నేషనల్ బార్ అసోసియేషన్ 6,047 మంది ఉద్యోగినులపై జరిపిన సర్వే (2017) ప్రకారం లైంగిక వేధింపు బాధితుల శాతం
యాసిడ్ ఎటాక్స్
2010–2016 మధ్య 1,189 యాసిడ్ దాడి కేసులు నమోదయ్యాయి. కోర్టుల మార్గదర్శకాలకు అనుగుణంగా బాధితులకు సాయం అందడం లేదు. బహిరంగ మార్కెట్లో యాసిడ్ అమ్మకాల్ని నిషేధిస్తూ కోర్టులు జారీ చేసిన మార్గదర్శకాల్ని సైతం రాష్ట్రాలు పట్టించుకోవడం లేదు. దీనిపై సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రాన్ని ప్రశ్నించింది.
కేసుల గణాంకాలు
అపహరణ, అపహరణ ప్రయత్నాల తాలూకు కేసులు
2014 - 57,000
2015 - 64,000
ఐసీసీలకూ గతి లేదు
పది, అంతకు మించి ఉద్యోగులున్న ప్రతి కంపెనీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ఏర్పాటు చేసి తీరాలి. అయితే 36% భారతీయ కంపెనీలు, 25% మల్టీ నేషనల్ కంపెనీలు ఐసీసీలు ఏర్పాటు చేయలేదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) 2015 అధ్యయనం చెబుతోంది. ఫిక్కీ పరిశీలించిన 120 కంపెనీల్లో సగం కంపెనీలు చట్ట పరిజ్ఞానం అంతగా లేని వాళ్లని ఐసీసీ సభ్యుల్ని చేశాయి.
బీఎస్‌ఈ (బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి) టాప్ 100 కంపెనీల్లోని 52 కంపెనీల్లో మాత్రమే లైంగిక వేధింపు కేసుల గణాంకాలున్నాయి. సంబంధిత వివరాలు :
రాష్ట్ర విభజన కాలం నుంచి 2016 డిసెంబర్ వరకు – కిడ్నాప్, అక్రమ రవాణా, వ్యభిచార కూపంలోకి నెట్టబడిన ఉదంతాలపై తెలంగాణలో నమోదైన కేసులు 2046. పోలీస్ శాఖ వీటిలో 472 కేసుల్ని తప్పుడు కేసులుగా తేల్చి, వాటిని మూసివేసింది. మిగిలిన కేసుల్ని దర్యాప్తుకు స్వీకరించింది. పోలీస్‌శాఖ అందించిన వివరాల ప్రకారం ఆయా కేసుల స్థితిగతులు దిగువ విధంగా ఉన్నాయి.
వస్త్ర పరిశ్రమలో వేధించేదెవరు?
90% - మగ సూపర్‌వైజర్లు/ ఫ్లోర్ ఇన్‌ఛార్జ్ మేనేజర్లు
75% - కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు లేవని చెబుతున్నవారు
3.6% - వేధింపు కేసుల్లో తీసుకున్న క్రమశిక్షణ చర్యలు
కర్ణాటకలోని 5 లక్షలమంది గార్మెంట్ వర్కర్లపై ‘సిస్టర్స్ ఫర్ చేంజ్ ’ 2016లో జరిపిన అధ్యయనం
జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) 2016 నివేదిక ప్రకారం
♦ మహిళలను అగౌరవపర్చడంలో ఆంధ్రప్రదేశ్‌ది మొదటి స్థానం.
♦ అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలోనే ఏడవ స్థానం.
♦ మహిళల అక్రమ తరలింపుపై నమోదైన కేసులు 239
♦ బాలికల (12 – 18) కిడ్నాప్ కేసులు 396
మహిళలపై వేధింపులకు సంబంధించి ఏపీలో నమోదైన కేసులు
2016 - 5,135
2017 - 5,453
- సోర్స్ : ఏపీ పోలీసుల వార్షిక క్రైమ్ నివేదిక
సేకరణ: శిశిర, యిర్రింకి ఉమామహేశ్వరరావు, ఏపీ స్టేట్‌బ్యూరో, ఐ. శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ స్టేట్ బ్యూరో‡
Comments
Please login to add a commentAdd a comment