ఆడపిల్లలా ఉండు.. ఆడపిల్లలా మాట్లాడు.. ఆడపిల్లలా నడువు..చివరకు నవ్వడం, ఏడ్వడం, కూర్చోవడం, తినడం.. ఇలా అన్నీ ఆడపిల్లలా చేయమంటారు! ఎందుకు వేశారీ శిక్షలు.? ఎవరు విధించారీ ఆంక్షలు.? అసలీ ‘ఆడపిల్ల’ ట్యాగ్ మాకెందుకు? అంటూ ప్రశ్నించారు హోలీమేరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థినులు. స్త్రీ వివక్షపై ‘సాక్షి’ సాగిస్తున్న సమరంలో భాగంగా ‘నేను శక్తి’ శీర్షికతో అమ్మాయిలు మనసు విప్పి మాట్లాడారు. స్త్రీపురుషసమానత్వ భావనకు సాక్ష్యంగా నిలిచారు.