళ్లు.. 30 – 40 పబ్లికేషన్లు.. మంచి మంచి లెక్చర్లు.. ఛాలెంజింగ్ ప్రాజెక్టులు.. ఇవేమీ అక్కరకు రాలేదు. ఇలాంటి అకడమిక్ రికార్డ్ లేనప్పటికీ ప్రమోషన్ కొట్టేశాడు ‘అతడు’. మీకు ఉద్యోగాలెందుకు? జీతాలెందుకు? అని నా ఎదుటికొచ్చి ప్రశ్నిస్తున్నాడంటే అతడికి ఎంత దురహంకారం? మనిషిగా, ఒక పౌరురాలిగా నా హక్కుల్ని నిరాకరిస్తున్నాడు ఆ సెక్సిస్ట్. నన్ను సర్పాస్ చేయమని నా మగ సబార్డినేట్లను పురిగొల్పుతున్నాడు. కొత్తగా వచ్చిన డైరెక్టర్ ‘నా జేబులోనే ఉన్నాడు’ అని ఒకటే ప్రేలాపనలు. ఓ వైపు ఆఫీసులో నా ప్రతిపత్తిని దిగజార్చే కుట్రలు. మరోవైపు నా గురించి ఇంటా బయటా ఏమనుకుంటున్నారోననే భయాలు. ఆలోచనలతో అలసిపోయేదాన్ని. యాంగ్జయిటీ తీవ్రమైనప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్. భరించలేనంత బ్లీడింగ్. షాక్‌కు గురై ఆసుపత్రిలో చేరిన సందర్భాలున్నాయి. అబార్షన్లు కూడా అయ్యాయి. డాక్టర్ ఇచ్చిన మందులు వాడకపోతే పని చేయలేను. మందులు మింగితేనే నిద్ర. ఇలాంటి పరిస్థితుల్లోనే – ఇంటెర్నల్ కంప్లయింట్స్ కమిటీ (ఐసీసీ) చైర్పర్సన్ అపాయింట్మెంట్ కోరాను. నెలరోజులు గడిచినా నాకు టైమ్ ఇవ్వలేదు. అకడమిక్ రంగంలో నాకున్న పరిచయాల ద్వారా ఒకలాంటి ఒత్తిడి తెస్తే గానీ ఆమె నా కంప్లయింట్ స్వీకరించలేదు. కానీ ఆమె నా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకురమ్మన్నారు. తట్టుకోలేకపోయాను. దుఃఖాన్ని దిగమింగుకుంటూ బయటకొచ్చాను. నాది చట్టబద్ధ వివాహం. పేరెంట్సే చేశారు. అయినా, పెళ్లికీ – కేసుకీ సంబంధమేంటి? చట్టం రిలేషన్షిప్స్ని స్క్రూటినీ చేయమందా? ఇదెక్కడి న్యాయం? మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చాను ఐసీసీ చైర్‌పర్సన్‌కి. పదుల సంఖ్యలో అమ్మాయిల్ని విచారించారు. అందరూ ‘అతడి’కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినవారే. వారంతా ‘అతడి’ బాధితులే. కమిటీ అతణ్ణి దోషిగా నిర్ధారించింది. ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించింది. కానీ ఆ నిర్ణయం అమలు కాలేదు. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని విరగబడి నవ్వుతున్నాడు ‘అతడు’. ఆఫీసు వాతావరణం నానాటికీ శత్రుపూరితంగా తయారవుతోంది నాకు. విమెన్స్ కమీషన్‌కు మొర పెట్టుకున్నాను. కేంద్రంలోని మూడు మంత్రిత్వ శాఖలకు లేఖలు రాశాను. న్యాయం కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి నేను? మనఃశరీరాలను మెలిపెట్టే ఈ వేదన నుంచి నాకు విముక్తి ఎప్పుడు? (సౌమ్య కేస్ స్టడీ) – వి.ఉదయలక్ష్మి ఐసీసీ తీర్మానాలకు కట్టుబడాల్సిందే.. లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం – అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) చేసిన రికమండేషన్లను సంస్థల యాజమాన్యాలు తప్పకుండా అమలు చేయాలి. కానీ సౌమ్య కేసులో అలా జరగలేదు. ఒకవేళ ఐసీసీ సిఫారసుల పట్ల అసంతృప్తిగా ఉన్నట్టయితే సంస్థ మళ్లీ విచారణ జరిపించవచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థల్లో మాదిరిగా ఎథిక్స్ కమిటీ వేసి, కేసును పరిశీలనకు పెట్టొచ్చు. ఇలాంటి కేసుల్లో యాజమాన్యాల వైపు నుంచి న్యాయం జరగనప్పుడు లేదా ఐసీసీ రికమండేషన్లపై అసంతృప్తి ఉన్నప్పుడు.. న్యాయవ్యవస్థను ఆశ్రయించాలంటోంది చట్టం. కానీ, ఐసీసీ విచారించిన కేసును మళ్లీ కోర్టు ముందుకు తోయడమంటే.. చట్టంలో లోపమున్నట్టే. అసలు సున్నితమైన ఇలాంటి అంశాల్లో కోర్టులకు వెళ్లేందుకు దాదాపు ఎవ్వరూ ఇష్టపడరు కూడా. ఈ నేపథ్యం నుంచే చట్టం రూపుదిద్దుకుంది. చట్టం ఐసీసీల ఏర్పాటును తప్పనిసరి చేసింది. మినీ కోర్టుల్లాంటి ఐసీసీల సిఫారసుల విషయంలో సంస్థలు సెన్సిటివ్‌గా ఉండాలి. ఆ సెన్సిటివిటీ లోపించడం వల్లే సౌమ్య కేసులో జాప్యం జరుగుతున్నట్టు అగుపిస్తోంది. ఈ జాప్యాన్ని నివారించేగలిగే / పరిస్థితిని చక్కదిద్దగలిగే మెకానిజమ్ ఏర్పాటు కావాల్సిన అవసరముంది. చట్టంలో లోపాల్ని సవరించాల్సి వుంది. – బి. గిరిజ, తెలంగాణ స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్, ‘సఖి’ ప్రశ్నించే ఫోరమ్స్ పెంచుకుందాం వేధింపులు సహా స్త్రీలు ఎదుర్కొనే రకరకాల హింసల్నీ, వాళ్ల హక్కుల్నీ హేళన చేసే వాతావరణం మన చుట్టూ అలముకుంది. (సౌమ్య కేసులో ఇదే జరిగింది.) సీరియల్స్‌లో ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. కుటుంబ హింస, రేప్ వంటివన్నీ ఇందులో ఉంటాయి. కానీ వాటిని ఎలా డీల్ చేయాలనేదానిపై ఒక సైంటిఫిక్ – థియరిటికల్ యాటిట్యూడ్ లేదు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలితో – ఎక్కువ మాట్లాడితే నువ్వే వేధిస్తున్నట్టు కేసు పెడతానంటాడు పోలీసు. మరోవైపు, నెగిటివ్ క్యారెక్టర్ కుటుంబ హింస జరగకపోయినా జరిగినట్టు కేసు పెట్టించగలుగుతుంది. ఈ సీరియల్స్ ప్రకారం.. కోడళ్లందరూ అత్తలను హింసిస్తారు. కానీ తమను అత్తలే హింసిస్తున్నట్టు కేసులు పెడతారు. పోలీసులు వాటిని స్వీకరిస్తారు. ఈ తరహా ఇమేజస్ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దాదాపు అన్ని సీరియల్స్ ఇలాంటి తప్పుడు భావనలే వ్యాప్తి చేస్తున్నాయి. ఇలాంటి ధోరణుల్ని ప్రశ్నించే ఫోరమ్స్ మరిన్ని ఏర్పడాలి. ‘హింస’మీద డిబేట్ జరగాలి. – కె. సజయ, సామాజిక కార్యకర్త కౌన్సెలింగ్ అవసరం సౌమ్యలో యాంగ్జయిటీ, డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీటి నుంచి బయటపడాలంటే కౌన్సిలింగ్‌కు సిద్ధపడాలి. అవసరాన్ని బట్టి మందులూ వాడాలి. ఆమెను బలహీనపరచే ఆలోచనల్ని కౌంటర్ చేయాలంటే ఒక సిస్టమాటిక్ – సైంటిఫిక్ అండ్ స్ట్రక్చరల్ అప్రోచ్ అవసరం. సైకాలజిస్టును కలసినట్టయితే – బాధితురాలికి బాధల నుంచి, ఆమెను వ్యాకులపరిచే ఆలోచనల నుంచి ఎలా బయటపడాలో నేర్పిస్తారు. కుటుంబ సభ్యులు ఆమె సమస్యల పట్ల సహానుభూతితో స్పందించడం, ‘నీకు మేమున్నాం’ అనే భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం. – డాక్టర్ సి.వీరేందర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ -
ఐ యామ్ నాట్ సిండ్రిల్లా
ప్రియమైన తిరోగామి భారతమా.. నాకు రాత్రింబవళ్లతో పని లేదు.. నచ్చింది చేస్తా. నన్ను ఆపగలిగే హక్కు నీకుందని ఎన్నడూ అనుకోవద్దు. # ఐ యామ్ నాట్ సిండ్రిల్లా వీధి వేధింపులకు గురైన డీజే వర్ణికా కుందును తప్పు పడుతూ రాజకీయ నాయకుడు రామ్‌వీర్ భట్టి చేసిన వ్యాఖ్యలపై ఓ యువతి ప్రకటించిన నిరసన ఇది. మగాళ్లు మగాళ్లే అంటారు రామ్‌వీర్ లాంటి నాయకులు. బాధితులపైనే నోరు పారేసుకుంటారు. అమ్మాయిల తల్లిదండ్రులకు సుద్ధులు చెబుతుంటారు. ఈ తరం యువతులు ఇలాంటి ఆంక్షల్ని ప్రశ్నిస్తున్నారు. రామ్‌వీర్ ధోరణిని తప్పుపడుతూ యువతులు చేసిన ట్వీట్లు ఇందుకు ఒక ఉదాహరణ. నగర యువతులు అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వచ్చి ఫొటోలు తీసుకుని ‘ఆ యామ్ నాట్ సిండ్రిల్లా’ హ్యాష్‌టాగ్‌తో వాటిని పోస్ట్ చేశారు. ప్రస్తుతం స్టాకింగ్ బాధితులకు భద్రత ఇవ్వగల చట్టాలు లేవంటున్నారు వర్ణిక. భయంకరమైన తన అనుభవాల నేపథ్యంలో ఆమె స్టాకింగ్ వ్యతిరేక ప్రచారం చేపట్టారు. స్టాకింగ్‌ను నాన్‌బెయిలబుల్ నేరంగా పరిగణించాలని కోరుతూ హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహిళా శిశు అభివృద్ధిశాఖ మంత్రి మేనకాగాంధీలకు పిటిషన్ పెట్టారు. దీనిపై ఇప్పటికి 1,54,000 మందికి పైగా సంతకాలు చేశారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం – స్టాకింగ్ కేసు నిందితుల్లో 80% మంది.. చార్జిషీట్ ఫైల్ కాక ముందే బెయిల్ మీద బయటకు వస్తున్నారు. స్త్రీ సాధికారత కోసం వర్ణిక చేస్తున్న ప్రచారానికి గుర్తింపుగా 24టీవీ చానల్ ఆమెకు జషే యంగిస్తాన్ అవార్డు ప్రదానం చేసింది. -
సమాంతర సంస్కృతి నిర్మాణ దిశలో...
చలం ‘స్త్రీ’లో తరతమ భేదాలతో ప్రస్తావించిన కామం – మోహం – ప్రేమ అన్న మూడు మాటలు లైంగిక వేధింపుల గురించి మాట్లాడాల్సిన ఈ సందర్భంలో పదేపదే గుర్తుకు వస్తున్నాయి. స్త్రీ పురుషుల మధ్య యవ్వన సహజమైన ఆకర్షణకు గౌరవకరమైన, బాధ్యతాయుతమైన వ్యక్తీకరణ ప్రేమ. పెళ్లి, సహజీవనం దాని పరిణామాలు. అద్వైతానుభవాన్ని ఇచ్చే లైంగిక సంబంధం అందులో భాగం. ఒకరి కోసం ఒకరు నిలబడటం, ఒకరి కొరకు ఒకరు దేన్నయినా త్యాగం చేయటానికి సిద్ధపడటం, ఇద్దరూ కలిసి ఒక ఉన్నత గమ్యం వైపు సాగడం.. ఇవన్నీ స్త్రీ పురుషుల సంబంధాన్ని మానవీయం చేసే విలువలు. మోహంలో ఆకర్షణ, ఆరాధన ప్రధానం. కామంలో ఉండేది ఆకర్షణ మాత్రమే. అయినా అందులోనూ ఇద్దరి ఇచ్ఛ ఉంటుంది. స్త్రీ ఇచ్ఛతో నిమిత్తం లేకుండా ఆమె శరీరం – లైంగికత మీద పురుషుడి అధికార అహంకార ప్రకటనగా, ఆధిక్యత స్థాపనగా జరిగేవే లైంగిక వేధింపులు, అత్యాచారాలు. ఇందుకు బలిౖయెన స్త్రీల జీవిత సంఘర్షణలను, మానసిక వేదనలను, మానవ సంబంధాలపై వాటి ప్రభావాలను నమోదు చేస్తూ వచ్చిన, వస్తున్న కథలు సమాంతర సంస్కృతి నిర్మాణాన్ని ప్రతిపాదిస్తున్నాయి. అబ్బూరి చాయాదేవి ‘ప్రయాణం’ (1965) కథకు – సమీప బంధువులు, సన్నిహితులు, స్నేహితులు అయిన పురుషుల వల్ల అత్యాచారానికి గురి అయ్యే విద్యావతి అయిన స్త్రీ వేదన.. సంస్కారవంతుడైన యువకుడి నుంచి ఆమెకు లభించిన ఊరట వస్తువు. కాళీపట్నం రామారావు ‘హింస’ (1968) కథలో – పొగాకు కంపెనీలో కూలికి వెళ్లిన గొల్ల పైడమ్మ మోసపోయి అత్యాచారానికి గురై అత్తింటి వారి చేత వెళ్లగొట్టబడి, పుట్టింటికి వెళ్లే ధైర్యం లేక పట్నం వెళ్లి చివరకు వేశ్యగా తేలిన విషాదం వస్తువు. అంతకన్నా విషాదం.. ఇంటికొచ్చిన కూతురిని కుల కుటుంబ మర్యాదల ఒత్తిడికి, రెండవ కూతురి భవిష్యత్తు భయానికి తలవొగ్గి ఆదరించలేక తల్లి పడిన వేదన. వాడ్రేపు చినవీరభద్రుడి ‘సుజాత’ కథ (1990) పోలీసు స్టేషన్లో అత్యాచారానికి గురైన అమ్మాయి అంతరంగ వేదన. కుటుంబంలో, లోకంలో బాధిత స్త్రీల పట్ల విమర్శ, సానుభూతి, ఔదార్యం వంటివి ఆత్మగౌరవానికి ఎలా భంగకరంగా ఉంటాయో ఈ కథ సూచిస్తుంది. ఉద్యోగాలు చేయడానికి బయటకు వచ్చే ఆడపిల్లలు పనిప్రదేశాల్లో పొంచి ఉన్న అత్యాచార ప్రమాదాలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ తమదైన మార్గాలలో తప్పించుకోవటానికి చేసే యుద్ధాన్ని కేతు విశ్వనాథరెడ్డి రాసిన ‘రెక్కలు’ కథ నిరూపిస్తుంది. పేదరికం, ప్రలోభం తరచూ స్త్రీలపై అత్యాచారానికి కారణమై అణగతొక్కెయ్యడాన్ని తల్లావఝల పతంజలి శాస్త్రి రాసిన ‘సుర్మా’ (1993) నల్లూరి రుక్మిణి రాసిన ‘మృత్యు స్పర్శ’ (2002) కథలు చిత్రించాయి. 1994లో ఐదారేళ్ల పసిపిల్ల శ్వేత, అలాంటి మరికొందరు చిన్న పిల్లల మరణాలకు కారణమైన అత్యాచారాలకు ప్రతిస్పందిస్తూ ఓల్గా ‘అయోని’ కథ రాసింది. మధురాంతకం నరేంద్ర రాసిన ‘అత్యాచారం’ కథ (1991) అనేక అనేక అంతరువులలో యథేచ్ఛగా సాగిపోయే ఆర్థిక అత్యాచారాలను చిత్రిస్తుంది. బతుకుతెరువు పోరులో గాలివాటుకు కొట్టుకుపోయే పేదవర్గాల స్త్రీలు తమపై అత్యాచారం జరిగిందో లేదో పట్టించుకొనే పరిస్థితిలో లేకపోవడాన్ని గుర్తించి చెప్పాడు కథ ముగింపులో రచయిత. సామ్రాజ్యవాద పెట్టుబడి మాయలో ఈనాడు స్త్రీలందరి పరిస్థితీ అదేనేమో.. – కాత్యాయనీ విద్మహే, సాహిత్య విమర్శకురాలు,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత -
నేషనల్ బార్ అసోసియేషన్ లైంగిక వేధింపుల సర్వే 2017
నేషనల్ బార్ అసోసియేషన్ 6,047 మంది ఉద్యోగినులపై జరిపిన సర్వే (2017) ప్రకారం లైంగిక వేధింపు బాధితుల శాతం యాసిడ్ ఎటాక్స్ 2010–2016 మధ్య 1,189 యాసిడ్ దాడి కేసులు నమోదయ్యాయి. కోర్టుల మార్గదర్శకాలకు అనుగుణంగా బాధితులకు సాయం అందడం లేదు. బహిరంగ మార్కెట్లో యాసిడ్ అమ్మకాల్ని నిషేధిస్తూ కోర్టులు జారీ చేసిన మార్గదర్శకాల్ని సైతం రాష్ట్రాలు పట్టించుకోవడం లేదు. దీనిపై సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రాన్ని ప్రశ్నించింది. కేసుల గణాంకాలు అపహరణ, అపహరణ ప్రయత్నాల తాలూకు కేసులు 2014 - 57,000 2015 - 64,000 ఐసీసీలకూ గతి లేదు పది, అంతకు మించి ఉద్యోగులున్న ప్రతి కంపెనీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ఏర్పాటు చేసి తీరాలి. అయితే 36% భారతీయ కంపెనీలు, 25% మల్టీ నేషనల్ కంపెనీలు ఐసీసీలు ఏర్పాటు చేయలేదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) 2015 అధ్యయనం చెబుతోంది. ఫిక్కీ పరిశీలించిన 120 కంపెనీల్లో సగం కంపెనీలు చట్ట పరిజ్ఞానం అంతగా లేని వాళ్లని ఐసీసీ సభ్యుల్ని చేశాయి. బీఎస్ఈ (బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి) టాప్ 100 కంపెనీల్లోని 52 కంపెనీల్లో మాత్రమే లైంగిక వేధింపు కేసుల గణాంకాలున్నాయి. సంబంధిత వివరాలు : రాష్ట్ర విభజన కాలం నుంచి 2016 డిసెంబర్ వరకు – కిడ్నాప్, అక్రమ రవాణా, వ్యభిచార కూపంలోకి నెట్టబడిన ఉదంతాలపై తెలంగాణలో నమోదైన కేసులు 2046. పోలీస్ శాఖ వీటిలో 472 కేసుల్ని తప్పుడు కేసులుగా తేల్చి, వాటిని మూసివేసింది. మిగిలిన కేసుల్ని దర్యాప్తుకు స్వీకరించింది. పోలీస్‌శాఖ అందించిన వివరాల ప్రకారం ఆయా కేసుల స్థితిగతులు దిగువ విధంగా ఉన్నాయి. వస్త్ర పరిశ్రమలో వేధించేదెవరు? 90% - మగ సూపర్వైజర్లు/ ఫ్లోర్ ఇన్ఛార్జ్ మేనేజర్లు 75% - కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు లేవని చెబుతున్నవారు 3.6% - వేధింపు కేసుల్లో తీసుకున్న క్రమశిక్షణ చర్యలు కర్ణాటకలోని 5 లక్షలమంది గార్మెంట్ వర్కర్లపై ‘సిస్టర్స్ ఫర్ చేంజ్ ’ 2016లో జరిపిన అధ్యయనం జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) 2016 నివేదిక ప్రకారం ♦ మహిళలను అగౌరవపర్చడంలో ఆంధ్రప్రదేశ్‌ది మొదటి స్థానం. ♦ అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలోనే ఏడవ స్థానం. ♦ మహిళల అక్రమ తరలింపుపై నమోదైన కేసులు 239 ♦ బాలికల (12 – 18) కిడ్నాప్ కేసులు 396 మహిళలపై వేధింపులకు సంబంధించి ఏపీలో నమోదైన కేసులు 2016 - 5,135 2017 - 5,453 - సోర్స్ : ఏపీ పోలీసుల వార్షిక క్రైమ్ నివేదిక సేకరణ: శిశిర, యిర్రింకి ఉమామహేశ్వరరావు, ఏపీ స్టేట్బ్యూరో, ఐ. శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ స్టేట్ బ్యూరో‡ -
టూ స్టోరీస్
ఆకాశం కథొకటి. భూమి కథొకటి. అంటే.. ఒకరి కథలో ఆకాశం.. ఇంకొకరి కథలో భూమీ.. ఉన్నాయని కాదు. అలాగని లేవనీ కాదు! ఆకాశమూ భూమీ పుట్టినప్పటి నుండి ఉన్న కథలని. అన్ని కథలని! లైంగిక వేధింపులతో మన అమ్మాయిలకు... అన్ని వేధింపులని!! ‘జీవితంలో ఎదుగుతూనే నన్ను నేను కాపాడుకోవాలి. నాపై విసిరే అనేకానేక వలల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. సినీరంగంలో ఇదో పెద్ద సవాల్ నాకు’ అంటున్నారు గీత రచయిత్రి శ్రేష్ఠ. 2012లో సినీ సీమలోకి అడుగుబెట్టి పదిహేను సినిమాలకు పాటలు రాసిన ఈ మంచిర్యాల యువతి మొదటి నుంచి లైంగిక, మానసిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ‘సమాజం.. కుటుంబం.. మగాడు ఎంత చెత్తగా ప్రవర్తించినా అతణ్ణి గౌరవిస్తాయి. ఆడపిల్ల విషయంలో మాత్రం చిన్న మచ్చ కూడా ఉండకూడదంటాయి. స్త్రీల పట్ల మన దృష్టికోణం మారాలి’ అంటున్న శ్రేష్ఠ వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ శ్రేష్ఠ తొలి సినిమా. 2016లో విడుదలైన ‘పెళ్లిచూపులు’ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ‘ఆ సినిమా హిట్ కావడంతో ‘అర్జున్‌రెడ్డి’లో అవకాశం వచ్చింది. తర్వాత ‘హలో’ ‘యుద్ధం శరణం’ సినిమాలకు పాటలు రాశాను. ‘అర్జున్‌రెడ్డి’కి రాసిన ‘మధురమే ఈ క్షణమే చెలీ’ పాటకు జీ గోల్డెన్ అవార్డు రావడం సంతోషంగా అనిపించింది. ‘యుద్ధం శరణం’ పాటలకూ మంచి అప్లాజ్ వచ్చింది. వేధింపు వ్యధల మధ్య నలిగిపోయిన నాకు ఈ విజయాలు కొంత శక్తినిచ్చాయి’ అంటున్న శ్రేష్ఠ చేతిలో ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులున్నాయి. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. సినిమా పాటలు రాయాలనేది నా కోరిక. గీత రచనపై పట్టు సాధించేందుకు పుస్తకాలు చదివేదాన్ని. పాటలు బాగా వినేదాన్ని. కొన్ని పాటలు రాసుకున్నాక.. అవి బాగా వచ్చాయనే నమ్మకం కలిగాక.. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. ఓ నిర్మాతను కలసి చాన్స్ ఇవ్వమని అడిగాను. ‘నువ్వే మాకు ఒక చాన్స్ ఇవ్వు’ అని బదులిచ్చాడు ఆయన. ఇలా వెళ్లిన ప్రతిచోటా ఎన్నో చేదు అనుభవాలు. అవమానాలు. ‘నీకు అవకాశమిస్తే మాకేంటి లాభం! నీ కంటే ఎంతోమంది గొప్ప రచయితలున్నారు. వాళ్లతో రాయించుకుంటాం’ అని కూడా అన్నారు. మొండిగా ముందుకు... 2013లో నా చేతిలోంచి చాలా ప్రాజెక్టులు జారిపోయాయి. నా తిరస్కారంతో ఇగో దెబ్బ తిన్నవాళ్లు కొందరు, నాతో మర్యాదగా మాట్లాడిన వాళ్లని ఇన్ఫ్లుయన్స్ చేసి, అవకాశాలు రాకుండా చేశారు. ఈ కారణంగా బతుకు మీదే విరక్తి పుట్టింది. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. సైలెంట్‌గా ఉంటే ఎక్కడైనా∙సంబంధాలు బాగుంటాయి. కానీ అలా ఉండకూడదనుకున్నాను. గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాను. మొండితనంతో ముందుకు సాగాను. ఎప్పుడూ భయపడలేదు. కానీ నీరసం వచ్చింది. ఓపిక లేనట్టు అన్పించింది. నా బాధను ఎవ్వరితోనూ పంచుకోలేకపోయాను. మన సమాజం – కుటుంబం బాధితురాలినే తప్పుబట్టి, ఆమె మాటలకు తప్పుడు వ్యాఖ్యలు జోడించి ప్రచారం చేస్తాయి. అబ్బాయిలకీ ఇబ్బందులు ఉంటాయి కదా అంటారు కొందరు. నిజమే, కానీ సక్సెస్ వచ్చేవరకే వాళ్లు ఇబ్బందిపడతారు. ఆ తరవాత వారికి రెడ్ కార్పెట్ పరుస్తారు. అమ్మాయిలు ‘ప్రిపేర్డ్’గా వస్తారనుకుంటారు పరిశ్రమలో చాలామంది. అందుకే మొదటి అవకాశం అందుకోవడానికి టైమ్ పట్టింది. కొందరు పది పదిహేనేళ్ల వరకూ ఎదురుచూడాల్సివస్తుంది. ఈ లోపు ఉత్సాహం సన్నగిల్లుతుంది. ఇక సినిమాలు వదిలేద్దాంలే అనిపిస్తుంది. మహిళా దర్శకురాలే వల విసిరింది అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న రోజుల్లో ఒక మహిళా దర్శకురాలు పరిచయం అయ్యింది. ఆవిడని అక్కా అని పిలిచేదాన్ని. కాస్త సన్నిహితంగా మెలిగేదాన్ని. ఒకరోజు ఫోన్ చేసి, ‘న్యూ ఇయర్ పార్టీకి వస్తావా’ అని అడిగింది. ఆసక్తి లేదని చెప్పాను. ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నాడని, పార్టీకి వస్తే ఇద్దరూ కలవొచ్చని చెప్పింది. ‘నన్ను ఎందరో ఇష్టపడుతుంటారు. నేను ఎందరినో కాదంటాను. నాకు ఇష్టం లేనప్పుడు మీరు ఎలా లీడ్ తీసుకుంటారు? నేను వద్దంటే ఎందుకు ఒత్తిడి చేస్తారు?’ అని ఆ దర్శకురాలిని ప్రశ్నించాను. ఆమె ఇబ్బంది పెట్టడంతో తనతో కలసి చేద్దామనుకున్న ప్రాజెక్టును వదిలేసుకున్నాను. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాలేదు. ఈ ఆలోచనల నుంచి బయటపడకముందే ఫోనొచ్చింది. అవతలి వాడి మాటలు అసభ్యంగా ఉన్నాయి. ‘ఆవిడ నిన్ను ఆఫర్ చేసింది. నువ్వు కాదంటావేమిటి’ అంటూ పిచ్చిపిచ్చిగా వాగాడు. నాకు కోపం ఆగలేదు. ‘ఎవడ్రా నువ్వు’ అని గట్టిగా అరుస్తూ కాల్ కట్ చేశాను. ఇది జరిగి నాలుగు సంవత్సరాలైంది. ఈ రంగంలో అమ్మాయిల్ని నమ్మడం కూడా కష్టమవుతోంది. వాళ్లతో స్నేహం చేసే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. పురుషుల దురుద్దేశాన్ని తొందరగా పసిగట్టవచ్చు. కానీ స్త్రీల విషయంలో అది కష్టమవుతోంది. ‘నీ దగ్గర ఏముందని ఇంత పొగరు? నన్నే కాదంటావా? నువ్వు నా గ్రిప్‌లో ఉండాలి. లేదంటే నీకు కెరీర్ లేకుండా చేస్తా’ అన్నాడు ఓ దర్శకుడు. ఇలాంటి అనేకానేక చేదు అనుభవాల కారణంగా పురుష సమాజం మీదే జుగుప్స కలుగుతోంది. సాధారణంగా ధనవంతుల కుటుంబాల్లో పుట్టిన వారికి లేదా వెన్నుదన్నులు ఉన్న వారికి సినీ పరిశ్రమలో అంతగా ఇబ్బందులు ఉండవు. ఏ పరిచయాలూ లేని నాబోటి మధ్యతరగతి వాళ్లది మాత్రం ముళ్లదారే! ఆ దారిలో నన్ను నేను కాపాడుకుంటూ ముందుకు సాగే క్రమంలో కనీసం పది సినిమాలు వదులుకున్నాను. మంచి వాళ్లూ ఉన్నారు.. 2016లో పెళ్లిచూపులు చిత్రం రచయిత్రిగా నన్ను నిలబెట్టింది. నాకు పేరు తీసుకొచ్చింది. అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయోనని భయపడ్డాను. వాళ్లకు నా భయాలు – చేదు అనుభవాలు వివరించాను. ‘అందరూ ఒకేలా ఉండరు. ఇక్కడ మీకు ఎలాంటిæ భయమూ ఉండదు’ అని హామీ ఇచ్చారు వాళ్లు. ‘పెళ్లిచూపులు’ సినిమా ఇండస్ట్రీలో ఇక ముందుకు సాగవచ్చనే నమ్మకం ఇచ్చింది. మరో మూడు సినిమాల్లో పాటలు రాసే అవకాశం అందించింది. సినీసీమలో ‘చాన్స్ ఇస్తావా’ అని అడిగే వాళ్లతో పాటు స్త్రీని గౌరవించే వారూ తారసపడ్డారు. పెళ్లిచూపులు సినిమా తర్వాత మురికి మాటలు తగ్గాయి. నాకు గాలమేయాలని చూసిన ‘పెద్దలు’ ఇప్పుడు డౌన్లో ఉన్నారు. నేను వాళ్ల కంటే మెరుగ్గా ఉన్నాను. ఇది ఒకింత సంతోషపరిచే విషయం నాకు. ఇటీవల ఓ టీవీ చానల్ నన్ను ఇంటర్వ్యూ చేసింది. ‘ఆమెను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు’అంటూ ఆ చానల్ ఆఫీసుకు ఫోన్లు వెళ్లాయి. ఇంటర్వ్యూ ప్రసారం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. కాల్ చేసింది ఓ మహిళేనట! ఈ విషయం తెలిసిన ఆ చానల్ ఉద్యోగులు నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ‘పెళ్లిచూపులు’ తర్వాత నా చేదు అనుభవాల్ని మీడియాతో పంచుకున్నాను. ఈ కారణంగా వేధింపులు తగ్గాయి. ‘సాక్షి’ ద్వారా నేను చెప్పగలిగింది ఒకటే. ఇలాంటి తోడేళ్లు ప్రతి చోటా ఉంటాయి. అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగాల్సిందే. సమస్యలు ఎదురైతే గొంతు విప్పాల్సిందే. నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాల్సిందే. – హృదయ మంచం కింద, తలగడ కింద, వంట గదిలో, ఫ్రిడ్జ్ కింద... అన్ని చోట్లా కత్తులు ఉంచుకుంది ఫిదా ఫేమ్ గాయత్రి గుప్తా. ఎవరినీ చంపడానికి కాదు, తనను తాను రక్షించుకోవడం కోసమే ఈ ఏర్పాటంతా. ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఏక్షణమైనా ఏదైనా జరుగుతుందేమోనని ఆమెకు భయం. సినీ పరిశ్రమలో కొందరు తనను లైంగికంగా వేధించారని ఇటీవల మీడియా ముందు గొంతు విప్పింది గాయత్రి గుప్తా. నేను షార్ట్‌ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్‌లో నటించాను. పాటలు పాడతాను, కథలు రాస్తాను. ఒక సినిమా షూటింగ్లో నేను లైంగిక వేధింపులకు గురయ్యాను. అందుకే మీడియా ముందుకు వచ్చి నా గొంతు వినిపిస్తున్నాను. చాలామంది ఆడవాళ్లు దుస్తులు సరిగా వేసుకుంటే వారి మీద లైంగిక దాడులకు అవకాశముండదు, ఒంటి నిండా బట్టలు కట్టుకోవాలి అంటున్నారు. భారత కాలంలో ద్రౌపది దుస్తులు సరిగా వేసుకోలేదనే ఆమె మీద దుశ్శాసనుడు, కీచకుడు, సైంధవుడు అత్యాచారం చేయబోయారా. మన వస్త్రధారణ మీద పాశ్చాత్య ప్రభావం ఎక్కువగా ఉంది. ‘ఆడవాళ్లు ఏం వేసుకోవాలి’ అనేది ఇంకా మగవారు నిర్ణయించక్కర్లేదు. నాకు అనువుగా ఉన్న బట్టలు వేసుకునే హక్కు నాకు ఉంది. కారులో దింపుతూ మిస్‌బిహేవ్ చేశారు.. నేను ఒక చిత్రం ఒప్పుకున్న సందర్భంలో, ‘‘ఇక్కడి వాతావరణం బాగుంటుందా’’ అని నేరుగా అడిగాను. ‘‘అంతా బాగుంటుంది, మీకు ఇబ్బంది ఏమీ ఉండదు’’ అని సమాధానం చెప్పారు వారు. నిజమని నమ్మాను. సినిమా షూటింగ్ మొదలవ్వకుండానే, వారు నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ నేను జాగ్రత్తగా నన్ను రక్షించుకుంటూ వచ్చాను. పరిశ్రమలో అన్నీ నాలుగుగోడల మధ్య జరిగిపోతాయి. ఎవ్వరికీ బయటకు తెలియవు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలన్నా ఆధారాలు కావాలి. ఇటువంటివి విన్నప్పుడే... సినీ పరిశ్రమకు అమ్మాయిల్ని పంపడానికి చాలామంది భయపడుతున్నారు. ఫిర్యాదు చేయాలంటే ఆధారాలు లేవ్! చాలామంది ‘ఫిలిమ్ చాంబర్లో ఫిర్యాదు చేశారా’ అని అడుగుతున్నారు. ఫిర్యాదు చేయడం నా ఉద్దేశం కాదు. పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పడానికే నేను గొంతు విప్పాను. నాలాగే వేధింపులకు గురైన వారు గొంతు విప్పితేనే వేధించాలనుకునేవారు భయపడతారు. ఇబ్బందులు వచ్చినప్పుడు గట్టిగట్టిగా అరిస్తే, అవతలివారు నోరు మూసుకుని పారిపోతారు. అంతే. నాకు ఏం కావాలో, ఏది సంతోషం ఇస్తుందో నేను ప్లాన్ చేసుకుంటాను. ఇంటి నుంచి బయటకు వచ్చిన మూడు నాలుగు సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాను. ఆ టైమ్‌లో ఎమోషనల్ అయ్యాను కూడా. నేను అందరికీ చెప్పేది ఒక్కటే. తిండి కంటే కూడా ఆత్మ గౌరవం ప్రధానం. ఆ ఆత్మ గౌరవమే మనల్ని కాపాడుతుంది. అవకాశాలు రాలేదని మీడియా కెక్కానట.. నేను మీడియాలో నా గొంతు వినిపించడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. ‘ఈ అమ్మాయికి ఆఫర్లు రావట్లేదు కాబట్టి, అటెన్షన్ కోసం ఇలా చేస్తోంది’ అంటున్నారు. ఇలా మాట్లాడితే నేను ఏం చేయాలి. అందుకే నా సమస్యను నేనే పరిష్కరించుకుంటున్నాను. రాధికా ఆప్టే తెలుగులోనే కాదు దక్షిణాది సినిమాలు చేయనని గట్టిగా చెప్పేశారు. ‘ఇక్కడ అసలు మనిషిలా చూడట్లేదు’ అని చాలా ఘాటుగానే సినీ పరిశ్రమను విమర్శించారు. అలాంటిదేం జరగలేదు నేను చేసిన మొదటి సినిమా ఐస్‌క్రీమ్ 2. ‘రామ్‌గోపాల్ వర్మతో చేస్తున్నావు, జాగ్రత్త’ అని చాలామంది చెప్పారు. భయం భయంగానే సినిమా షూటింగ్‌కి వెళ్లాను. ఆయన ఏ మాత్రం అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే ఫేస్బుక్లో పోస్టు పెట్టేయాలనుకున్నాను. ఆయనే కాదు, టీమ్‌లో అందరూ ఎంతో మంచిగా ఉన్నారు. వారంతా పని దాహం ఉన్నవారే. నాకేమీ అక్కర్లేదు... చాలామంది నన్ను వలలో వేసుకోవడానికి డబ్బు ఆఫర్ చేశారు. నాకు ఎవ్వరి డబ్బు అవసరం లేదు. అందునా నీతి తప్పి సంపాదించే డబ్బు అస్సలు అవసరం లేదు. తినడానికి తిండి, ఇల్లు అన్నీ ఉన్నాయి. డబ్బు సంపాదించడం నా జీవిత ధ్యేయం కాదు. నాకు నచ్చి, చేసిన పనికి డబ్బులు వస్తే సంతోషం. నేను రాయగలను, పాడగలను, డైరెక్ట్ చేయగలను. ఎవరో నాకు జీవితం ఇవ్వవలసిన అవసరం లేదు. ఇప్పుడు నేనే సొంతంగా సినిమా తీసే ఆలోచనలో ఉన్నాను. – వైజయంతి అవసరమైతే తిరగబడాలి వేధింపులకు సినీరంగం సహా ఏ రంగమూ అతీతం కాదు. ఎవరికి వాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. లౌక్యంగానో, మొండిగానో ముందుకు సాగాల్సిందే. అవసరమైతే తిరగబడాలి కూడా. సినిమా రంగంలో అవకాశాల కోసం తమను తాము ఆఫర్ చేసుకుంటున్న వారు, తమంతట తాము ‘కమిట్’ అవుతున్నట్టు ప్రకటించే వారు కూడా ఉన్నారు. కొందరు తల్లిదండ్రులు పదిహేడు పద్దెనిమిదేళ్ల అమ్మాయిల్ని తీసుకొచ్చి మా అమ్మాయిని మీకు అప్పజెపుతున్నాం.. మీదే పూచీ.. అన్నట్టు మాట్లాడుతుంటారు. ఈ కోణాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. శీలం అనేది నైతికతలో ఒక భాగం. అది ప్రధానం అనుకున్నవాళ్లు గట్టిగా నిలబడాలి. ఎదురు తిరగాలి. డబ్బు, అవకాశాలతో లొంగదీసుకోవాలనుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏ రంగంలోనైనా నీతికోసం నిలబడితే, ఎదురు తిరిగితే గెలుస్తాం. శ్రేష్ఠ ఇందుకు ఒక ఉదాహరణ. సినిమా, మోడలింగ్, ఎంటర్టైన్మెంట్ వంటి రంగాల్లో ఆమెలా నిలబడుతున్న వాళ్లు్ల కొందరున్నారు. – తమ్మారెడ్డి భరద్వాజ, సినీ దర్శకులు. -
అబల చెంతకు సబల
వేధింపులపై నోరు మెదిపితే, ఇదేంటని ప్రశ్నిస్తే, నలుగురికీ తెలిస్తే, అమ్మో ఆడపిల్లలం.. హద్దుల కోట దాటకూడదు.. గుండెల్లో వేదన బయటకురాకూడదు. హింసిం చడం మగాళ్ల జన్మహక్కు.. భరించడం ఆడాళ్ల విధి రాత..ఇదీ నేటి సమాజంలో మహిళల దుస్థితి. ఇలాంటి వారి కోసమే నేనున్నా నంటూ వస్తోంది ‘సబల’ . అన్ని వర్గాల మహిళ రక్షణ కొంగై మిమ్మల్ని కాపాడనుంది. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సబలను ప్రాజెక్టు నోడల్ అధికారి స్థాయిలో తెనాలి డీఎస్పీ ఎం స్నేహిత ముందుకు నడిపించనున్నారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రాజెక్టు వివరాలను ఆమె వెల్లడించారు. గుంటూరు, తెనాలి: రోడ్డుపై యువతిని ఎవరైనా కామెంట్ చేస్తే తలొంచుకుని వెళుతుంది. ఇంట్లో మహిళలు ‘నా భర్తే కదా కొట్టాడు’ అని ఊరుకుంటారు. దీంతో కొట్టటం తన హక్కు అన్న భావన మగాళ్లలో వస్తుంది. మొదట్లోరనే ప్రశ్నిస్తే, పోలీసులను ఆశ్రయిస్తే సమస్య తెగేదాకా వెళ్లకుండా ఉంటుంది. వీరి కోసమే ‘సబల’ ప్రారంభించామని ప్రాజెక్టు నోడల్ అధికారి, తెనాలి డీఎస్పీ స్నేహిత తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు సాక్షికి ఆమె వెల్లడించారు. ఇలాంటి వారి కోసమే ‘సబల’ ప్రాజెక్టు ఫిర్యాదు చేస్తున్న మహిళల శాతం పెరిగినా చైతన్యస్థాయి మెరుగుపడాలి. ఇంకా నోరువిప్పలేని వారి కోసం జిల్లాలో ‘సబల’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. జిల్లా ఎస్పీ అప్పలనాయుడు ఆలోచనతో రెండు నెలలుగా పైలెట్ ప్రాజెక్టుగా రహస్యంగా అమలు చేస్తున్నాం. మహిళా కానిస్టేబుళ్లు కాలేజీ విద్యార్థులు, పని చేసే కూలీలు, ఉద్యోగినులు, గృహిణులను కలుస్తూ వారి అంతరంగాన్ని తెలుసుకుంటున్నారు. అన్యాయాన్ని పూసగుచ్చితే ఫిర్యాదు తీసుకుని అందుకు పాల్పడినవారి పీచమణుస్తున్నాం. మహిళల నుంచి స్పందన బాగుంది. హాస్టల్లో ఉండే విద్యార్థినిని తన స్నేహితుడు ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడు. అనుకోకుండా ఆ ఫోను తీసిన రూమ్మేట్కూ ఆ బాధ తప్పలేదు.‘సబల’కు చెప్పటంతో అతడిని అరెస్టు చేశాం. ‘సబల’ను నెలాఖరుకు అధికారికంగా ప్రారంభించబోతున్నాం. ముగ్గురం ఆడపిల్లలమే... తూర్పుగోదావరి జిల్లా మాది. కాకినాడ దగ్గర తాళ్లరేవులో మా నాన్న ప్రధానోపాధ్యాయుడు. అమ్మ గృహిణి. మేం ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఇద్దరు చెల్లెళ్లూ ఇంకా చదువుతున్నారు. అంతా ఆడపిల్లలే అని వారెప్పుడూ విచార పడింది లేదు. మరింతగా ఖర్చు పెడుతూ ఎక్కువగా చదివించారు. ‘ఇంకా ఎంతకాలం ఇలా చదువులంటారు...పెళ్లిళ్లు చేయకుండా’ అంటూ బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు ప్రశ్నిస్తున్నా పట్టించుకోలేదు. ఓపికగా చదివించారు. డిగ్రీ తర్వాత నుంచి గ్రూప్స్, సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ పీజీ, ఎంఫిల్ చేశాను. 2012లో గ్రూప్–1లో సెలక్టయ్యాను. పీహెచ్డీ కూడా చేయబోతున్నా. సమయం సరిపోవటం లేదు. నిశ్వబ్దాన్ని వీడితేనే న్యాయం.. వేధింపులు, హింసకు గురైన మహిళలు నాలుగు గోడల మధ్య కుమిలిపోతే న్యాయం జరగదు. అన్యాయంపై నిశ్శబ్దాన్ని వీడా. గొంతు పెగల్చుకొని ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. దోషులకు దండనతోనే బాధితులకు ఉపశమనం కలుగుతుంది. మరొక మగాడు ఆ నేరానికి పాల్పడేందుకు భయపడతారు. మహిళలపై ఆగడాలకు వారి మౌనం కూడా దారితీస్తోందని చెప్పటానికి నేను సంకోచించను. ఆవారాగా తిరిగే ఓ యువకుడు నలుగురు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయిదో అమ్మాయి మైనరు. అయినా ధైర్యంగా నోరు విప్పింది. కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. మొదటి బాధితురాలే నిశ్శబ్దాన్ని వీడినట్టయితే ముందు నలుగురూ అతడి బారిన పడేవారు కాదు కదా! ‘షీ టీమ్లోమూడేళ్లలో 2 వేల కేసులు గ్రూప్–1లో నెగ్గి డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాక తొలి పోస్టింగ్ సైబరాబాద్‌లో ఇచ్చారు. అక్కడ షీ టీమ్స్‌లో పని చేశాను. రోడ్లపై డెకాయ్ ఆపరేషన్లు చేస్తూ ఆడవాళ్లపై వేధింపులు/హింసకు పాల్పడే వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం ‘షీ’ విధి. ఇందులో మూడేళ్లు పని చేసిన నేను రెండు వేల వరకు కేసులు నమోదు చేయగలిగా. ఆ అనుభవంతోనే ఇప్పుడు ‘సబల’కు జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నాను. నగరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో సెన్సిటివ్‌గా ఉంటారు. వీరి నుంచి జాగ్రత్తగా సమాచారం తీసుకోవాలనే ఉద్దేశంతో సబల రూపకల్పన జరిగింది. -
మహిళల ఉసురు తీస్తున్న 'కులం'
పురుషాధిపత్య సమాజంలో మహిళలు సామాజిక అణచివేతకు, లింగ వివక్షకు గురి అవుతున్నారనేది ఎవరూ కాదనలేని సత్యం. అయితే తాజాగా ఐక్యరాజ్య సమితి (ఐరాస) విడుదల చేసిన నివేదిక మరింత ఆందోళనకు గురిచేసింది. దళిత మహిళలపై జరుగుతున్న లైంగిక, శారీరక దాడులు, వివక్షకు తోడు వారిని కులం కూడా కాటేస్తోందని యూఎన్ అధ్యయనం వెల్లడించింది. వారు నివసించే మురికివాడల్లోని పారిశుధ్యలేమి, అనారోగ్య పరిస్థితులు, అందుబాటులో లేని వైద్య సదుపాయాలు దళిత మహిళల ఆయుర్దాయాన్ని మింగేస్తున్నాయని తెలిపింది. ఆధిపత్యకులాలలోని మహిళలతో పోలిస్తే దళిత మహిళ కనీసం 15ఏళ్లు (14.6)ముందుగానే కన్నుమూస్తోందని ఐరాస నివేదిక తేల్చింది. దళిత మహిళ సగటున 39.5 ఏళ్లకే చనిపోతోంటే.. ఇతర కులాల మహిళల్లో ఇది 54.1 గా ఉంది. అంతేకాదు సామాజిక హోదా, ఇతర అంశాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఈ గ్యాప్ 11 సంవత్సరాలుగా ఉంది. ఐక్యరాజ్యసమితి 2015 లో '2030 నాటికి జెండర్ ఈక్వాలిటీ' సాధించాలనే ఎజెండాను ఆమోదించిన రెండు సంవత్సరాల అనంతరం ఈ నివేదికను వెల్లడించింది. పేదరిక నిర్మూలన, ఆహారం, నీరు, పారిశుధ్యం, ఆరోగ్యం, భూమి, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం లాంటి 17 రకాల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) అమలులో సవాళ్లను ఈ అధ్యయనం పరిశీలించింది. దాదాపు 89 దేశాల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ దళిత్ స్టడీస్ పేరుతో నిర్వహించిన అధ్యయనం ఈ విషయాలను ప్రకటించింది. సమాజంలో వెనుకబడి ఉన్న మహిళలు, బాలికలు తరచూ లింగ అసమానతలతోపాటు ఇంకా పలురకాల కష్టాలు అనుభవిస్తున్నారు. నిరుపేద కుటుంబాలలో నివసించే స్త్రీలు తమ పని సమయములో 24శాతం వంట చెఱకు, నీరు, ఆహారం, గృహ అవసరాలకోసం వినియోగిస్తుండగా, ధనిక కుటుంబాలలోని మహిళలు దీంట్లో సగ భాగాన్ని అంటే 12శాతం సమయాన్ని అలాంటి పనులకు కేటాయిస్తున్నారట. భారతదేశంలో 20-24 ఏళ్ల వయస్సులో ధనిక వర్గాలనుంచి వచ్చిన యువతులతో పోలిస్తే గ్రామీణ పేద యువతుల్లో పాఠశాలకు వెడుతున్నవారి సంఖ్య 21.8 రెట్లు తక్కువగా ఉంది. అలాగే 18 ఏళ్ళలోపు పెళ్లిళ్లు గ్రామీణ ఐదు రెట్లు ఎక్కువ. కౌమార దశలోనే తల్లులుగా మారుతున్న వారి సంఖ్య 5.8రెట్లు ఎక్కువ. సాంఘిక సోపానక్రమంలో తక్కువ విద్య, తక్కువ హోదా ఉన్న మహిళ మరింత శ్రమదోపిడీకి గురవుతుందనీ, భూమిలేని, షెడ్యూల్డ్ కులాలు, తెగల నుంచి వచ్చి ఉంటే ఈ దోపిడీ ఇంకా తీవ్రంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. 1990ల ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా మొత్తం అక్షరాస్యత రేటు, పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, లింగ, సామాజిక అసమానతలు ఇప్పటికీ ఉన్నాయని నివేదించింది. ఇందుకు జనాభాలో 16.6శాతంగా ఉన్న షెడ్యూల్డ్ తెగలు 8.6శాతంగా ఉన్న షెడ్యూల్డ్ కులాల అక్షరాస్యత రేటు భారతీయ సగటు అక్షరాస్యత రేటు కంటే తక్కువగా ఉండటాన్ని నిదర్శనంగా పేర్కొంది. ఎస్.టి. మహిళల అక్షరాస్యత రేటు ఇప్పటికీ 50శాతం కంటే తక్కువగా, ఎస్సీ మహిళల్లో 57శాతం కంటే తక్కువగా ఉందని చెప్పింది. అందరికీ అభివృద్ధి అనే లక్ష్యాన్ని సాధించాలంటే మహిళల ముందస్తు పురోగతి ప్రాధాన్యతను యూఎన్ నివేదిక నొక్కి చెప్పింది. -
ఆ...డపిల్లనట!
ఆడ పిల్ల పుట్టింది. మా ఇంటి మహాలక్ష్మి పుట్టింది. అవును మా అమ్మ పుట్టింది..కాదండీ అంతా మా నాన్న పోలిక. ఉప్పొంగిన తల్లిదండ్రుల ఆప్యాయత ఇది. క్రమేణా వీరి అమృతమంటి ప్రేమతోపాటు పసిబిడ్డా ఎదిగింది ఆడపిల్లగా.. ఇదిగో భయం.. అమ్మ అనురాగం ఆందోళన పడింది.. మమకారం నిండిన నాన్న గుండె బరువెక్కింది. ‘మంచి సంబంధం వచ్చింది. ఎన్ని రోజులు ఉంచినా ఆడ పిల్ల మనపిల్ల కాదే’.. ‘అవునండీ. ఆ...డపిల్లే.. పిల్ల చదువు మరి’.‘.ఆడ పిల్లకు చదువెందుకే’ .. రేనండీ’.. అదిగో బాల్యం మెడలో పడిన తాళి ఆలిని చేసింది. మెట్టినింట బానిసగా మార్చేసిన అజ్ఞానకేళి వెర్రిగా నవ్వింది. గుంటూరు(ఎస్వీఎన్కాలనీ): జిల్లాలో బాల్య వివాహాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి పేదరికం, అజ్ఞానం, ప్రేమ పెళ్లిళ్లు, మూఢ నమ్మకాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్ద నమోదైన ఫిర్యాదుల్లో 7 నుంచి 11వ తరగతిలోపు, 12 నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు సామాజిక పరిరక్షణ పేరుతో బాల్య వివాహాలు చేస్తున్నట్లు వెల్లడైంది. శాఖల మధ్యసమన్వయలోపం పసితనానికి మాంగల్య బంధం పడటానికి ప్రధాన కారణం శాఖల మధ్య సమన్వయలోపమే. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ముందుగా సమాచారం ఉండేది గ్రామ పంచాయతీలకే. వీరు కనీసం తల్లిదండ్రులకు అవగాహన కూడా కల్పిం చడం లేదు. పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల మధ్య సమన్వయలోపమే ఇందుకు కారణ. సర్పంచ్‌లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీలతోపాటు ఉన్నతాధికారులు సైతం బాల్య వివాహాలను అడ్డుకోవడం లేదు. తాంబూలాలు మార్చుకుని తీరా వివాహానికి సిద్ధమైన రోజు గ్రామంలో ఎవరో ఒకరు స్వచ్ఛంద సంస్థలకు, ఐసీడీఎస్ అధికారులకు, పోలీసులకు సమాచారమిస్తున్నారు. ఆ సమయంలో అధికారులు స్పందించి బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా డబ్బులు పోగు చేసుకుని పెళ్లికి సిద్ధమైన తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసి తీరుతామని భీష్మించుకుంటున్నారు. సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయంటే.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 28 శాతం బాలికలకు 18 ఏళ్లలోపే పెళ్లిళ్లు అవుతున్నాయి. వీరిలో 58 శాతం 19 ఏళ్లు కూడా నిండకుండానే తల్లులవుతున్నారు. యంగ్ లైవ్స్ ఇండియా, చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఫౌండేషన్, డిపార్టుమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ సంయుక్త అ«ధ్యయనంలో వెల్లడైన చేదు నిజా లివి. 15 ఏళ్ల తరువాత కూడా చదువును కొనసాగించిన అమ్మాయిలతో పోల్చితే ఈలోపు చదువు ఆపేవారే ఎక్కువగా బాల్య వివాహాలకు లోనవుతున్నారు. బాల్య వివాహాల్లో పురుషుల కేవలం 2 శాతం మాత్రమే. బాల్య వివాహానికి హాజరయ్యే వారూ శిక్షార్హులే బాల్య వివాహానికి హాజరయ్యే వారందరూ శిక్షకు అర్హులేనని చట్టం చెబుతోంది. తమిళనాడులో ఓ బాల్య వివాహంలో పెళ్లి వీడియో ద్వారా దాదాపు 300 మందిపై కేసులు నమోదు చేశారు. బాల్య వివాహ నిషేధ చట్టం బాలికకు 18 ఏళ్లు, బాలుడికి 21 ఏళ్లు వివాహ వయసు నిర్ణయించింది. అతిక్రమిస్తే నేరానికిగాను రెండేళ్లు కారాగార శిక్ష, లక్ష జరిమానా విధిస్తుంది. పెళ్లి చేసిన, పెళ్లి చేసుకున్న, పౌరహిత్యం జరిపిన, వేదిక ఇచ్చిన, ప్రోత్సహించిన సంస్థలకూ శిక్ష వర్తిస్తుంది. చట్టంలో వధువుకు, వధువు తల్లికి, తండ్రికి శిక్ష వర్తింపు మినహాయింపు ఉంటుంది. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి బాల్య వివాహాలు ఆపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, పురోహితులు ఇందుకు ముఖ్యపాత్ర పోషించాలి. పెళ్లి రోజు వరకు రాకుండా ముందస్తుగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. లేదంటే అధికారులకు సమాచారమివ్వాలి. మా వంతుగా అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.– శ్యామసుందరి, పీడీ ఐసీడీఎస్ -
పడుకోవాలంటే భయమేస్తోంది
రుతుక్రమం ఆగిపోయింది.. కోరికలూ ఆవిరైపోయాయి! ఆయన వాంఛను ఆపలేకపోతోంది! నిద్రముంచుకొస్తోంది.. కానీ పడుకోవాలంటే భయమేస్తోంది!! ‘‘నా వల్ల కాదే... చచ్చిపోవాలనిపిస్తోంది... నాకు ఈ పనిష్మెంట్ ఏంటీ?’’ శారద ఏడుస్తోంది ఫోన్లో. ‘‘ఊరుకో అమ్మా! నువ్వు ఇదంతా భరించాల్సిన అవసరం లేదు. వెళ్లి రాజీవ వాళ్ల అమ్మను కలువు. ఫోన్ నంబర్ వాట్సాప్ చేస్తా. రాజీవక్కూడా చెప్తాను. అది ఇంటికొచ్చి నిన్ను తీసుకెళ్తుంది. ఓకే నా.. అమ్మా.. ఓకేనా..?’’ తల్లిని ఊరడిస్తోంది.. ఆమెకు ధైర్యమిస్తోంది సంహిత. ‘‘ఊ... సరే’’ అని ముక్కు తుడుచుకుంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది శారద. అయిదు నిమిషాల్లో రాజీవ వాళ్ల అమ్మ శైలజ నంబర్ వాట్సాప్ చేసింది సంహిత. చూసుకుని, ఆమెకు ఫోన్ కలిపింది. అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. తెల్లవారే రాజీవ వచ్చి శారదను తీసుకొని వెళ్లింది వాళ్లమ్మ ఆఫీస్‌కి. ముసల్దానా... ‘‘సంహిత అమెరికాలో, బాబు అంకిత్ ఆస్ట్రేలియాలో. ఇక్కడ మేమిద్దరమే. మేము యంగ్‌గా ఉన్నప్పుడు కూడా దొరకనంత ప్రైవసీ. కానీ అలాంటి ప్రైవసీని ఆస్వాదించే స్థితిలో నేను లేను. మెనోపాజ్. ఆయనేమో చాలా ఉత్సాహంగా ఉంటున్నాడు. నన్నూ అలా ఉండమని ఇన్సిస్ట్ చేస్తున్నాడు. నా వల్ల కావట్లేదు. ఆయనకు కోపం వస్తోంది. తిడుతున్నాడు చండాలంగా. భరించలేని నొప్పి, మంట.. ఆ ఇబ్బందిని ఎక్స్‌ప్రెస్ చేయాలన్నా భయమేస్తోంది. కొడుతున్నాడు. ‘ముసల్దానితో సంసారం చెయ్యాల్సిన కర్మ పట్టింది. ఇంకోదాన్ని చూసి పెళ్లి చేయ్ మరి’ అంటూ వేధిస్తున్నాడు’’ అని ఏడ్చేసింది శారద. ‘‘పైగా వికృతమైన చేష్టలు, అసహజమైన పద్ధతుల్లో అడుగుతున్నాడు. పోర్న్‌సైట్స్ చూడ్డమే కాదు.. అలాంటి వీడియోలను నాకు వాట్సాప్ కూడా చేస్తున్నాడు’’ అంటూ వాంతికొచ్చినట్టయి బాత్రూమ్లోకి పరిగెత్తింది శారద. ‘‘మమ్మీ.. ఆంటీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ లేదా?’’ బాధగా అడిగింది రాజీవి. ‘‘ఊ... ’’కుర్చీలో వెనక్కి వాలుతూ నిట్టూర్చింది శైలజ. ఇంతలోకే మొహం తుడుచుకుంటూ వచ్చింది శారద. ‘‘శారదగారూ... కౌన్సెలింగ్, కంప్లయింట్లతో మీ ఆయనను మార్చేదేమీ ఉండదు. ఎందుకంటే ఆయనా పోలీస్ ఆఫీసరే. ఎలా డీల్ చేస్తారు, ఫలితం ఏముంటుందో ఆయనకు తెలుసు. కాబట్టి..’’ అని ఆగి శారద వైపు చూసింది శైలజ. ‘‘చెప్పండి’’ అంది శారద. ‘‘మీ సమస్యకు పరిష్కారాన్నిచ్చేది, మీ బాధకు ఉపశమనాన్ని కలిగించేది ఒక్కటే.. డీవీ యాక్ట్!’’ అని పూర్తిచేసింది శైలజ. ‘‘డీవీ యాక్టా? అంటే?’’ అమాయకంగా సందేహాన్ని వెలిబుచ్చింది శారద. ‘‘డొమెస్టిక్ వయలెన్స్. ఇందులోనే మీది సెక్సువల్ హెరాస్మెంట్ కిందకు వస్తుంది’’ అని వివరించి శారద ఏం చేయాలో చెప్పింది శైలజ.ప్రొటెక్షన్ ఆర్డర్స్ శైలజ చెప్పినట్టే చేసింది శారద. భర్త వికృతచేష్టలను వీడియోలో రికార్డ్ చేసింది. తన మెడికల్ రిపోర్ట్‌తో సహా ఆ వీడియోను కోర్టులో ఫైల్ చేసింది. ఆమె భర్తకు నోటీసులు వెళ్లాయి. షాక్ అయ్యాడు భర్త. తన ఇంట్లోకి ఎలా అడుగుపెడుతుందో చూస్తా అనుకున్నాడు అహంకారంగా. నిర్భయంగా, అధికారికంగా అడుగుపెట్టింది ఆమె కోర్టు ఇచ్చిన ప్రొటెక్షన్ ఆర్డర్స్‌తో. అంతేకాదు ‘‘ఇక ముందు ఇలా ప్రవర్తిస్తే సెక్షన్ 377 కింద బుక్ చేయాల్సి వస్తుంది. పదేళ్లు చిప్పకూడు తింటావ్’’అని ఆ పోలీస్ ఆఫీసర్‌కు వార్నింగ్‌కూడా ఇచ్చింది కోర్టు. మీ సమస్యకు పరిష్కారాన్నిచ్చేది, మీ బాధకు ఉపశమనాన్ని కలిగించేది ఒక్కటే.. డీవీ యాక్ట్!’’ అని పూర్తిచేసింది శైలజ. -
పెరుగుతున్న గృహహింస మరణాలు
-
అసలీ ‘ఆడపిల్ల’ ట్యాగ్ మాకెందుకు?
