Curiosity
-
చంపితే ఎలా ఉంటుందో చూసేందుకు... నిజంగానే మర్డర్ చేసింది!
ఆమె పేరు జుంగ్ యూ జుంగ్. వయసు 23 ఏళ్లు. ఉండేది దక్షిణ కొరియాలోని బుసాన్‌లో. నేరాలు, ఘోరాలంటే మహా పిచ్చి. ఎంతగా అంటే, టీవీల్లో రియల్ క్రైమ్ స్టోరీలను విపరీతంగా చూసేది. క్రైం నవలలు కూడా తెగ చదివేది. వాటి స్ఫూర్తితో, హత్య చేస్తే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నిజంగానే ఘోరానికి తెగబడింది. హత్య ఎలా చేయాలో, శవాన్ని ఎలా మాయం చేయాలో తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో నెలల పాటు సెర్చ్ చేసి మరీ రంగంలోకి దిగింది. ముక్కూ మొహం తెలియని ఓ అమాయక టీచర్‌ను విచక్షణారహితంగా పదేపదే పొడిచి పొట్టన పెట్టుకుంది! చివరికి శవా న్ని మాయం చేసే క్రమంలో అద్దెకు తీసుకున్న ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు ఉప్పందించడంతో కటకటాల పాలైంది! నేరాల సంఖ్య తక్కువగా ఉండే దక్షిణ కొరియా లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది... విద్యార్థి తల్లిగా నమ్మించి... జుంగ్ ఓ నిరుద్యోగి. తాతతో కలిసి నివసించేది. చేసేందుకు పనేమీ లేకపోవడంతో క్రైం ప్రోగ్రాంలు, సంబంధిత రియాల్టీ షోలకు, క్రైం నవలలకు బానిసగా మారింది. హత్యానుభవం ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నాక సంబంధిత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెదికింది. అనంతరం తగిన వ్యక్తి కోసం ట్యూటరింగ్ యాప్‌ల్లో నెలల పాటు వేట సాగించింది. హోం ట్యూషన్లు చెబుతారా అంటూ కనీసం 50 మందిని సంప్రదించింది. చివరికి గత మే నెలలో ఒక 26 ఏళ్ల మహిళను ఎంచుకుంది. తనను తాను ఓ హైస్కూలు స్టూడెంట్ తల్లిగా పరిచయం చేసుకుంది. తన బిడ్డకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలంటూ నమ్మించింది. అందుకామె సమ్మతించాక ఆన్లైన్లో ఆర్డర్ చేసి స్కూల్ యూనిఫాం కూడా తెప్పించుకుంది! అది వేసుకుని ట్యూటర్ ఇంటికి వెళ్లింది. ఆమె తలుపు తీసి లోనికి రానివ్వడమే ఆలస్యం, వెంట తీసుకెళ్లిన కత్తితో పదేపదే దాడికి దిగింది. ఏకంగా 100 సార్లకు పైగా పొడిచింది! చనిపోయిన తర్వాత కూడా దాడి ఆపలేదట! ఆ తర్వాత తాపీగా మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. వాటిని సూట్‌కేస్‌లో కుక్కి, ఓ ట్యాక్సీలో తీసుకెళ్లి దూరంలో నది దగ్గర పడేసి చేతులు దులుపుకుంది. రక్తమోడుతున్న సూట్‌కేసును ఓ అమ్మాయి అడవిలో పడేసిందంటూ ట్యాక్సీ డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జుంగ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓట్ల పండుగ.. జనం నిండుగ
సాక్షి,మెదక్: మెదక్ నియోజకవర్గంలో గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల సాంకేతిక లోపంతో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 273 పోలింగ్ కేంద్రాల్లో 72.84 శాతం పోలింగ్ జరిగింది. ఇందులో చిన్నశంకరంపేట మండలంలో 75 శాతం పోలింగ్ నమోదై నియోజకవర్గంలోనే ముందంజలో ఉంది. ఇక చిన్నశంకరంపేట మండలంలో 75 శాతం పోలింగ్ కాగా రామాయంపేట మండలంలో 73.76 శాతం, నిజాంపేటలో 69.49 శాతం, పాపన్నపేట మండలంలో 71.46 శాతం, రేగోడ్ మండలంలో 66 శాతం, పెద్దశంకరంపేట మండలంలో 69 శాతం, టేక్మాల్ మండలంలో 68.33 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలో గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని 27 వార్డుల్లో మొత్తం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలనుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటింగ్‌లో యువకులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించి ఓటింగ్ సరళిన అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను ఆకట్టుకునేందుకు బెలూన్ల తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. నవాబుపేటలో మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఆయన సతీమణి గాయత్రి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే వైస్‌చైర్మన్ రాగి అశోక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న యువకులు సెల్పీలు దిగుతూ సందడి చేశారు. శభాష్ పోలీస్ పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుగా నిర్వహించిన పలువురు కానిస్టేబుళ్లు తమ సేవా ధృక్పదాన్ని చూపి పలువురి చేత శభాష్ పోలీస్ అనిపించుకున్నారు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే కేంద్రాలకు వచ్చిన వృద్ధులకు, వికలాంగులను సేవలందించారు. నడవలేని వికలాంగులు, వృద్ధులను ఎత్తుకొని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. మహిళల కోసం వెయింటింగ్ హల్.. చిన్నశంకరంపేట(మెదక్): ఓటు వేసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాలి. అయితే ఓ గ్రామ సేవకుడి ఐడియా మహిళలకు క్యూౖలో నిలబడె శ్రమను తప్పించింది. మండలంలోని మడూర్‌లోని ఓ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారి కోసం వెయింట్ హాల్ ఏర్పాటుచేశారు. దీంతో ఎండలో వచ్చినవారు వెయింట్ హాల్ కూర్చొని సేదతీరారు. గ్రామ సేవకుడు యాదగిరిని పలువురు అభినందించారు. -
ఉత్కంఠ (క్యూరియాసిటీ) మీలో ఉందా?
సెల్ఫ్ చెక్ క్యూరియాసిటీకి ఉత్కంఠ, జిజ్ఞాస, కుతూహలం, ఆసక్తి, ఆతృత ఇలా చాలా పేర్లు ఉన్నాయి. పాఠశాల దశలోనే పిల్లల క్యూరియాసిటీలో తేడా కనబడుతుంది. చదువులో కొందరికి ఆసక్తి ఉంటే కొందరికి ఉండదు. ఏది నేర్చుకోవాలన్నా ముందు ఉండాల్సింది కుతూహలమే కదా! ఇది ఉన్నవాళ్లు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. ఏదోఒకటి సాధించాలని, కొత్తకొత్త విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంటారు. కుతూహలం లేకపోతే నిరాశ కలుగుతుంది. పిల్లల్లో ఇది కొరవడితే విద్య ముందుకు సాగదు. మీలో కూడ ఉత్కంఠ ఉందా? దేన్నైనా తెలుసుకోవాలనుకొనే గుణం ఉందా? టెస్ట్ యువర్ క్యూరియాసిటీ. 1. మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది. ‘‘ఏ పని ఎలా చేయాలా’’ అని ఆలోచిస్తూ ఉంటారు. ఇతరులు చేసిన పని మీకు నచ్చదు. ఎ. అవును బి. కాదు 2. ఒక పనిని ఒకేలా చేయాలనుకోరు. వివిధరకాలుగా చేస్తుంటారు. ఫలితాన్ని విశ్లేషిస్తుంటారు. ఇలా మీకై మీరే మోటివేషన్ పొందుతారు. ఎ. అవును బి. కాదు 3. ఖాళీగా ఉండటం మీకు గిట్టదు. అలా ