రుతుక్రమం ఆగిపోయింది.. కోరికలూ ఆవిరైపోయాయి! ఆయన వాంఛను ఆపలేకపోతోంది! నిద్రముంచుకొస్తోంది.. కానీ పడుకోవాలంటే భయమేస్తోంది!!
‘‘నా వల్ల కాదే... చచ్చిపోవాలనిపిస్తోంది... నాకు ఈ పనిష్మెంట్ ఏంటీ?’’ శారద ఏడుస్తోంది ఫోన్‌లో. ‘‘ఊరుకో అమ్మా! నువ్వు ఇదంతా భరించాల్సిన అవసరం లేదు. వెళ్లి రాజీవ వాళ్ల అమ్మను కలువు. ఫోన్ నంబర్ వాట్సాప్ చేస్తా. రాజీవక్కూడా చెప్తాను. అది ఇంటికొచ్చి నిన్ను తీసుకెళ్తుంది. ఓకే నా.. అమ్మా.. ఓకేనా..?’’ తల్లిని ఊరడిస్తోంది.. ఆమెకు ధైర్యమిస్తోంది సంహిత. ‘‘ఊ... సరే’’ అని ముక్కు తుడుచుకుంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసింది శారద. అయిదు నిమిషాల్లో రాజీవ వాళ్ల అమ్మ శైలజ నంబర్ వాట్సాప్ చేసింది సంహిత. చూసుకుని, ఆమెకు ఫోన్ కలిపింది. అపాయింట్‌మెంట్ ఫిక్స్ అయింది. తెల్లవారే రాజీవ వచ్చి శారదను తీసుకొని వెళ్లింది వాళ్లమ్మ ఆఫీస్‌కి.
ముసల్దానా...
‘‘సంహిత అమెరికాలో, బాబు అంకిత్ ఆస్ట్రేలియాలో. ఇక్కడ మేమిద్దరమే. మేము యంగ్‌గా ఉన్నప్పుడు కూడా దొరకనంత ప్రైవసీ. కానీ అలాంటి ప్రైవసీని ఆస్వాదించే స్థితిలో నేను లేను. మెనోపాజ్. ఆయనేమో చాలా ఉత్సాహంగా ఉంటున్నాడు. నన్నూ అలా ఉండమని ఇన్‌సిస్ట్ చేస్తున్నాడు. నా వల్ల కావట్లేదు. ఆయనకు కోపం వస్తోంది. తిడుతున్నాడు చండాలంగా. భరించలేని నొప్పి, మంట.. ఆ ఇబ్బందిని ఎక్స్‌ప్రెస్ చేయాలన్నా భయమేస్తోంది. కొడుతున్నాడు.
‘ముసల్దానితో సంసారం చెయ్యాల్సిన కర్మ పట్టింది. ఇంకోదాన్ని చూసి పెళ్లి చేయ్ మరి’ అంటూ వేధిస్తున్నాడు’’ అని ఏడ్చేసింది శారద. ‘‘పైగా వికృతమైన చేష్టలు, అసహజమైన పద్ధతుల్లో అడుగుతున్నాడు. పోర్న్‌సైట్స్ చూడ్డమే కాదు.. అలాంటి వీడియోలను నాకు వాట్సాప్ కూడా చేస్తున్నాడు’’ అంటూ వాంతికొచ్చినట్టయి బాత్రూమ్‌లోకి పరిగెత్తింది శారద. ‘‘మమ్మీ.. ఆంటీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ లేదా?’’ బాధగా అడిగింది రాజీవి. ‘‘ఊ... ’’కుర్చీలో వెనక్కి వాలుతూ నిట్టూర్చింది శైలజ.
ఇంతలోకే మొహం తుడుచుకుంటూ వచ్చింది శారద. ‘‘శారదగారూ... కౌన్సెలింగ్, కంప్లయింట్లతో మీ ఆయనను మార్చేదేమీ ఉండదు. ఎందుకంటే ఆయనా పోలీస్ ఆఫీసరే. ఎలా డీల్ చేస్తారు, ఫలితం ఏముంటుందో ఆయనకు తెలుసు. కాబట్టి..’’ అని ఆగి శారద వైపు చూసింది శైలజ. ‘‘చెప్పండి’’ అంది శారద. ‘‘మీ సమస్యకు పరిష్కారాన్నిచ్చేది, మీ బాధకు ఉపశమనాన్ని కలిగించేది ఒక్కటే.. డీవీ యాక్ట్!’’ అని పూర్తిచేసింది శైలజ. ‘‘డీవీ యాక్టా? అంటే?’’ అమాయకంగా సందేహాన్ని వెలిబుచ్చింది శారద. ‘‘డొమెస్టిక్ వయలెన్స్.
ఇందులోనే మీది సెక్సువల్ హెరాస్‌మెంట్ కిందకు వస్తుంది’’ అని వివరించి శారద ఏం చేయాలో చెప్పింది శైలజ.ప్రొటెక్షన్ ఆర్డర్స్ శైలజ చెప్పినట్టే చేసింది శారద. భర్త వికృతచేష్టలను వీడియోలో రికార్డ్ చేసింది. తన మెడికల్ రిపోర్ట్‌తో సహా ఆ వీడియోను కోర్టులో ఫైల్ చేసింది. ఆమె భర్తకు నోటీసులు వెళ్లాయి. షాక్ అయ్యాడు భర్త. తన ఇంట్లోకి ఎలా అడుగుపెడుతుందో చూస్తా అనుకున్నాడు అహంకారంగా. నిర్భయంగా, అధికారికంగా అడుగుపెట్టింది ఆమె కోర్టు ఇచ్చిన ప్రొటెక్షన్ ఆర్డర్స్‌తో. అంతేకాదు ‘‘ఇక ముందు ఇలా ప్రవర్తిస్తే సెక్షన్ 377 కింద బుక్ చేయాల్సి వస్తుంది. పదేళ్లు చిప్పకూడు తింటావ్’’అని ఆ పోలీస్ ఆఫీసర్‌కు వార్నింగ్‌కూడా ఇచ్చింది కోర్టు. మీ సమస్యకు పరిష్కారాన్నిచ్చేది, మీ బాధకు ఉపశమనాన్ని కలిగించేది ఒక్కటే.. డీవీ యాక్ట్!’’ అని పూర్తిచేసింది శైలజ.
Comments
Please login to add a commentAdd a comment