-
ఆ ట్యాగ్ మాకెందుకు?
ఆడపిల్లలా ఉండు.. ఆడపిల్లలా మాట్లాడు.. ఆడపిల్లలా నడువు..చివరకు నవ్వడం, ఏడ్వడం, కూర్చోవడం, తినడం.. ఇలా అన్నీ ఆడపిల్లలా చేయమంటారు! ఎందుకు వేశారీ శిక్షలు.? ఎవరు విధించారీ ఆంక్షలు.? అసలీ ‘ఆడపిల్ల’ ట్యాగ్ మాకెందుకు? అంటూ ప్రశ్నించారు హోలీమేరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థినులు. స్త్రీ వివక్షపై ‘సాక్షి’ సాగిస్తున్న సమరంలో భాగంగా ‘నేను శక్తి’ శీర్షికతో అమ్మాయిలు మనసు విప్పి మాట్లాడారు. స్త్రీపురుషసమానత్వ భావనకు సాక్ష్యంగా నిలిచారు. సాక్షి, సిటీబ్యూరో : మేము అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. బరువుగా కాదు.. బాధ్యతగా ఎదుగుతాం. మా చుట్టూ ఉన్న సమాజాన్ని నిలదీస్తాం. మార్పుని సాధిస్తాం. అమ్మాయే కదా.! అన్నీ నిశ్శబ్దంగా భరిస్తుంది అనుకుంటున్నారా? ఎదుర్కొంటాం.. తిరగబడతాం.. సమానత్వం కోసం.. సమాజంలో మార్పు కోసం.. ఆడపిల్లవి మెకానికల్ ఇంజినీరింగ్ తీసుకున్నావా? అని ఆశ్చర్యపోతాడు చుట్టం చూపుగా వచ్చిన అంకుల్. అయినా ఇంజినీరింగ్ ఎందుకు? త్వరగా పూర్తయ్యే డిప్లొమా కోర్సు ఏదైనా చేయలేకపోయావా? అంటూ ఉచిత సలహా ఇస్తాడు దారినపోయే దానయ్య. పురివిప్పిన నెమలిలా ఓ ఆడపిల్ల అన్నయ్య పెళ్లిలో నాట్యం చేయడం కూడా తప్పేనంట. ఆడపిల్ల చదివితే ఓ సమస్య.. ఉద్యోగం చేస్తే మరో సమస్య. ఆమె ఇంట్లో ఉన్నా, బయటకెళ్లినా సమస్యే. నిజానికి ఆమె ప్రతి కదలికా ఓ సమస్యే. అసలు ఆడపిల్లే సమస్యగా మారిన చోట అంబరాన్నంటే ఆత్మవిశ్వాసంతో అడుగడుగునా తనని తాను రుజువు చేసుకుంటూ.. వివక్షని ఎదిరిస్తూ.. తమ కాళ్లపై తాము నిలబడుతూ మహిళా శక్తికి మారుపేరుగా నిలుస్తున్నారీ నేటి బాలికలు. తాము ఎదుర్కొన్న అవమానాలు, వివక్షలను చెప్పిన అమ్మాయిలు... ‘సాక్షి’ సమరంలో భాగమవుతామని ముక్తకంఠంతో నినదించారు. అన్నింట్లో వివక్షే.. ‘ఆటల దగ్గర్నుంచి వేషధారణ వరకు మగపిల్లల్లో లేని అణకువని ఆడపిల్లల్లో ఎందుకు వెతుకుతారు? అణకువగా ఉండడమంటే అణిగిమణిగి ఉండడమనేనా? ఆడపిల్లలకు అభిప్రాయాలుండవా? ఆకాంక్షలుండవా? ఆశలుండవా? చదువు, ఉద్యోగం ఆడపిల్లలకు అవసరం లేని విషయాలా? ఆ రెండింటిలోనూ ఎంపిక బాధ్యత ఆమెది కాదా? ఏ కోర్సు చేయాలి.. డిప్లొమోనా? ఇంజనీరింగా? ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి... మెకానికలా? కంప్యూటర్ సైన్సా? ఏ ఉద్యోగం చేయాలి.. టీచరా? డాక్టరా? చివరకు ఏ మీడియం తీసుకోవాలి... అన్నయ్యకైతే ఆంగ్లం..? నాకైతే తెలుగు! ఏ డ్రెస్ వేసుకోవాలి... చూడీదారా? షార్ట్స్ వేసుకోవాలా? మా పనులకు హద్దు సూర్యాస్తమయమేనా? నాన్నకి జబ్బు చేస్తేనో, అమ్మకి మందులు అయిపోతేనే ఆడపిల్లలు బయటకెళ్తే రేప్‌లు జరుగుతాయని భయపెట్టడం కన్నా... అలా జరగకుండా మగపిల్లల్ని పెంచరెందుకో? డబ్బున్నా లేకున్నా ఆడపిల్లకి సర్కార్ బడి, అన్నయ్యకి ప్రైవేట్ కార్పొరేట్ చదువు. ఎందుకీ వివక్ష? తల్లిందండ్రుల బాధ్యతను ఆడపిల్లలు పంచుకోరనేగా? ఈ అసమానతలను, వివక్షనూ పక్కనపెట్టి మమ్మల్ని సమానంగా ఎదగనివ్వండి.. మేమేంటో నిరూపిస్తాం’ అంటూ సవాల్ చేశారు ‘హోలీమేరీ’ విద్యార్థినులు. అన్నింటికీ అమ్మాయి అంటూ తక్కువ చేసి చూసే అసమాన భావనలకు స్వస్తి పలుకుతూ... మాకు తగిలిస్తోన్న ‘అమ్మాయి ట్యాగ్’ను వదిలించుకొని.. మేమొక శక్తిగా ఎదుగుతామని చాటి చెప్పారు. -
ఆడపిల్ల భారమన్నారు..!
హిమాయత్‌నగర్: ఆ బాలికలు ఎన్నో ఆశలు... ఆశయాలతోచదువుకుంటున్నారు. భవిష్యత్తుపై ఆకాంక్షలతో కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. కానీ... ఆ ఆశలు అడియాసలయ్యాయి. కలల సౌధం కుప్పకూలింది. ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. ఇక ఈదరిద్రాన్ని మేం భరించలేమని కుటుంబసభ్యులు తీసుకున్ననిర్ణయానికి ఆ చిన్ని హృదయాలు తల్లడిల్లాయి. బాలల హక్కుల సంఘం సహాయంతో బాల్య వివాహం బారి నుంచి బయటపడిన ఆ చిన్నారులు... అవమానాలను దిగమింగి, ఆటుపోట్లను అధిగమించి ఇప్పుడు చదువు, ఆటల్లో రాణిస్తున్నారు. చదువూ సంధ్య.. ‘తమ్ముడు.. నీ కూతుర్ని ఇంకెంత కాలం చదివిస్తావ్ రా? చదివించింది చాలు... ఇక పెళ్లి చేసేయ్. మంచి సంబంధం చూద్దాం. ఈ దరిద్రాన్ని ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటావ్. ’ – ఇదీ సంధ్యకు మేనత్త నుంచి ఎదురైన పరిస్థితి హయత్‌నగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వగ్లాపురం మల్లేష్, సూర్యకళల పెద్ద కుమార్తె సంధ్య. ‘మాకు ఆస్తి లేదు. పెళ్లి చేసి నన్ను వదిలించుకోవాలని మా మేనత్త, మామయ్యలు.. మా నాన్నకు చెప్పారు. 2016 ఏప్రిల్ 20న వివాహం నిశ్చయించారు. బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అడ్డుకొని హోమ్‌కు తీసుకెళ్లారు. అయితే పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపానికి గురై నాన్న చనిపోయారు. బంగారం లాంటి మనిషిని నువ్వే చంపేశావ్.. చదువుకొని ఏం సాధిస్తావ్ అంటూ సూటిపోటి మాటలతో నన్ను కుంగదీశార’ని ఆవేదన వ్యక్తం చేసింది సంధ్య. తిట్టినోళ్లే మెచ్చుకున్నారు... ‘నాకు ఏప్రిల్ 3న ఎంగేజ్మెంట్ నిశ్చయించారు. అప్పుడు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పెళ్లి చేసుకుంటాను అంటేనే.. నువ్వు పరీక్షలకు వెళ్లేది అంటూ ఇంట్లో షరతు పెట్టారు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనని సోషల్ పేపర్–1 పరీక్ష రాయలేదు. బాలల హక్కుల సంఘం కృషితో సోషల్ పేపర్–2 రాశాను. ఒక్క పేపర్ రాయకపోయినప్పటికీ 7.5 జీపీఏ సాధించాను. అప్పుడు అందరూ మెచ్చుకున్నారు. నన్ను తిట్టిన వాళ్లే.. నీలో ప్రతిభ ఉందని ప్రోత్సహించారం’టూ చెప్పింది సంధ్య. ఈమె ప్రస్తుతం బీఎన్‌రెడ్డినగర్‌లోని ఎన్ఆర్ఐ కళశాలలో ఇంటర్ చదువుతోంది. ఆటా అనూష... ‘తల్లి.. మీ నాన్న మిమ్మల్ని వదిలేశాడు. వేరే ఆమెతో ఉంటున్నాడు. అన్నీ చూసుకోవాల్సిన మీ నాన్న.. మిమ్మల్ని మాపై వదిలేశాడు. అందుకే నీకు పెళ్లి చేసేస్తాం. మా బరువు, బాధ్యత తీరిపోతుంది’ – ఇదీ అనూషకు అమ్మమ్మ–తాతయ్యల నుంచి ఎదురైన పరిస్థితి సరూర్‌నగర్‌లో నివసించే బొడ్డుపల్లి శ్రీను, అరుణల కుమార్తె అనూష. శ్రీను లారీ డ్రైవర్, అరుణ గృహిణి. ‘మా నాన్న మమ్మల్ని వదిలేశాడు. వేరే ఆమెతో కాపురం పెట్టాడు. ఇల్లు గడవడం కూడా కష్టమవడంతో నాకు త్వరగా పెళ్లి చేసి పంపేయాలనే ఆలోచన అమ్మమ్మ, తాతయ్యలకు వచ్చింది. గతేడాది మే 4న వివాహం చేసేందుకు సిద్ధమవగా, బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అడ్డుకున్నారు. కాచిగూడలోని హోమ్‌లో 20 రోజులు ఉన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. పెళ్లి చేసుకోకుండా ఇంకెంత కాలం ఉంటావే.. అంటూ తిట్టారు. వాటన్నింటినీ దిగమింగుతూ కాలేజీకి వెళ్తున్నాను. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాన’ని వివరించింది అనూష. క్రికెట్, రగ్బీలో మేటి.. ‘నాకు ఆటలంటే ఇష్టం. మా పీఈటీ రాఘవరెడ్డి సార్ నన్నెంతో ప్రోత్సహించారు. క్రికెట్ బాగా ఆడడం నేర్చుకున్నాను. ఇప్పుడు స్టేట్ టీమ్‌లో నేనొక ఫాస్ట్ బౌలర్‌ని. మధ్యప్రదేశ్, గుజరాత్, మన రాష్ట్రంలోని గుర్రంగూడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాను. భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది నా కోరిక. క్రికెట్‌తో పాటు రగ్బీ అంటే కూడా నాకిష్టం. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాన’ని చెప్పింది. -
చదువులో దూసుకెళ్తాం..
