
♦ చెరకును శుభకార్యాల్లో వినియోగించడం అందరికీ తెలిసిందే. చెరకురసాన్ని పానీయంగానే కాకుండా, అభిషేకాలకు కూడా వినియోగిస్తారు. చెరకుగడ మాత్రమే కాదు, చెరకు వేరు కూడా చాలా శుభప్రదమైనది. చెరకువేరును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.
♦ దీపావళి రోజున లక్ష్మీపూజ చేసేవారు ఉదయాన్నే చెరకువేరును సేకరించి, వాటిని శుభ్రపరచి పసుపు కుంకుమలతో అలంకరించి, పూజమందిరంలోని లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ముందు పెట్టి పూజించాలి. ఇలా పూజించిన చెరకువేరును ఎర్రని వస్త్రంలో చిన్న మూటలా కట్టి ఇంట్లోనైనా, దుకాణాల వంటి వ్యాపార సంస్థల్లోనైనా నగదు భద్రపరచే చోట ఉంచడం వల్ల ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.
♦ దీపావళి రోజున పూజించిన చెరకు వేరును తాయెత్తులో పట్టే పరిమాణంలో ముక్కలుగా చేసి, ఒక ముక్కను వెండితాయెత్తులో ఉంచి, దానిని మెడలో ధరించడం వల్ల జనాకర్షణ పెరుగుతుంది. సంపాదన మెరుగుపడుతుంది. చెరకువేరు ముక్కను తాయెత్తుగా ధరించలేని వారు కనీసం దానిని ఎర్రవస్త్రంలో చుట్టి పర్సులో భద్రపరచుకున్నా మంచిదే.
– పన్యాల జగన్నాథ దాసు
Comments
Please login to add a commentAdd a comment