ఉత్కంఠ (క్యూరియాసిటీ) మీలో ఉందా?
సెల్ఫ్ చెక్
క్యూరియాసిటీకి ఉత్కంఠ, జిజ్ఞాస, కుతూహలం, ఆసక్తి, ఆతృత ఇలా చాలా పేర్లు ఉన్నాయి. పాఠశాల దశలోనే పిల్లల క్యూరియాసిటీలో తేడా కనబడుతుంది. చదువులో కొందరికి ఆసక్తి ఉంటే కొందరికి ఉండదు. ఏది నేర్చుకోవాలన్నా ముందు ఉండాల్సింది కుతూహలమే కదా! ఇది ఉన్నవాళ్లు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. ఏదోఒకటి సాధించాలని, కొత్తకొత్త విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంటారు. కుతూహలం లేకపోతే నిరాశ కలుగుతుంది. పిల్లల్లో ఇది కొరవడితే విద్య ముందుకు సాగదు. మీలో కూడ ఉత్కంఠ ఉందా? దేన్నైనా తెలుసుకోవాలనుకొనే గుణం ఉందా? టెస్ట్ యువర్ క్యూరియాసిటీ.
1. మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది. ‘‘ఏ పని ఎలా చేయాలా’’ అని ఆలోచిస్తూ ఉంటారు. ఇతరులు చేసిన పని మీకు నచ్చదు.
ఎ. అవును బి. కాదు
2. ఒక పనిని ఒకేలా చేయాలనుకోరు. వివిధరకాలుగా చేస్తుంటారు. ఫలితాన్ని విశ్లేషిస్తుంటారు. ఇలా మీకై మీరే మోటివేషన్ పొందుతారు.
ఎ. అవును బి. కాదు
3. ఖాళీగా ఉండటం మీకు గిట్టదు. అలా ఉండేవాళ్లంటే మీకు ఏమాత్రం నచ్చదు.
ఎ. అవును బి. కాదు
4. ఆలోచనాశక్తి మీలో ఎక్కువగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు మీకు ఎన్నో సందేహాలని తెస్తుంటాయి. వాటి పరిష్కార దిశలో పయనిస్తుంటారు.
ఎ. అవును బి. కాదు
5. నిర్ణయాలు వెంటనే తీసుకోరు. ఒక పనిని ఫైనల్ చేసేముందు చాలాసేపు ఆలోచిస్తారు. మీ జీవితంలో బోర్ అనే మాటకు స్థానం ఉండదు.
ఎ. అవును బి. కాదు
6. మీకు సంబంధించిన వృత్తి గురించే కాకుండా ఇతర వృత్తుల గురించి కూడా తెలుసుకుంటుంటారు. తెలుసుకోవటం ద్వారానే విజ్ఞానం వస్తుందనుకుంటారు.
ఎ. అవును బి. కాదు
7. ‘‘ఈ రోజు ఈ పని చేయలేను, ఆ పనిపై ఆసక్తిలేదు ’’ ఇలా అనుకోరు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు.
ఎ. అవును బి. కాదు
8. మనుషులను చూసి ఆందోళన చెందరు. అందరితో కలిసిమెలసి ఉంటారు.
ఎ. అవును బి. కాదు
9. సృజనాత్మకంగా ఉంటారు. పరిశీలనాశక్తి మీలో చాలా ఎక్కువగా ఉంటుంది.
ఎ. అవును బి. కాదు
10. మీకు ఆత్మవిశ్వాసం పాళ్లెక్కువ. అన్వేషించే తత్వం మీలో దృఢంగా ఉంటుంది. దీనివల్ల మీరెప్పుడూ ఉత్సాహంగా ఉంటారు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ లు ఎనిమిది దాటితే మీలో క్యూరియాసిటీ అధికం. ప్రతి దాని గురించి తెలుసుకోవాలని తపన పడుతుంటారు. దీనికోసం ఎంత శ్రమనైనా పొందటానికి సిద్ధంగా ఉంటారు. ఇతరుల సలహాలకన్నా మీ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. ఇలాంటి ఆటిట్యూడ్ వల్ల విజయాన్ని సులభంగా చేరుకోగలరు. ‘బి’ లు ఆరు దాటితే మీలో కుతూహలం పెద్దగా ఉండదు. తెలుసుకోవాలనే తత్వం మీకుండదు, నేర్చుకోవటం పై శ్రద్ధ చూపలేరు. క్యూరియాసిటీని పెంచుకోవటానికి ప్రయత్నించండి.