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. మహిళలు చదువుకుంటే కుటుంబమంతటికీ ప్రయోజనం చేకూరుతుంది. ఇంటిలో అన్ని వ్యవహారాలు సమర్థంగా చక్కదిద్దుకుంటుంది. సారథిగా ఇంటిని నడిపిస్తుంది..అందుకే ఈనానుడి.. ఆడపిల్లకు పెద్ద చదువులవసరం లేదు..కొద్దో గొప్పో చదివించి పెళ్లి చేస్తే పోతుందనే భావన ఎక్కువ మంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే ఇప్పుడిప్పుడే కొంత చైతన్యం వస్తోంది. ఆడపిల్లలు చదువుకుని రాణిస్తే వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలరనే భావన ఏర్పడుతోంది. మహిళలు ఆర్థిక బలం పెంచుకుని ధైర్యవంతులుగా జీవితాన్ని సాగిస్తారని తల్లిదండ్రులు గుర్తిస్తున్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో సైతం వీరి శాతం పెరుగుతోంది. దూర ప్రాంత చదువులకు మగపిల్లల్ని పంపినట్టే ఆడపిల్లలనూ పంపడానికి తల్లిదండ్రులు వెనుకాడటం లేదు. తిరుపతిలో జరుగుతున్న అగ్రిఫెస్టుకు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలు వచ్చారు. వారిని ఇదే కోణంపై ‘సాక్షి’ ప్రశ్నించినప్పుడు వారంతా సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. చదువుల విషయంలో వివక్ష తగ్గిందని.. తల్లితండ్రుల్లో ఈమార్పు ఇంకా పెరగాలని వారంతా ఆకాంక్షించారు. వారేమంటున్నారో తెలుసుకుందాం. – యూనివర్సిటీ క్యాంపస్ జమ్మూలో తగ్గుతున్న వివక్ష మా ప్రాంతంలో స్త్రీలపై వివక్ష తగ్గింది. సాధారణంగా జమ్ముకాశ్మీర్ అంటే హింసాత్మక వాతావరణం ఉంటుందని అందరూ భావిస్తారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. విద్యాసంస్థల్లో, సమాజంలో మహిళల్లో వివక్ష తగ్గింది. దీనివల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. జమ్ముకాశ్మీర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్త్రీ,పురుషులకు సమాన అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు పరస్పరం సహకరించుకుంటున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యలో సమాన అవకాశాలు వస్తున్నాయి. – మన్విత్ కౌర్, జమ్ము కాశ్మీర్ పూర్తి స్వేచ్ఛ ఉంది వ్యవసాయ విద్యాలయంలో బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుతున్నాను. సాధారణంగా అమ్మాయిలంటేనే ఆంక్షలుంటాయి. అయితే గతంతో పోల్చితే పరిస్థితి మారింది. మా తల్లిదండ్రులు స్వేచ్ఛనిచ్చారు. దానివల్లే ఇలాంటి యువజనోత్సవాలకు వెళ్ళగలుగుతున్నాను. నాటితో పోల్చుకుంటే చాలా మార్పులు వచ్చాయి. సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులు ఇందుకు దోహదపడుతున్నాయి.. –అనామిక శర్మ, జమ్మూ కాశ్మీర్ పరిస్థితులు మారాయి మా తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం వల్ల చదువులో రాణిస్తున్నాను. పూర్వపు రోజుల్లో మహిళలకు విద్య ఎందుకు అన్న వివక్ష ఉండేది. ఆడపిల్లల్ని స్కూళ్లకు పంపేవారు కాదు. విద్య మహిళలకు అవసరం లేదనుకునేవారు. ఇప్పుడు ఆలోచనల్లో మార్పులొచ్చాయి. దీనివల్ల అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారు. మేం పురుషులకు ఏమాత్రం తీసిపోము. – గురుసేన్కౌర్,జమ్మూకాశ్మీర్ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ఇప్పుడు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు పెరి గాయి. తల్లిదండ్రులు కూడా పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. కోరుకున్న చదువు, ఉద్యోగం తదితర అంశాల్లో స్వేచ్ఛ పెరిగింది. మా తల్లిదండ్రులు చిన్నతనం నుంచి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేను ఎలాంటి వివక్షకు గురికాలేదు. వివక్ష నగరాల్లో పూర్తిగా తగ్గింది. ఇది మరింత విస్తృతం కావాల్సిన అవసరముంది. – హిధన్సీ అబ్రల్, జమ్మూకాశ్మీర్ స్త్రీలకు అనుకూల వాతావరణం నాన్న అంబుజా సిమెంట్ కంపెనీలో పనిచేస్తారు. కుటుంబంలో ముగ్గురం ఆడపిల్లలమే. అయినప్పటికీ అందరినీ చదివిస్తున్నారు. ఇటీవల కాలంలో మహిళలకు పురుషులకన్నా అవకాశాలు పెరిగాయి. దీంతో స్త్రీలు గడప దాటి సమాజంలోకి వెల్లగలుగుతున్నారు. స్త్రీ రిజర్వేషన్ల వల్ల పురుషులకన్నా మహిళలకే అకాశాలు పెరిగాయి. – జోషి ముద్ర, గుజరాత్ 70 శాతం మంది అమ్మాయిలే తమిళనాడులోని కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చాను. యువజనోత్సవాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మా యూనివర్సిటీలో 70 శాతం మంది అమ్మాయిలే ఉన్నారు. భవిష్యత్తులో చదువుకునే అమ్మాయిల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాను. – మోషీనా, తమిళనాడు కెరీర్‌పై దృష్టి పెట్టాలి ప్రొద్దుటూరు వెటర్నరీ కళాశాలలో బీవీఎస్సీ చదువుతున్నాను. మా తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం, నాన్న ప్రైవేటు ఉద్యోగి. ఇంట్లో నాపై ఎలాంటి వివక్ష లేదు. గత ఏడాది భువనేశ్వర్‌లో జరిగిన యువజనోత్సవాల్లో పాల్గొన్నాను. తల్లిదండ్రులు ఇచ్చే స్వేచ్ఛ వల్లే వెళ్లగలుగుతున్నాను. కెరీర్‌పై దృష్టి పెట్టడం నేటి అమ్మాయిల ముందున్న కర్తవ్యమని భావిస్తున్నాను. –తేజశ్విని, కడప సమాన అవకాశాలు ఒకప్పుడు స్త్రీ విద్యపై వివక్ష ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దూర ప్రాంతాలకు పంపడమంటే రిస్కుగా తల్లి దండ్రులు భావించేవారు. ఆధునిక పరిస్థితుల ప్రభావం అందరిపై పడింది. మా నాన్న డాక్టర్. ఆడపిల్లలు చదువుకుంటే మంచిదన్న ఆలోచనతో ప్రోత్సహిస్తున్నారు. మా వర్సిటీలో స్త్రీ పురుషుల సంఖ్య సమానంగా ఉంటుంది. – నిధిసింగ్, రాంచి ఇద్దరూఅమ్మాయిలమే... మాది ఒంగోలు పొద్దుటూరు వెటర్నరీ కళాశాలలో బీవీఎస్సీ చదువుతున్నాను. నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. మా తల్లిదండ్రులకు ఇద్దరం. మా ఇద్దరికి సమాన అవకాశాలు ఇచ్చారు. మా చెల్లి బీటెక్ చదువుతోంది, ఆడపిల్లలకు చదివిస్తున్నారు. విద్యవల్ల సమానత్వం వస్తుంది. ఈ విషయాన్ని మన రాష్ట్రంలో గుర్తించినందుకే మహిళలు రాణిస్తున్నారు. –రేష్మా, ఒంగోలు మహిళలదే ఆధిక్యత నేను తెలంగాణాలోని పీవీ నరసింహారావు వెటర్నరీ నుంచి వచ్చాను. మా తల్లిదండ్రులు ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, నాతో పాటు అక్క, తమ్ముడు ఉన్నారు. అయితే తల్లిదండ్రులు సమానంగా చదివిస్తున్నారు. ఒకప్పుడు అబ్బాయిలను చదివిస్తే చాలనుకునేవారు. ఇప్పుడు మార్పు వచ్చింది. ఇప్పుడు పురుషుల కంటే మహిళలకే ఆధిక్యత పెరిగింది.– నివేదిత, తెలంగాణ నలుగురూ ఆడపిల్లలమే తండ్రి వ్యాపారం చేస్తా రు. అమ్మ గృహిణి. వారు పెద్దగా చదువుకోకపోయినా స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. మా కుటుంబంలో నలుగురమూ ఆడపిల్లలమే. అయినా అందరినీ చదివిస్తున్నారు. అమ్మాయిల చదువుపై కొన్నాళ్లు ఆంక్షలుండేవి. కేవలం కొద్దిపాటి చదువును చదివించి ఇంటికే పరిమితం చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదని భావిస్తున్నాను. –నయిలా ప్రాజ్, రాంచి మొదటి సారి వచ్చాను బాపట్లలో బీఎస్సీ అగ్రికల్చ ర్ చదువుతున్నా. నాన్న టీచర్, అమ్మ గహిణి. ఇంట్లో నేను, చెల్లి ఉంటాము. ఈ యువజనోత్సవాలకు తొలి సారి వచ్చాను. వివిధ ప్రాంతాల వారితో మాట్లాడగలిగాను. యూనివర్సిటీల్లో అక్కడక్కడ వివక్ష ఉంటుందనుకుంటున్నా. – అర్చన చౌదరి, బాపట్ల పరిస్థితి మారింది కోయంబత్తూరు వర్సిటీ నుం చి వచ్చాను. ఒకప్పుడు మహిళలకు చదువు ఎందుకనేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. మా తల్లిదండ్రులకు ఇద్దరూ అమ్మాయిలమే. నాన్న ఫొటోగ్రాఫర్. ఇద్దరమ్మాయిలను సమానంగా చూస్తూ చదిస్తున్నారు. – కార్తీక, తమిళనాడు -
ప్రాణం తీస్తున్న పాపం
అడగకుండానే ఆకలి పేగులకు అన్నం ముద్దయ్యేఅమృతమూర్తి అమ్మ కూడా ఓ ఆడపిల్లే..కష్టాల సగాన్ని కడుపులో దాచుకుని.. ఆనందాలసగాన్ని కట్టుకున్నోడికి పంచే ఆలి కూడా ఓ ఆడపిల్లే.. చిన్నతనంలో ఆటపాటల్లో, అల్లరిచేష్టల్లో అంతులేనిఅనురాగం పంచే సోదరి కూడా ఓ ఆడపిల్లే...మళ్లీ జన్మంటూ ఉంటే నవమాసాలు మోసి పురిటినొప్పులబాధనోర్చి నిన్ను పుట్టించేదీ ఓ ఆడపిల్లే.. నేడు ఈ ఆడపిల్ల అమ్మగర్భంలో ఆయుష్షు పోసుకోకముందేఅనాగరికపు కత్తిపోట్లకు కరిగిపోతోంది.లింగ నిర్ధారణ పరీక్షలతో రేపటి సమాజాన్ని అమ్మ లేని మట్టి బొమ్మను చేస్తోంది. లబ్బీపేట (విజయవాడ తూర్పు): బాలికల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తూ మొగ్గలోనే తుంచేస్తున్నారు. మరికొందరు పుట్టిన గంటల వ్యవధిలోనే ముళ్ల కంపల్లో , చెత్త కుండీల్లో, కాలువల్లో విసిరేస్తూ మానవత్వాన్ని మంట కలుపుతున్నారు. ఇటీవల పుట్టినరోజే శిశువును కాల్వలో వేసిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. చెత్తకుప్పల్లో, కాలువల్లో దొరుకుతున్న శిశువులంతా ఆడపిల్లలు కావడం విశేషం. సమానం కాదా ? ఏటా బాలిబాలికల నిష్పత్తిలో వ్యత్యాసం పెరుగుతూనే ఉంది. రెండు జిల్లాల్లోని స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించినా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేక స్కానింగ్ సెంటర్లలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. అందుకు రెండు జిల్లాల్లో వెల్లడైన పలు కేసులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. బాలబాలికల నిష్పత్తిలో వ్యత్యాసాన్ని సరిదిద్దేందుకు, బాలికల పట్ల వివక్షను పోగేట్టుందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఫలితాలు ఇవ్వడం లేదు. స్కానింగ్ ఎవరు చేయాలి ? రేడియాలజీలో డిప్లొమాగానీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌గానీ చేసినవారు అల్ట్రాసౌండ్ స్కానింగ్‌కు అర్హులు. గర్భంలో శిశువు ఆరోగ్యం తెలుసుకోవడంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ కీలకం. స్వల్పకాలిక శిక్షణ పొందిన గైనకాలజిస్ట్లు, టెక్నీషియన్లు స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందం నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో మైలవరం, నందిగామ ప్రాంతాల్లో పలువురిపై కేసులు నమోదు చేశారు. ఉదాహరణలివీ ♦ పిడుగురాళ్లలో స్కానింగ్ సెం టర్ను రిజిస్టరు చేయించుకోకుండా స్కానింగ్‌లు చేయిస్తున్నట్లు గుర్తించి 2012లో కేసు నమోదు చేశారు. చట్టప్రకారం ప్రతి స్కానింగ్ సెంటర్ డీఎంహెచ్ఓ కార్యాలయంలో నమోదు చేయించుకోవాలి. ♦ రెండున్నరేళ్ల క్రితం గుంటూరు జిల్లా తాడికొండ గ్రామానికి చెందిన మహిళకు ముగ్గురు ఆడపిల్లలు కాగా, మగపిల్లల కోసం ఐవీఎఫ్ సెంటర్‌ను ఆశ్రయించింది. ఆమెకు గర్భం రాగా లింగ నిర్ధారణలో ఆడపిల్లని తేలింది. దీంతో కడుపులోనే చిదిమేశారు. కఠిన చర్యలు తప్పవు స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేయకూడదు. పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అని నిర్ధారించి చెప్పడం చట్టరీత్యా నేరం. నిబంధనలు అతిక్రమిస్తే ఆయా సెంటర్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గుంటూరు జిల్లాలో ఇప్పటికే రెండు స్కానింగ్ సెంటర్లపై కేసులు నమోదై కోర్టు విచారణలో ఉన్నాయి. నిత్యం స్కానింగ్ చేసిన వెంటనే ఆన్లైన్ ద్వారా డీఎంహెచ్‌వో కార్యాలయానికి నివేదిక అందించాల్సి ఉంది. – డాక్టర్ జె.యాస్మిన్, డీఎంహెచ్ఓ, గుంటూరు జిల్లా. -
చుట్టూ దేవుళ్లే!
‘‘వస్తావా!’’ ఇదీ ప్రేమించిన వాడి దగ్గర్నుంచి ఇప్పటి దాకా తను విన్న మగవాడి కూత. కానీ, తనకు ఆ వికృత పిలుపు గుర్తులేదు. ‘‘నేనున్నాను’’ అన్న దైవత్వమే గుర్తుకు ఉంది. ఆమె శరీరాన్ని పీక్కుతినే రాక్షసులను మరచి ఆత్మనెరిగిన వారిలో దైవత్వాన్ని చూసింది. పుట్టడం చావడం మధ్యలో బతుకు ఎంత భయంకరమైనదో వేశ్యావృత్తినే ఆసరాగా చేసుకొని బతుకులు ఈడుస్తున్నవారిని కలిస్తే ఇట్టే అర్థమైపోతుంది. వీరు తమకు తాముగా ఈ వృత్తిలోకి వచ్చినవారు కాదు. బతకడానికి మరో మార్గం తెలియక బలవంతంగా ఈ రొంపిలోకి దిగినవారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చి, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఇటీవలే ఈ వృత్తి నుంచి బయటపడిన కమల (పేరు మార్చాం) తన మనోభావాలను ఇలా పంచుకుంది. నేను కష్టంలో ఉంటే స్వీపరక్క వచ్చి ఆదుకుంది. ఆమెకూ నాకు ఎప్పటి రుణమో. ఎక్కడా పని దొరక్కపోతే కారు షెడ్డాయన దయతలచి ఇంత పని ఇచ్చాడు. ముందు దొంగనని అన్నా.. నాకు, నా బిడ్డకు ఇంత తిండి పెట్టాడు. చెడి ఇంటికి వెళితే మేనత్త నా బిడ్డను చూసుకుంటానంది. ఇలా నా చుట్టూ వాళ్లందరూ దేవుళ్లే! ఇంత కష్టమైన జీవితాన్నిచ్చిన దేవుడిని ఎన్నడూ తిట్టుకోలేదా? చేతులారా నేనే జేసుకున్న. తాళి కట్టకపోయినా నచ్చిన వాడే నా భర్త అనుకున్న. కానీ ఏం లాభం మొగుడు అనేవాడికి నేను సంపాదించే వస్తువునయ్యా. దేవుడిని తిడితే నా బతుకు మంచిగవు తుందా! ‘కడుపులో బిడ్డ పెరుగుతోంది. ఈ పని చేయలేనని మొండికేశాను. కొన్ని రోజులు కొట్టాడు. తర్వాత కొన్నాళ్లు జాడే లేడు. వాడు ఈ రోజు రాకుండా చూడు దేవుడా అని మొక్కుకునేదాన్ని. తినడానికి తిండి ఉండేది కాదు. ఆకలి సంపేది. నా బతుకు చూసి జాలి పడి రోడ్లు ఊడ్చే స్వీపరక్క దేవుడల్లే సాయం చేసింది. గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చి పురుడు పోయించింది. ఆ తర్వాత ఆ అక్క కనిపించలేదు. ఎక్కడుంటుందో తెలియదు. ఏదో పేటలో ఉంటానని చెప్పింది. ఓ రోజు రాత్రి ఇంటి బయట మా ఆయన పడిపోయి కనిపించాడు. ఇంట్లోకి తీసుకొచ్చి అన్నం పెట్టాను. మనిషి మనిషిలా లేడు. శవంలా తయారయ్యాడు. రోజూ దగ్గుతూ ఉండేవాడు. డాక్టర్ దగ్గరకు తీసుకుపోతే టీబీ అన్నాడు. మందులకు డబ్బుల్లేవు. దిక్కు తోచక రోడ్డు మీద నిలుచున్న... ఎవరు పిలిచి నాలుగు డబ్బులిస్తే వాళ్లతో పోయాను. బిడ్డకు పాలిచ్చి, ఆయనకు అప్పజెప్పి నేను పైసలు కోసం.. (చెబుతున్నంతసేపు కన్నీళ్లు చెంపల మీదకు పాకుతూనే ఉన్నాయి) బాగా పొద్దుపోయేక రోడ్డున పడేదాన్ని. ఓ రోజు ఇంటికొచ్చేసరికి బిడ్డ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తోంది. గభాల్న చంకకెత్తుకున్నా. పక్కన ఆయన్ని చూస్తే కదలకుండా పడున్నాడు. చూసినవాళ్లు ప్రాణం పోయిందన్నారు. అప్పుడు చేతిలో వంద రూపాయలున్నాయి. శవాన్ని తీయడానికి ఎవరూ ముందుకురాలేదు. ఎవరో మున్సిపాలిటీ వాళ్లకు చెబితే వాళ్లు వచ్చి శవాన్ని తీసుకెళ్లారు. అప్పుడే వచ్చిన ఆ ఇంటి ఓనర్ ఇంట్లో ఉండద్దని నా సామానంతా బయటేశాడు. ఏదైతే అదయిందని మా ఊరు బయల్దేరా. ఏ ఊరు మీది, ఇక్కడికి ఎలా వచ్చావు? మాది రాజమండ్రి దగ్గర ఓ పల్లెటూరు. అమ్మనాన్న తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. ఏడవ తరగతి వరకు ఊళ్లోనే బడికెళ్లాను. అమ్మానాన్న పొలం కాడికిపోతే చెల్లెలిని, తమ్ముడిని చూసుకోవడానికి ఇంటిదగ్గరే ఉండాల్సి వచ్చింది. అమ్మానాన్న నన్ను మా మేనబావకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ, దేవుడు నా నుదుటిన రాత మరోలా రాశాడు. మా ఊళ్లో ఒకరింటికి చుట్టపు చూపుగా ఒకతను వచ్చాడు. అతను పట్నంలో పనిచేస్తాడు. నన్ను ఇష్టపడ్డానన్నాడు. నాకూ అతను బాగా నచ్చాడు. ఇంట్లోవాళ్లు వద్దన్నారు. గొడవలయ్యాయి. మా మేనత్తతో ‘పిల్లల పెళ్ళి వెంటనే చేసేద్దాం’ అన్నాడు మా నాన్న. మా మేనత్త సరేనంది. నాకు భయమేసి ఇష్టపడ్డాయనతో చెప్పాను. ఇద్దరం కలిసి ఓ రోజు ఎవరికీ చెప్పకుండా పట్నం వచ్చేశాం. అసలు ఈ వృత్తిలోకి ఎలా వచ్చావు? అతను నిన్ను బాగా చూసుకోలేదా? ఏం చెప్పమంటారు? (కన్నీళ్లు తుడుచుకుంటూ) అంతకుముందు మా ఆయన, అతని ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఉండేవారంట. రేకులేసిన చిన్న గది అది. చీకటి చీకటిగా ఉండేది. ఆ పక్కనే మురుగు కాల్వ కంపు. అయినా ఉన్నంతలో సర్దుకొని గుట్టుగా ఉండేదాన్ని. రెండో రోజు డబ్బులడిగితే వెంట తెచ్చుకున్నవి ఇచ్చేశాను. ఇంకోరోజు ఖర్చులకు డబ్బుల్లేవంటే చెవిదిద్దులు తీసిచ్చాను. నాలుగో రోజు బాగా తాగి తూలుకుంటూ ఇంటికి వచ్చాడు. భయమేసింది. ఆ రాత్రి గోడకు నక్కి పడుకున్నాను. అది రోజూ పనే అని వరుసగా తాగొస్తుంటే తెలిసింది. నాలుగునెలలు కనాకష్టంగా గడిచాయి. కూర్చొని తింటే ఎక్కడినుంచి తెచ్చిపెట్టేదే నీకు అని రోజూ తిట్టేవాడు. కారు షెడ్డులో పనికి పెట్టాడు. రోజూ పొద్దున, సాయంత్రం ఆ షెడ్డు ఊడ్చి, నల్లా నుంచి నీళ్లు తెచ్చి డ్రమ్ములు నింపేదాన్ని. జ్వరం వచ్చి రెండు రోజులు పనికి పోలేదు. మూడోరోజు తాగి వచ్చిండు. పనికి పోలేదని కొట్టాడు. అరుపులు విని చుట్టుపక్కల వాళ్లు వచ్చి ‘ఆ పిల్లను చంపేస్తావా ఏంటి’ అని గదమాయిస్తే వాళ్ల మీదకు కొట్టాటకు పోయాడు. తర్వాత నేను నెల తప్పానని తెలిసింది. ఈ భూమికి నేనే బరువు అనుకుంటే ఇంకో బరువా అనుకున్నాను. కారు షెడ్డు ఓనర్ వచ్చి ఓ రోజు గొడవ గొడవ చేశాడు. షెడ్డులో డబ్బులు పోయాయని, అవి నేనే తీసానని అన్నాడు. నెత్తీ నోరు బాదుకొని చెప్పా నాకేం తెలియదని. అయినా మా ఆయన నా మాట వినలేదు చచ్చేట్టు కొట్టాడు. ఊరికి పోదామనుకుంటే ఏ మొఖం పెట్టుకొని అమ్మానాన్నల దగ్గరకు పోవాలి. చావో బతుకో ఇక్కడే చావాలని మొండిగ ఉన్నాను. ఆ రోజు రాత్రి మా ఇంటి ఓనర్ని తీసుకొచ్చాడు మా ఆయన. ఇద్దరూ కలిసి బాగా తాగారు. ఆ తర్వాత మా ఆయన బయటకు వెళ్లిపోయాడు. ఆ రాత్రి ఆ ఓనర్ కాళ్లావేళ్లా పడ్డాను. వినలేదు. మా ఆయనకు నాలుగొందలు అప్పు ఇచ్చాడంట. అవి తీర్చేదాక నేను చెప్పినట్టు వినాలంట. ఆ తర్వాత రోజు ఇంకెవడినో తీసుకొచ్చాడు.. ఇదంతా నుదుటి రాత అంటున్నావు. ఆ రాత రాసిన దేవుడు గురించి నీకేం తెలుసు... నా చిన్నప్పుడు ఇంట్లో పండగలప్పుడు, జాతరలప్పుడు గుడికి పోయేవాళ్లం. ఆ రోజు అమ్మ పాయసం వండి తీసుకెళ్లేది. దేవుడికి దణ్ణం పెట్టుకో మంచి బతుకొస్తది అని అమ్మ చెప్పేది. నాకేదో కావాలని ఎప్పుడూ మొక్కుకోలేదు. మా ఇంట్లో అందరూ బాగుండాలి అనుకునేదాన్ని. కానీ, నా బతుకు ఇలాగయ్యింది. ఊరికి వెళ్లిన దానివి అక్కడే ఉండి ఏదో పని చేసుకోక.. మళ్ళీ ఇక్కడకు ఎందుకు వచ్చావు? నేను వెళ్లిపోయాక మా నాన్న విషం తాగి చచ్చిపోయాడట. మా అమ్మ శాపనార్థాలు పెట్టింది. ఇంట్లో అడుగుపెడితే తనూ ఛస్తానంది. మా చెల్లెల్న్లి మా మేనత్త తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చే సుకుంది. మా చెల్లెలి దగ్గరకు Ðð ళ్లి చేతులు పట్టుకున్న. పట్నంలో హోటల్లో పనిచేస్తున్న, పని చేసుకుంటూ బిడ్డను చూసుకోవడం కష్టమైతుంది. నా బిడ్డను చూసుకో నెల నెల పైసలు పంపిస్త. దానికింత తిండి పెట్టి, చదువు చెప్పించు అన్నాను. అబద్ధమే చెప్పాను కానీ తప్పలేదు. మా మేనత్త మొదట ఒప్పుకోలేదు. కాళ్లు పట్టుకుంటే దయదలచి పైసలు పంపిస్తే చూస్తాం అంది. సరే అని బిడ్డను వాళ్లకు అప్పజెప్పి ఈడికి వచ్చిన. నిద్రపోతున్న బిడ్డను వాళ్ల దగ్గర వదిలేసి పట్నం బస్సెక్కాను. ఏడాదికొకసారి వెళ్లి చూసొస్తాను. ఇప్పుడు నా బిడ్డకు పదేళ్లు వచ్చాయి. వచ్చేటప్పుడు నన్ను కదల్నీయదు. నాతోపాటు వస్తానంటది. తీసుకురాగలనా?! మరి మీ ఇంట్లో వాళ్లకు చెప్పినట్టు హోటల్లో పనిచేసేవా? మళ్ళీ ఈ వృత్తిలోకి వచ్చావు.. పట్నం వచ్చాక ‘ఈ పని’ మానేసి గౌరవంగా బతకాలని పనికోసం ఓ హోటల్‌వాళ్లని వెళ్లి అడిగాను. పని ఇచ్చారు. హోటల్ ఊడ్చి, తుడిచి, గిన్నెలు కడిగితే తిండి పెట్టి నెలకు రూ.1500 ఇచ్చేవారు. బానే ఉందనిపించింది. ఎక్కడా ఉండటానికి చోటు లేదని ఆ హోటల్ వంటగదిలోనే ముడుచుకుపడుకునేదాన్ని. ఓ రోజు ఆ హోటల్ ఓనర్ నా మీద అఘాయిత్యం చేశాడు. అదేమంటే బూతులు తిట్టాడు. అక్కడ ఉండలేకపోయాను. పాత రోజుల్లోకే వెళ్లిపోయా. చచ్చిపోదామని ఎన్నోసార్లు అనుకున్నా. కానీ, ఊళ్లో నా బిడ్డ గుర్తొచ్చేది. ఇప్పుడు చెప్పు.. ఇంత జరిగినా ఇప్పటికీ దేవుడున్నాడని నమ్ముతున్నావా? ఒకడిని నమ్మి మోసపోయాను. అది నా తప్పు. నేను కష్టంలో ఉంటే స్వీపరక్క వచ్చిఆదుకుంది. ఆమెకూ నాకు ఎప్పటి రుణమో. ఎక్కడా పని దొరక్కపోతే కారు షెడ్డాయన దయతలచి ఇంత పని ఇచ్చాడు. ముందు దొంగనని అన్నాను. నాకు నా బిడ్డకు ఇంత తిండి పెట్టాడు. చెడి ఇంటికి వెళితే మేనత్త నా బిడ్డను చూసుకుంటానంది. ఈ పని చేస్తే నా ఆరోగ్యం పాడైతుందని ఇదిగో ఈ మేడమ్ (రాంకీ ఫౌండేషన్ వాలెంటీర్ను చూపిస్తూ) వాళ్లు ఇక్కడకు తీసుకొచ్చి నాకెన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. ఒంట్లో బాగోలేకపోతే మందులు ఇస్తారు. నాకేదైన పని ఇప్పించమని వీళ్లకు చెప్పాను. వీళ్లూ సరే అన్నారు. మిషన్ పని నేర్చుకుంటున్న. ఈ మేడమ్ వాళ్లకు తెలిసినవారి షాప్‌లో వారం రోజులుగా పనికి కూడా పోతున్నాను. నన్ను ఆదుకున్న అందరూ నాకు దేవుళ్లే. ఆ దేవుడు నా బిడ్డనైనా చల్లగా చూడాలి. దానికది బతగ్గలదు అనేంతవరకు నన్ను బతికించమని దేవుడికి రోజూ దణ్ణం పెట్టుకుంటున్నాను. – నిర్మలా రెడ్డి -
దుర్ముహూర్తం
పెద్దలంతా కలిసి ముహూర్తం పెట్టారు. శుభముహూర్తం అని భర్త తరుఫు వాళ్లు అన్నారు. ఇటు పక్కవాళ్లు నోరు మూసుకున్నారు. ఎవరికి ఎవరూ ఈ పాపంలో తక్కువ కాదు. ఇవ్వడమే రెండవ పెళ్లి వాడికిచ్చి చేశారు. చేసినప్పటి నుంచి ‘ఇంకెన్నాళ్లు ఆగాలి... ఇంకెన్నాళ్లు ఆగాలి’ అని అతగాడి గోల. ముప్పై ఏళ్లుంటాయి. ఆ మాత్రం గోల చేయడం సహజమే. కాని పిల్ల సంగతో? పదకొండేళ్లేనాయే. ఇంకా పెద్దమనిషైనా కాకపాయే. ‘రేపో మాపో అవుతుందని అబద్ధం చెప్పారు. ఇలాగైతే మేం ఇంకో అమ్మాయిని చూసుకుంటాం’ అని కబురు పెట్టాడు అతడు. అంటే మూడో పెళ్లన్నమాట. అమ్మో అదే జరిగితే ఇంకేమైనా ఉందా? వెంటనే ఈవైపు వారు ఉత్తరం రాశారు– అమ్మాయి పెద్దదయ్యింది అని. అంటే ఏమిటో అమ్మాయికి తెలియదు. వెంటనే ముహూర్తం పెట్టుకోండి అని రాశారు. దేనికి పెడతారో తెలియదు. ఆడుకునే వయసు. ఇంట్లో ఉన్న గన్నెరు మొక్కా, దానిమ్మ చెట్టు దోస్తులు. ఊర్లోని పసిపాపలు నేస్తులు. ఆ వీచేగాలి ఆత్మీయురాలు. ఈ చిన్న మబ్బుతునక దగ్గరి చుట్టం. మధ్యాహ్నం పిలిచి గదిలో ఉన్న మీ ఆయనకు కాఫీ ఇచ్చిరా అని పంపారు. గదిలోకి వెళ్లింది. తిరిగి వచ్చింది. వెళ్లే ముందు అమ్మాయి తిరిగి వచ్చిన అమ్మాయి ఒకటి కాదు. ఆ అమ్మాయి చచ్చిపోయింది. శుభ్రమైన అమ్మాయి, ఎప్పుడూ శుభ్రంగా స్నానం చేసి రెండు జడలు వేసుకొని పొడి బట్టలు వేసుకుని ఉండే అమ్మాయి, ఊళ్లో ఏ పిల్లాడైనా మురికిగా ఉంటే నూతి దగ్గరకు తీసుకెళ్లి స్నానం చేయించి ఒళ్లు తుడిచి ఎత్తుకుని ముద్దు చేసే అమ్మాయి, స్కూలు మాస్టరు చనువుగా జబ్బ మీద చేయి వేస్తే... ఛీ నన్ను తాకకు చీదర అని చేయి కొరికి పరిగెత్తిన అమ్మాయి, అప్పుడప్పుడు ఇంటికొచ్చే బంధువు ఎవరూ లేనప్పుడు ఎద మీద చేయి వేస్తే రోషంతో పౌరుషంతో ముఖమంతా ఎర్రగా చేసుకొని వాడి అంతు చూడవలసిందిగా అమ్మకు మొర పెట్టుకున్న అమ్మాయి, అతి పావనమైన అమ్మాయి, పాల వంటి అమ్మాయి చచ్చిపోయింది. వాడు ఒక మాట మాట్లాడలేదు. వాడు ఒక ఊరడింపు చేయలేదు. వాడు ఏం జరగబోతుందో చెప్పలేదు. వాడు ఏం చేయబోతున్నాడో చెప్పలేదు. హటాత్తుగా గది చీకటి చేసి కంబళి ముఖాన కప్పి తోడు ముక్కూ నోరూ కూడా మూసేస్తే ఎలా ఉంటుందో అలా మీద పడ్డాడు. పులి దయాళువు. లిప్తలో చంపుతుంది. వీడు మగవాడు... మధ్యాహ్నం అంతా తింటూనే ఉన్నాడు. రాత్రి కూడా తింటానన్నాడు. అలా ఒకరోజు కాదట. రోజూనట. ఇంటికి తీసుకెళతాడట. ‘వెళ్లాలమ్మా’ అంది అమ్మ. ‘వెళ్లకపోతే నాలుగు తగిలిస్తా’ అన్నాడు తాతయ్య. ‘వెళ్లవే ముండా’ అని తిట్టింది ఇల్లు పట్టిన మేనత్త. అయ్యో. ఎందుకిలా. ఎందుకు? ఈ శరీరం నాది కాదా... దీని మీద నాకు హక్కు లేదా? క్షవరం చేస్తూ మంగలి నొప్పి పుట్టించాడని తన్నబోయావే తాతయ్యా... ఈ నొప్పి నీకు తెలియదా. దీనికి నీకు పట్టింపు లేదా. ఈ నొప్పి నేను పడవలసిందేనా. నొప్పి... చచ్చిపోతాను బాబోయ్ నొప్పి. ‘మొదటిది నయం. సన్నగా, బలహీనంగా ఉన్నా ఒప్పుకునేది. నీలా పెంకితనం పోయేది కాదు’ అన్నాడు భర్త. తాను కూడా అలా సన్నగా బలహీనంగా అయ్యి చచ్చిపోతుందా? ఊరంతా అతణ్ణి మంచివాడంటుంది. ఇంటికొచ్చినవాళ్లు మంచివాడంటూ దీవించి వెళుతుంటారు. ఊరికి మంచిగా కనిపించే భర్త గదిలో భార్యకు కూడా మంచిగా కనిపించాలి. అప్పుడే వాడు మంచివాడు. ఈ సంగతి ఎవరు చెప్పాలి... ఎవరు? ‘పారిపో తల్లీ... ఈ ఇంట్లో ఉంటే బతకవు’ అన్నాడు చాకలి. పారిపోయింది. వదలుతారా? వెతికి వెతికి పట్టారు. పోలీసులు వచ్చి తీసుకెళ్లి మొగునికి అప్పజెప్పారు. ‘నాకీ పెళ్లీ వద్దు ఏమీ వద్దు... భోగం బతుకు బతుకుతాను’ అని మొండికేసింది. ఊళ్లో వాళ్లందరూ ఇది విని అసహ్యించుకున్నారు. సంసారి అనవలసిన మాటలేనా ఇవి? దౌర్భాగ్యుల్లారా... వాడు చేస్తున్నది సంసారమేనా అని అడగరేం. అప్పటికీ పతనమైంది. అతణ్ణి మంచి చేసుకుందామని అతని కోసం పాడుపనులన్నీ చేసింది. చేసే కొద్దీ మలినపడుతున్న భావన. మరీ మరీ పతనమవుతున్న వేదన. ఎంత వయసని? పద్నాలుగేళ్లు. ఈలోపే ఒక జీవితానికి సరిపడా రాపిడి చూసింది. దేహాన్ని జన్మకు సరిపడా వొరిపిడి పెట్టింది. మనసు శిథిలమయ్యింది. ఆత్మ నాశము కోరుతోంది. అదిగో గోదారి తల్లి. ఈ రాత్రి చల్లగా మెల్లగా దయగా ప్రవహిస్తున్న తల్లి. ఈ తల్లి తనను కడిగేయాలి. ఈ మలినపడ్డ దేహాన్ని కడిగేయాలి. భయం వేయట్లేదు దానిని చూస్తుంటే. ముంచేస్తుందా? ఊపిరాడకుండా చేసేస్తుందా? లేదు లేదు... దగ్గరకు తీసుకుని తనతో పాటు ఏడుస్తుంది కాబోలు. కన్నీరు కారుస్తుంది కాబోలు. వస్తున్నా తల్లీ. ఆగు. కథ ముగిసింది. చలం రాసిన ‘భార్య’ కథ ఇది. చిత్తూరు జిల్లాలో గది నుంచి బయటికొచ్చి నేను లోపలికి వెళ్లను అన్న వధువును బలవంతంగా లోపలికి పంపితే ఏమయ్యిందో ఆ భర్త ఉంగరాల వేళ్లతో ఆమెను ఎలా హింసించాడో వార్తల్లో చూశాం. ఎన్నేళ్లకు పెళ్లి చేయాలి... పెళ్లికి ముందు ఎలాంటి అవగాహన కలిగించాలి... మొదటి రాత్రికి అమ్మాయి, అబ్బాయిని ఎలా సిద్ధం చేయాలి, అబ్బాయి ప్రవర్తన ఎలా ఉండాలి... అమ్మాయికి ధైర్యం ఎలా ఇవ్వాలి... ఇవన్నీ ఆలోచించే చైతన్యం మనలో ఉందా? వాటికవే అయిపోతాయని అయిపోవాలని మన భావన. ప్రతాపం చూపాలనుకునే మగవాళ్లు ఇచ్చే పీడకలలు జీవితాంతం మిగులుస్తున్న మానసిక వ్యాధుల గురించి ఆలోచిస్తున్నామా. చలం ఈ విషయం మీద 1924లోనే మొత్తుకున్నాడు. స్త్రీ దేహం మీద హక్కు స్త్రీదే అని అంగీకరించి మానసికంగా శారీరకంగా ఆమె సిద్ధమైనప్పుడు పెట్టేదే శుభ ముహూర్తం. అది వినా తక్కినవన్నీ దుర్ముహూర్తాలే. -
ఉ'త్తరం' మారాలి
తరం మారి తరం వచ్చింది. తరం మారి తరం వస్తుంది కూడా. అప్పుడు కూడా.. ఇలాంటి ఉత్తరమే వస్తుంది. సరస్వతీదేవి, లక్ష్మీదేవి కటాక్షించిన ఒక అమ్మాయికి కల్యాణమే బలిదేవత కాబోయింది!ఏ మారుమూల గ్రామంలోనో కాదు.. వైజాగ్‌లో. ఎంత చదువుకున్నా ఏం లాభం? ఎంత గొప్ప ఉద్యోగం సంపాదించుకున్నా ఏం లాభం? ఇష్టం లేని పెళ్లిచూపులు.. కెరటాల్లా వచ్చి తాకుతుంటే!! డియర్ ఫ్రెండ్! ఒక అత్యవసర సందర్భంలో నీకీ లేఖ రాయాల్సి వస్తోంది. నన్నీ అంధకారంలోంచి బయటపడేసేది నీవు చేయబోయే ఈ చిన్ని సాయమే. లేదంటే నా కథకీ ఉత్తరమే ముగింపు కావొచ్చు. ఎందుకో చెపుతాను! చిన్నప్పటినుంచి అంతా నా ప్రతిభకు అచ్చెరువొందుతోంటే చాలా ఆనందించేదాన్ని. క్లాసులో ఫస్టొచ్చిన ప్రతిసారీ బళ్లో నాకొచ్చిన ప్రశంసల జల్లులని మదిలో ఒంపుకుని అంతులేని ఆనందాలను మూటకట్టుకొని ఇంటికి మోసుకొచ్చేదాన్ని. కానీ ఇంటి గడపకివతలే ఆ ఆనందాన్ని విడిచిపెట్టాలి. లేదంటే ఆ రోజుకిక అమ్మకీ నాకూ ప్రశాంతంగా రాత్రి గడవదు. ఇరుగు పొరుగుకి తెలియకుండా గుంభనంగా గడిపిన ఎన్నో నిద్రలేని రాత్రులింకా నా జ్ఞాపకాల కంటిపాపల్లోనే దాగున్నాయి. నా ఆకాంక్షలనీ, నేనధిరోహించాలనుకున్న ఎన్నెన్నో విజయపుటాశయాల ఆశలకెరటాలనూ మూతలు పడని ఆ కళ్లే మోస్తున్నాయింకా. నిజానికి టెన్త్‌తోనే నా చదువు ఆపేయాలన్న నాన్న ఆదేశాన్ని అమ్మ ధిక్కరించలేకపోయినా, ‘‘కనీసం డిగ్రీ అయినా లేకపోతే ఎవరు పెళ్లి చేసుకుంటారు?’’ అన్న మాటలకు లొంగి నాన్న నన్ను కనాకష్టంగా ఇంజనీరింగ్‌లో జాయిన్ చేశారు. నా ఫ్రెండ్స్ ఎందరికో బ్యాక్‌లాగ్స్ ఉండిపోతే, నేను మాత్రం థర్డ్ ఇయర్లో 86 పర్సంట్‌తో క్లాస్‌లో ఫస్ట్ ఉన్నాను. ఇంజనీరింగ్ కంప్లీట్ కాకుండానే హైదరాబాద్‌లో క్యాంపస్ సెలక్షన్స్‌లో ఓ మంచి కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించినా నాన్న ఒప్పుకోరేమోనన్న దిగులు.. నన్ను చాలా రోజులు అమ్మతో కూడా ఈ సంతోషాన్ని పంచుకోకుండా నివారించింది. చివరకు చాలా పెద్ద రాద్ధాంతం తరువాత నేను ఈ ఉద్యోగంలో చేరాను. ఆరు నెలలు కూడా కాలేదు నేనీ ఉద్యోగంలో చేరి. చేరినప్పటినుంచి నాన్న పెళ్లి చూపులకోసం పదే పదే వైజాగ్ రప్పిస్తున్నారు. ఆయన చెప్పిన అన్నింటికీ తలొగ్గి పెళ్లి చూపులకు ఒప్పుకున్నా, వృత్తిని కొనసాగిస్తూ, అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న నా ఆకాంక్షను ప్రతి పెళ్లికొడుక్కీ చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ ఏ పెళ్లికొడుక్కీ అతనికన్నా ఎక్కువ స్థాయిలో ఉండడం ఇష్టం ఉంటేనా? అందుకే ఇప్పటికి నలుగురైదుగురు పెళ్లికొడుకులు నా అందాన్ని సైతం కాదనుకుని వెనక్కెళ్లిపోయారు. చివరకు లక్షల కట్నం మానాన్న ఆశపెట్టినా నా ఉద్యోగం వాళ్లకు అడ్డంకిగా మారింది. ‘‘ఆడపిల్లలకు పెళ్లయ్యాక ఉద్యోగం ఎందుకన్నారొకరు. మీ నాన్న ప్రభుత్వోద్యోగిగా బాగానే సంపాదించారు. నీకెందుకీ శ్రమ అన్నారింకొందరు. అసలు ఉద్యోగం చేయాల్సిన ఖర్మ నీకెందుకు, మా అబ్బాయే అమెరికాలో లక్షలు సంపాదిస్తోంటే , ఏదో అందమైన అమ్మాయివనీ, మంచి ఇంగ్లీషు మాట్లాడతావనీ మా చుట్టాలు చెపితే నిన్ను చూశాం కానీ ఇలా ఏదో ఎదిగిపోవాలని ఉద్యోగాలు చేసే ఆలో^è న ఉన్నట్టు మాకు తెలియదు’’ అన్నారింకొకరు. అప్పుడు నా ఉద్యోగం మాన్పించాలన్న మానాన్న పోరు పరాకాష్టకి చేరింది. అయినా ఇన్నాళ్లూ నెట్టుకొచ్చాను. ఇప్పుడిప్పుడే నా డిపార్ట్మెంట్లో నాకు కొత్త బాధ్యతలప్పగించారు కదా? యిప్పుడప్పుడే ఊరికి రావడం కుదరదని నాన్నకి ఫోన్లో చెప్పాను. అంతే! నిన్న నాన్నే స్వయంగా దిగిపోయారు హైదరాబాద్‌లో. ఇప్పుడు నన్ను వెంటబెట్టుకెళుతున్నారు. అక్కడేం జరుగుతుందో తెలియదు. శని ఆదివారాలు కలుపుకుని మొత్తం నాలుగు రోజులు సెలవు పెట్టాను. మా బాస్‌కి సూచనప్రాయంగా చెప్పాను. ఏదో పెళ్లి గోలని. ఆయనప్పుడే అన్నారు. అందుకే పెళ్లిళ్లు కాని అమ్మాయిలకు ఉద్యోగాలివ్వడం చాలా పెద్ద తప్పని. లీవ్ లెటర్ ఇవ్వడానికెళితే హెచ్ఆర్లో ప్రవీణ్ కూడా అననే అన్నాడు ఎందుకు మేడం మీరు హాయిగా పెళ్లి చేసుకుంటే మీ స్థానంలో ఎవరైనా మగాళ్లకి అవకాశమిచ్చినట్టుంటుంది కదాని! అసలు అందరికీ నా ఉద్యోగంపైనే ఎందుకీ ఆక్షేపణ! బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. నేనీ మాటలు మానాన్న ముందు అంటే నిజంగానే మా నాన్న ఆ పని చేసేస్తారు కూడా. నన్నింటికి తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలియదు. పెళ్లికయితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఆ తరువాతేం జరుగుతుందో చూద్దాం. నాకు మీరు చేయాల్సిన సాయం ఒక్కటే.. నా నాలుగు రోజుల లీవ్ అయిపోయినా నేను రాకపోతే పోలీసులకు కానీ, మీడియాకి కానీ నా నంబర్, అడ్రస్ ఇవ్వండి. - ఇట్లు మీ స్నేహితురాలు ఐదు రోజులు ఎదురుచూసి, ఆరవ రోజు మీడియాకిద్దామనుకున్న లేఖని రెండోసారి చదివాడు వాసు. ఆ అమ్మాయి వాళ్లింట్లో జరగబోయే విపత్తుని ముందుగానే ఊహించి రాసిన ఉత్తరం నేరుగా ‘చేతన’ మహిళా సంఘం నాయకురాలు పద్మ చేతిలో పడింది. అంతే! మరో గంటలో మీడియాతో సహా పద్మ, మరికొందరు మహిళా సంఘాల వాళ్లు ఆ అమ్మాయి యింటికెళ్లి చూసి అక్కడ జరుగుతున్న దారుణానికి అవాక్కయ్యారు. ఓ జంతువుని కట్టేసినట్టు గొలుసులతో చేతులను కట్టేసి, ఇంటి వెనుకనున్న స్టోర్ రూంలో దాచేసిన ఆ అమ్మాయిని విడిపించిన ఘటన వైజాగ్‌లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆమె స్వతంత్రంగా బతుకుతోంది. అమ్మాయిలకు అంతిమ లక్ష్యం పెళ్లి కాదని నిరూపిస్తూ, పెళ్లి చేసుకోకుండా స్వతంత్రంగా జీవిస్తోంది. స్వతంత్రంగా నా కాళ్లపై నేను నిలబడి నలుగురికీ ఆదర్శంగా ఉండాలన్నదే నా లక్ష్యం. పెళ్లి, పిల్లలూ.. ఇవన్నీ నాకిప్పుడు సెకండరీ అంటోందా అమ్మాయి. – అత్తలూరి అరుణ చదువు, ఉద్యోగం, వివాహం.. అన్నింటా వివక్షే అవును. లేఖలో ఆమె ఊహించిందే జరిగింది. ఆడపిల్లలకు అంతిమ లక్ష్యం పెళ్లి అన్నది ఈ సమాజం భావన. ఉద్యోగం కూడా రాబోయే వాడి కోసమే తప్ప తనకోసం కాదు. చదువుకుంటే ఒక సమస్య. చదువు లేకపోతే మరో సమస్య. ఒకరికి చదువుకున్న అమ్మాయి కావాలి. ఒకరికి పెద్దగా చదువుకోని అమ్మాయే కావాలి. ఇలా ఏదీ ఆ అమ్మాయికోసం కాదు. అన్నీ తన జీవితాన్ని శాసించే ఓ పురుషుడి కోసం. అతడి కోసం ఆమెను పోతపోసిన బొమ్మలా తయారు చేస్తారు. ఇది దుర్మార్గం. దీన్ని ప్రతిఘటించే చైతన్యం ఇప్పుడిప్పుడే వస్తోంది. ఈ కేసే అందుకు ఉదాహరణ. ఆ లేఖ రాసిన అమ్మాయి యిప్పుడు స్వతంత్రంగా బతుకుతోంది. తనకు నచ్చిన ఉద్యోగం చేస్తోంది. ఆడపిల్లల పుట్టుకను, చదువును, ఉద్యోగాన్నీ.. అన్నింటినీ ఆమె నుంచి దూరం చేయాలనే ఆలోచన. ఆస్తి కూడా ఆడపిల్లల పేరున ఉండకూడదనే ఎన్నో కేసులు నేను చూశాను. స్త్రీల పట్ల ఈ భావజాలం ఇప్పటిది కాదు. ఇది తరతరాలుగా కొనసాగుతూ వస్తోన్న మనువాద పురుషాధిపత్య భావజాలం. ఎన్నో అననుకూల పరిస్థితుల నుంచి ఆమె ఎదిగివచ్చినా చివరకు పెళ్లి అనే ఒక పరిధిలో కుదించేస్తారు. అక్కడితో ఆమె ఆలోచనలూ, ఆకాంక్షలూ చెరిగిపోతాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఎక్కడెక్కడైతే ఆమె ఎదుగుదలను నియంత్రించే పరిస్థితులున్నాయో అక్కడే ఆమె స్థిరంగా నిలబడే పరిస్థితి రావాలి. సమాజం నుంచి ఎదురౌతోన్న వివక్షనీ, అణచివేతనీ ఇక సహించబోమంటోంది నేటితరం స్త్రీ. అన్ని అవరోధాలను, అడ్డంకులను దాటుకొని తమకు తాముగా ఎదిగివస్తోన్న యువతులే ఈ అసమానతలను ఛేదించగలరు. – కత్తి పద్మ, ప్రధాన కార్యదర్శి, ‘చేతన’ మహిళా సంఘం, వైజాగ్ -
విద్యతోనే వివక్ష దూరం
‘‘ఆడపిల్లలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. అంతరిక్షంలోనూ అడుగుపెట్టారు. అయినా ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ వివక్షకు పుల్‌స్టాప్ పడాలంటే బాగా చదువుకోవాలి. సొంత కాళ్లపై నిలబడాలి. అప్పుడే వివక్ష దూరమవుతుంది’’ అని కామారెడ్డి ఎస్పీ శ్వేత అన్నారు. అపజయాలకు కుంగిపోవద్దని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయాలు వాటంతట అవే వచ్చి ఒడిని చేరతాయని పేర్కొన్నారు. తల్లిదండ్రుల దృక్పథంలోనూ మార్పు రావాలన్నారు. స్త్రీలపై వివక్ష, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సాధికారతపై ఆమె అభిప్రాయాలు.. సాక్షి, కామారెడ్డి: ‘సమాజంలో మార్పు వచ్చింది. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. కానీ తరతరాలుగా కొనసాగుతున్న చిన్నచూపు ఇంకా ఉంది. చాలా మంది ఆడపిల్లను భారంగానే భావిస్తున్నారు. ఆడపిల్లలు చదువుకోవడం వల్ల వివక్ష కొంత తగ్గింది’’ అని ఎస్పీ శ్వేత పేర్కొన్నారు. బాగా చదువుకుంటే వివక్షకు దూరం కావచ్చన్నారు. వివిధ అంశాలపై ఆమె అభిప్రాయం. వివక్షకు కారణాలు, అధిగమించే మార్గాలు.. సమాజంలో తరతరాలుగా ఆడపిల్లలపై వివక్ష అనేది కొనసాగుతూ వచ్చింది. మగవారికంటే తక్కువ, బలహీనులు అన్న భావన ఉంది. కానీ కాలం మారుతోంది. ఆధునిక కాలంలో మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. కష్టసాధ్యమైన లక్ష్యాలనూ చేరకుంటున్నారు. అంతరిక్షంలోనూ అడుగిడి వచ్చారు. విజయాలు సాధిస్తుండడంతో వివక్ష కొంత తగ్గింది. అయితే వివక్ష పూర్తిగా తొలగాలంటే అందరూ బాగా చదవాలి. ఉన్నత విద్యనభ్యసించాలి. ఉద్యోగాలు చేయాలి. సొంత కాళ్లపై నిలబడగలిగినప్పుడు వివక్ష అనేది అటోమెటిక్‌గా తగ్గిపోతుంది. లక్ష్యంతో సాగితే.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రంగంపై ఆసక్తి ఉంటుంది. అయితే ఆయా రంగాల్లో రాణించాలన్న తపన ఉండాలి. అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. లక్ష్య సాధన కోసం శ్రమించాలి. అపజయాలకు కుంగిపోవద్దు. విజయం సాధించాలన్న లక్ష్యంతో సాగాలి. ముందుగా మనపై మనకు నమ్మకం ఉండాలి. నేను సాధించగలను అన్న విశ్వాసం ఏర్పర్చుకోవాలి. లక్ష్య సాధనలో ఓటమి ఎదురైనా.. మరింత పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. మహిళా సాధికారత సాధించాలంటే.. చదువే అన్ని సమస్యలకూ పరిష్కారం. ఆ దిశగా ముందుకు సాగాలి. అప్పుడే మహిళా సాధికార త అనేది సాధ్యమవుతుంది. మహిళలు నేడు సాధిస్తున్న విజయాలను చూసి ఒకరినొకరు స్ఫూర్తిని పొందాలి. నేను కూడా సాధిస్తానన్న ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. నమ్మకాన్ని పెంచుకోవాలి. ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలి. చదువు ఉంటే ఏ వివక్షా ఉండదు. చదువే అన్నింటికీ పరిష్కారం. ఆడపిల్లలు బాగా చదవాలి. నేనిచ్చే సందేశం ఇదే. ఆడపిల్లను భారంగా భావించొద్దు ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో వివాహం జరిపించడం వల్ల వారు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు తమ బాధ్యతను తీర్చుకుంటున్నామంటూ అమ్మాయి మనసును అర్థం చేసుకోకుండానే వివాహం చేయడం మూలంగా ఆమె చాలా ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా శారీరకంగా చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. చిన్న వయసులోనే పిల్లలను కనడం వల్ల మరింత బలహీనంగా తయారై మానసికంగానూ ఇబ్బంది పడుతున్నారు. తద్వారా కుటుంబంలో రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆడపిల్లలు వారి సొంతకాళ్లపై నిలబడి, శారీరకంగా, మానసికంగా ఎదిగిన తర్వాతే వివాహం జరిపించాలి. చదువు చెప్పించాలి చాల కుటుంబాల్లో ఇప్పటికీ ఆడపిల్లకు చదువు ఎందుకనే భావన ఉంది. ఈ విషయంలో తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. ఆడ, మగ అన్న తేడా చూపకుండా ఒకే రకమైన చదువు అందేలా చూడాలి. పెళ్లి బరువు అనే భావనను వీడాలి. ఆడపిల్ల బాగా చదువుకోవడానికి తగిన ప్రోత్సాహం అందించాలి. వారికి అండగా ఉన్నామన్న ధీమా ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్, డిగ్రీతోనే చదువుకు పుల్‌స్టాప్ పెట్టేస్తున్నారు. ఆ తర్వాత వివాహం జరిపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. మా వద్దకు వచ్చే కేసుల్లో చాలా వరకు చిన్న వయసులో పెళ్లిళ్లు అయిన వారే ఎక్కువగా ఉంటున్నారు. తల్లిదండ్రులు అమ్మాయి పెళ్లికి ఇచ్చే ప్రాధాన్యతకన్నా చదువుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తే బాగుంటుంది. తద్వారా వివక్ష రూపుమాపవచ్చు. -
తల్లిదండ్రుల్లో మార్పు రావాలి
సాక్షి, యాదాద్రి : ‘‘ఆడపిల్లల పెంపకంపై ముందుగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను చూడాలి. ప్రతిచోటా ఎదురవుతున్న వివక్షను రూపు మాపడానికి ఇదొక మార్గం. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిసున్నా కొన్ని చోట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. దీన్ని రూపుమాపాల్సిన అవసరం కుటుంబం, సమాజం, పాలకులపై ఉంది’’అని అంటున్నారు ప్రభుత్వ విప్, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత. మహిళా సాధికారితపై ‘ఆమె’సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే.. లింగవివక్ష ఇంకా కొనసాగుతోంది. ఆడపిల్ల పుడితే కష్టం, చదివించడం, భద్రత కల్పించడం, తొందరగా పెళ్లిళ్లు చేయడం వంటి ఆలోచన విధానం ఇంకా కొనసాగుతోంది. ఆడపిల్ల పుడితే భార్య ముఖం చూడని భర్తలు, అత్తమామలు ఇంకా ఉన్నారు. తమ కొడుకుకు మరో వివాహం చేస్తామనే ఆలోచన విధానమూ ఉంది. ఆడ, మగ ఎవరైతే ఏంటి అనే మార్పు ఇప్పటివరకు 50శాతం వచ్చింది. మరో 40శాతంలో మాత్రం దేవుడు ఇచ్చాడనుకుని సర్దుకుపోతున్నారు. అయితే ముందుగా తల్లుల్లో మార్పులు రావాలి. మగబిడ్డ పుడితే బాగుంటుందనే భావన తొలగిపోవాలి. పుట్టిన బిడ్డ ఎవరైతేనేమి అనే మానసిక పరివర్తన తల్లికి వచ్చినప్పుడు ఈ వివక్ష ఉండదు. ఉద్యోగ విషయాల్లో మాత్రం వివక్ష కొంత తక్కువగా ఉంది. వ్యాపార రంగాలకు వచ్చినప్పుడు మహిళల పట్ల అపనమ్మకం ఏర్పడుతోంది. అన్నిరంగాల్లో రాణిస్తున్నప్పుడు వ్యాపార రంగంలో ఎందుకు మహిళలు రాణించారనే ఆలోచన విధానం రావాలి. ఏం పనిచేయని మగవారే వేధిస్తున్నారు.. గతంలో గృహహింస అంటే కట్నం కోసం మాత్రమే భర్త, అత్తమామ కొన్నిచోట్ల ఆడపిల్లలు వేధించేవారు. ప్రస్తుతం సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. మహిళలు ఇంటి నుంచి బయటికి వెళ్లి కుటుంబ పోషణకు అవసరమయ్యే డబ్బు సంపాదిస్తున్నారు. ప్రత్యామ్నాయ పనుల వైపు మహిళలు అడుగులు వేస్తున్నారు. అయితే పనిచేయక ఊరికే కూర్చుండే కొందరు మగవారు మహిళల ఆర్థిక, సాధి కారతను భరించలేక భార్యలపై హింసకు పాల్పడుతున్నారు. విద్యారంగంలో స్త్రీ, పురుష అసమానతలు విద్యారంగంలో స్త్రీ, పురుష అసమానతలు అత్యధికంగా ఉన్నా యి. అబ్బాయిలను ఇంజనీరింగ్, డాక్టర్ వంటి ఉన్నత చదువులు చదివిస్తున్న తల్లిదండ్రులు, అమ్మాయిల విషయంలో వివక్ష చూపుతున్నారు. పెద్దగా ప్రాధాన్యం లేని చదువులను చదివిస్తున్నారు. అబ్బాయిల స్థాయిలో అ మ్మాయిలను చూడడం లేదు. -
మాపై ఎందుకీ వివక్ష
మహిళలంటే వివక్ష ... ‘ఆ... ఏం చేస్తారు...ఏమి అడుగుతారులే ... మనం ఏదంటే అదే అనే ధీమా’. ఆ అధికార అహంకారమే గత నాలుగేళ్లుగా నిర్లక్ష్యం చేసింది. ప్రజా ప్రతినిధులైన ఈ మహిళామణులు వినతులతో విజ్ఞప్తులు చేశారు. అవస్థలు...అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను వివరించారు. సంబంధిత మండల టీడీపీ ప్రజా ప్రతినిధులు పెడ చెవిన పెట్టారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ... జన్మభూమి కమిటీల కన్నెర్రతోపాటు కలంపోటులకు భయపడి చూసీ చూడనట్టు వ్యవహరించడంతో కొంగు నడుంకు చుట్టి పిడికిలి బిగించారు. సోమవారం తహసీల్దారు కార్యాలయంలో జరిగిన ప్రజావాణిని వేదికగా చేసుకొని బైఠాయించారు. తాము ‘అబలలం కాదు సబలలం’ అని నినదించారు. గోకవరం (జగ్గంపేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీలమైన తమపై అధికారులు వివక్ష చూపుతున్నారని, పింఛన్లు కేటాయించకుండా చులకనగా చూస్తున్నారని మహిళా ఎంపీటీసీలు నిరసన తెలిపారు. గోకవరంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమాన్ని మండల పరిషత్ ప్రతిపక్షనేత వరసాల కుమారి, గోకవరం–2 ఎంపీటీసీ కారం నాగమణిలు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ముట్టడించారు. ఈ సందర్భంగా ప్రజావాణి జరుగుతున్న ప్రదేశంలో బైఠాయించి నిరసన తెలిపారు. దళిత, గిరిజన ఎంపీటీసీలమైన తమ వార్డులకు పింఛన్లు కేటాయించకుండా, రేషన్‌కార్డులు మంజూరు చేయకుండా వివక్షకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలకే పింఛన్లు పంపిణీ చేసే అధికారం కట్టబెట్టడంతో తమ వార్డులకు చెందిన అర్హులకు పింఛన్లు అందించకుండా వారికిష్టమైన వారికి అందిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రాంతంలో కనీసం వీధిరోడ్లు వేయడంలేదని, ఇళ్ల స్థలాలు, ఇంటి రుణాలు మంజూరు చేయడం లేదని వాపోయారు. ఈ చర్యల ద్వారా తమను అవమానపరుస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న గోకవరం ఎస్సైలు జి.ఉమామహేశ్వరరావు, ఎ.తిరుమలరావులు సిబ్బందితో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జగ్గంపేట కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ అక్కడకు చేరుకుని వారికి మద్దతుగా నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ కేవలం తమ పార్టీకి చెందిన దళిత, గిరిజన ఎంపీటీసీలను లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎం.వెంకటరమణారావు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ అధికారం తనకు లేదన్నారు. జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన వారికే పింఛన్లు అందిస్తున్నామన్నారు. దీనిపై మహిళా ఎంపీటీసీలు, కో ఆర్డినేటర్, ఇతర నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రాంతంలో అర్హులైన వారికి పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేసే వరకూ ఆందోళన విరమించేదిలేదని భీష్మించారు. దీనిపై ఎంపీడీఓ స్పందిస్తూ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తహసీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ అర్హులకు రేషన్‌కార్డుల మంజూరుకు కృషి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ముత్యం నాని, ఎంపీటీసీ నల్లల వెంకన్నబాబు, నాయకులు కర్రి సూరారెడ్డి, దాసరి ధర్మరాజు, గౌడు లక్ష్మీ, మంగరౌతు శ్రీను, బిజ్జి రాజు, మచ్చా జయలక్ష్మి, తేలు ఈశ్వరి, ఏనుగుపల్లి సుబ్బలక్ష్మి, ఉంగరాల ఆదివిష్ణు, దాకారపు ధర్మరాజు, మైపాల పాండు, ఆండ్రు నాగేంద్రుడు పాల్గొన్నారు. -
మట్టినిల్లు
పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లిన అమ్మాయికి మిగిలింది మట్టే! జీవితాన్నంతా పిండి ఆ మట్టిలో పోసినా.. ఆ పంట ఎప్పటికీ మెట్టినింటిదే. మట్టిని నమ్ముకున్న మహిళకు.. మెట్టినిల్లు ఏమౌతుంది? మట్టినిల్లే! సరిగ్గా గుర్తులేదు కానీ, పెళ్లయ్యేనాటికి పదమూడో పధ్నాలుగో రాజేశ్వరికి! ఇంకా చెప్పాలంటే గవర్నమెంటు స్కూల్లో ఎయిత్ క్లాస్ బోర్డు మీదకు ఆమె పేరు ఎక్కినప్పుడు! అప్పుడు తనతో పాటు మరో ముప్ఫయ్ మంది అమ్మాయిలు కూడా అదే ఊర్లో బడిమానేసినట్లు రాజేశ్వరికి గుర్తు. టెన్త్ క్లాస్ కష్టపడి చదివి పాసైతే పక్కనే ఉన్న సిద్ధిపేట కాలేజీలో చేరొచ్చని తనూ తన ఫ్రెండ్సంతా ఎన్ని కలలుగన్నారు?! ఎలాగోలా టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటే ఇక ఇంట్లో కూడా.. చదువు మాన్పించమని నాన్న అడగరు. ఆ తరువాత నర్స్ ట్రైనింగ్‌కి వెళితే హైదరాబాద్‌లో ఏ ఆసుపత్రిలో నైనా జాబ్ చేయొచ్చు. తనకోసం, తన చెల్లెళ్లిద్దరికోసం ఎండనకా వాననకా అమ్మపడే కష్టం చూడలేకపోతోంది. పుస్తకాలకీ, పెన్నులకీ ఏ అవసరానికైనా అమ్మేగా డబ్బులివ్వాల్సింది. ఆమె కూలికెళ్లి దాచిన డబ్బుతో కష్టపడి చదువుకుంది కనుకనే అమ్మ కష్టం తీర్చాలనుకుంది. అసలు అమ్మ పోరు పడలేకే కదా నాన్న రాజేశ్వరిని బళ్లో చేర్చింది. ఆయనకైతే ఎప్పుడూ తనకు పెళ్లి చేసి పంపించేయాలన్న తొందరే ఉండేది. అయితే తను మాత్రం అంత త్వరగా బడి మానేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు రాజేశ్వరి. ఆ రోజు ఆ సంఘటన జరగకపోతే ఆమె కచ్చితంగా ఆ గొడ్డుచాకిరీ నుంచి తప్పించుకోగలిగి ఉండేది. చదువుకు అదే చివరి రోజు! అప్పటికే గుసగుసగా అంతా చెప్పుకుంటున్నారు. రాజేశ్వరిని హెడ్మాస్టర్ పిలిచారని. క్లాస్‌లోకి వెళ్లకుండానే మధ్యలోనే క్లాస్ టీచర్ ఎదురయ్యి చెప్పారు చాలా కోపంగా.. హెడ్మాస్టర్ రమ్మంటున్నారని. భయం భయంగానే హెడ్మాస్టర్ సుధాకర్ సార్ దగ్గరికి వెళ్లింది రాజేశ్వరి. ఏం జరిగిందో చెప్పకుండా చెడామడా తిట్టారాయన. ‘‘ఎందుకొస్తారు బడికి? ఏ ఇంట్లోనో నాలుగు అంట్లు తోముకోకుండా? ఇలా మగపిల్లల్ని చెడగొట్టడానికా? కనీసం పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బులుండవు కానీ ప్రేమాదోమా అంటూ ఊరేగుతున్నారు? ఇంకెప్పుడైనా ఇలా జరిగితే ఊర్కునేది లేదు. నీ ప్రమేయం లేకుండా వాడెవడో అలా ఎందుకు రాస్తాడు? మానేస్తే బడిమానేసెయ్! రేపు మీ నాన్నని తీసుకొని బడికిరా’’ కఠినంగా ఉంది హెడ్మాస్టర్ గొంతు! రాజేశ్వరికేం అర్థం కాలేదు. దుఃఖం పొంగుకొస్తోంటే పరుగుపరుగున క్లాసులోకి అడుగుపెట్టింది. ఇంకా సార్ రాలేదు. తన ప్లేస్‌లో కూర్చోగానే ఫ్రెండ్సంతా చుట్టుముట్టారు. ఏమైందంటూ. అనుకోకుండా బోర్డువైపు చూసాక కానీ అర్థం కాలేదు. ఏం జరిగిందో. చక్కగా చెక్కినట్టు ఉన్నాయి అక్షరాలు ‘ఐలవ్ రాజేశ్వరి’ అని! అదే ఆమె చదువుకు ఆఖరు. రాజేశ్వరిని చదువు మాన్పించి పెళ్లి చేసేసారు మేనమామకిచ్చి. ఆ తరువాత తెలిసింది.. ఆ భయంతో.. అదే స్కూల్లో చదువుతోన్న మరో ముప్ఫయ్ మంది అమ్మాయిలు వరుసగా మానేసారని! ‘‘ఏ లోకంలో ఉన్నవమ్మా? ఎన్ని రోజులేడుస్తవ్? ఎన్ని రోజులేడిసినా పోయినోడు తిరిగొస్తడా.. సక్కనైన కొడుకునిచ్చిండు. అత్తమామ ఉండనే ఉన్నరు. ఒళ్లు దాసుకోకుండా కష్టం జేసి ఇంటికి సరిపోయే నాలుగు గింజలు పండిస్తున్నవ్. ఆడున్నా గానీ బాయికాడ కష్టమంత నీదే గదనే పోరి. పో.. పో..’’ పక్కింటి శాంతక్క మాటలకు ఉలిక్కిపడి ఈలోకంలోకొచ్చింది రాజేశ్వరి. వ్యవసాయాన్ని ఇష్టంగా చేసినోడు తన భర్త. తిన్నడా తినలేదా? ఎవరికిదెలుసు? పొద్దున లేస్తే పొలంలనే ఉండెటోడు. పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక, ధర బల్కక ఉన్న పొలంలనే ఉరిబెట్టుకుండు. భర్త పోయాక చేనే తోడయ్యింది ఒక్కసారి శాంతక్క అన్న మాటలు గుర్తొచ్చాయి. వెంటనే భర్త, తండ్రి, మామ మాటలు కూడా గుర్తొచ్చాయి రాజేశ్వరికి. ‘‘ఆడున్న గానీ బాయికాడి కష్టమంత నీదేగదనే’’ అన్నది శాంతక్క. అరుగుమీద కూర్చున్న మామకి చురకెయ్యాలని అన్నదో, లేక తన కష్టాన్ని చూసింది కనుకనో మాటైతే అన్నది. ఒక్కసారి తనని తేరిపార చూసుకుంది రాజేశ్వరి. మట్టిముద్దలా ఉంది. బళ్లో తనెలా ఉండేది? సీన్మాయాక్టర్లెందుకు పనికొస్తరే నీదగ్గర అనేటోళ్లు ఫ్రెండ్సంతా. 30 ఏళ్లు కూడా నిండలేదు.. ముగ్గురు బిడ్డలతో భర్తను పోగొట్టుకొని ఏకాకిగా మిగిలింది. చేలో చేసిన చాకిరికి చిక్కి శల్యమైంది. ఈ మట్టిలోనే కదా తన పధ్నాలుగో ఏటినుంచి పనిచేసింది. భర్తన్నా ఏదో ఒక రోజు ఇంట్లో ఉండేవాడు. పొలంలోకి అడుగుపెట్టకుండా ఏ రోజూ గడవలేదు. మట్టివాసన చూడని రోజు తనకి ముద్ద దిగదు గదా! భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ అనుకునేవారు.. ఛస్తే ఈ మట్టిలోనే చావాలి. అంతేగానీ వ్యవసాయం మాత్రం మానొద్దని. కానీ అలాంటిది రాత్రి ఎంత మాటన్నాడు మామ. తాను, తన భర్త ఎంతో ప్రేమించిన ఈ భూమి తన భర్త తరువాత తనకి రాదట. ఆడదాని పేరుమీ§ð ట్ల బెడతరు పొలం అన్నడు. ఆడదాని కష్టమైతే తింటరుగానీ పొలం మాత్రం ఉండదట. అప్పుడు చదువు.. ఇప్పుడు భూమి ఆలోచిస్తోంటే అర్థమౌతోంది రాజేశ్వరికి. అమ్మ పేరు మీద భూమి లేదు. అత్త పేరునా లేదు. ఇప్పుడు తన పేరున కూడా ఉండదు. పొద్దున లేస్తే పొలంలో కాయకష్టం జేసే తనకి భూమిని రాసివ్వనని కరాఖండీగా చెప్పిన మామ తన మూడేళ్ల కొడుక్కిస్తానన్నాడు. అదికూడా వాడికి పద్ధెనిమిదేళ్లొచ్చాక! అంటే ఇంతకాలం ఒక పశువులా పొలంలో పనిచేసిన తన కష్టం ఏమయ్యింది? ఇప్పడు తనకి కాకుండా ఎప్పుడో పదిహేనేళ్ల తరువాత తనకొడుక్కి పొలం రాయడం ఏమిటి? ఆడవాళ్లకు భూములుండొద్దా? రేపు తన కొడుకు తనకి అన్నం పెట్టకపోతే... ఆ భూమి అమ్ముకుని తాగేస్తే... అప్పుడు చదువు, ఇప్పుడు భూమి ఏదీ తనకు సంబంధం లేకుండానే తనకు దూరమవుతాయి. అవి తనకెంత ప్రియమైనవైనా! ఆలోచిస్తూనే నడుస్తోంది. రాజేశ్వరికి తనకు తెలియకుండానే పొలంవైపు అడుగులు పడుతున్నాయి. బడి మాన్పించారు. పెళ్లి చేసేశారు. పొలంలోనే భర్త ఉరివేసుకున్నాడు. ముగ్గురు పిల్లలతో ఏకాకి అయింది. తన భూమికే తను కూలీగా మిగిలింది. మళ్లీ స్త్రీల చేతికి రావాలి ఎక్కడైనా చూడండి స్త్రీల పేరున భూమి ఉండదు. ఉండనివ్వదు ఈ పురుషాధిపత్య సమాజం. ఎవరికైనా ఉంటే అది హింసకి కారణమౌతుంది. మరీ ముఖ్యంగా ఒంటరి స్త్రీల పేరున భూమి ఉన్నచోట స్త్రీలపై దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే దానికి ఆస్తి అనే కారణం పైకి కనిపించదు. చేతబడులు చేస్తోందనో, లేకపోతే ఆమెకు మంత్రాలూ, తంత్రాలూ వచ్చనో, అదీ కాకపోతే ఇంకేదో కారణం చూపుతారు తప్ప ఆస్తి కారణంగా దాడి జరిగిన గుర్తులు బయటకు పొక్కనివ్వరు. అందుకే సంపదపై పురుషుడి పెత్తనం మాత్రమే ఉండాలి అనే ఆధిపత్య భావజాలాన్ని అంతమొందించాలి. ఉత్పత్తి సాధనాలపై పురుషులు ఆధిపత్యం సంపాదించిన నాటినుంచే స్త్రీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా తయారయ్యారు. అవి మళ్లీ తిరిగి స్త్రీల చేతికి వస్తేనే స్త్రీలపై జరిగే అన్ని రకాల హింసల నుంచీ వారికి విముక్తి లభిస్తుంది. ఆ మార్పు రావాలి. అది ప్రభుత్వాల నుంచే మొదలు కావాలి. – ఉషా సీతాలక్ష్మి, సామాజిక కార్యకర్త, రచయిత -
నాడు సర్పంచ్..నేడు స్వీపర్
మహిళా సాధికారత అంటూనే ఆ మహిళను వివక్షకు గురి చేస్తోంది. ప్రజాపాలనలో సమానత్వం కల్పిస్తున్నామని చెబుతున్న రాజకీయ పెత్తందారులు మహిళను ఉత్సవ విగ్రహంగా మార్చేస్తున్నారు. చట్ట సభలు, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పన అనే అధికారికంగా చట్టానికి నోచుకోకపోయినా ‘స్థానిక’ సంస్థల్లో సగం రిజర్వేషన్ పుణ్యమా అని ప్రజాప్రతినిధులుగా పదవులను అలకరించినా.. ఆ గౌరవం కొన్నాళ్లే. తిరిగి పాత జీవితం గడపాల్సిందే. సూళ్లూరుపేట మండలంలోని మంగళంపాడు మాజీ సర్పంచ్ జీవితమే ఉదాహరణ. నెల్లూరు జిల్లా / సూళ్లూరుపేట: మండలంలోని మంగళంపాడుకు ఐదేళ్ల పాటు సర్పంచ్ స్థానంలో గ్రామ ప్రథమ పౌరురాలిగా ఇంగిలాల సుబ్బమ్మ ప్రజల ప్రజాప్రతినిధిగా వ్యవహరించారు. ఆమె ఇప్పుడు చెంగాళమ్మ ఆలయంలో స్వీపర్‌గా పని చేస్తోంది. సర్పంచ్‌గా ఐదేళ్లు పని చేసినా పాలనలో ఆమె పెత్తనం ఏమీ లేకుండా పోయింది. సర్పంచ్ కాక ముందు కంటే సర్పంచ్ అయ్యాక ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. అప్పుడు ఉన్న పూరింట్లోనే ఇప్పుడూ ఉంటుంది. కనీసం పక్కా ఇల్లు కూడా కట్టుకోలేకపోయింది. ఆమె పాలనపై పెత్తనం చెలాయించిన పెత్తందారులు మాత్రం నాలుగు రాళ్లు వెనకేసుకుని దర్జా.. డాబు ప్రదర్శిస్తున్నారు. 2006లో మంగళంపాడు పంచాయతీని ఎస్సీ మహిళకు కేటాయించడంతో టీడీపీ మద్దతురాలిగా ఆ గ్రామంలోని ఆ పార్టీ నాయకులు ఆమెను బరిలోకి దింపారు. ఆమె సర్పంచ్ కాక ముందు కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేది. సర్పంచ్ అయ్యాక కూలి పనులకు వెళ్లలేకపోయింది. పూటగడవటం కష్టంగా మారింది. అయినా తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు జనాలను సమీకరించడం, ఇతర కార్యక్రమాలకు వెళ్లడం మినహా ఆమె తనకంటూ నాయకత్వ పటిమను పాదుగొల్పులేకపోయింది. ఆమెను శాసించిన నాయకులు ఉత్సవ విగ్రహంగా మార్చేసుకున్నారు. సంతకాలు అవసరమైన చోట సంతకాలు చేయించుకున్నారు. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి. తిరిగి ఆమె జీవితం దుర్భరంగా మారింది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడికి పెళ్లయి వేరుగా ఉంటున్నాడు. మరో కుమారుడు చదువుతున్నాడు. ఐదేళ్ల పాటు పైసా కూడా కూడబెట్టుకోకపోవడంతో ప్రస్తుతం కుటుంబ పోషణ కష్టతరం కావడంతో స్థానికంగా ఓ హోటల్లో పాచి పనికి చేరింది. ఆమె దుస్థితిని చూసిన కొంతమంది చలించిపోయి ఆమెను చెంగాళమ్మ ఆలయంలో స్వీపర్‌గా చేర్చారు. ఐదేళ్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఉన్నత వర్గాల వారు మాత్రం స్థిర పడిపోతున్నారు. చదువు లేని ఇలాంటి మహిళలు మాత్రం సంతకాలకే పరిమితం కావడంతో మహిళా సాధికారత అపహాస్యం పాలవుతోంది. ఇలాంటి సుబ్బమ్మలు ఇంకా ఎంతో మంది ఉన్నారు. అధికారం వచ్చినా అనుభవించనీకుండా పెత్తనం చేసే ఉన్నత వర్గాల వారు చెప్పినట్టుగా చేయాల్సి ఉండటం చూస్తే మహిళకు సాధికారత వచ్చిందా? ఇంకా వివక్షకు గురవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు కనపించడం లేదు. కనీసం ఇల్లు కూడా కట్టుకోమన లేదు ఐదేళ్లు సర్పంచ్‌గా పనిచేశాను. ప్రస్తుతం అమ్మవారి సేవలో జీవితం గడిచి పోతుందని అనుకుంటున్నాను. సర్పంచ్‌గా పని చేసి కనీసం ఇల్లు కూడా నిలబెట్టుకోలేకపోయాను. తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు. ఒక ఇల్లు కట్టుకోమని ఎవరూ చెప్పలేకపోవడంతో ఇప్పటికీ పూరి గుడిసెలోనే జీవితం గడుపుతున్నాం. సర్పంచ్‌గా ఉన్న కాలంలో కూడా సంతకాలనే పరిమితమయ్యాను. కనీసం రూపా యి సంపాదన లేకుండా పోయింది. భర్త పనికి పో లేకపోవడంతో నేను చెంగాళమ్మ ఆలయంలో స్వీపర్‌గా పనిచేసి ఆయన్ను పోషించుకుంటున్నాను. – ఇంగిలాల సుబ్బమ్మ, మాజీ సర్పంచ్ మంగళంపాడు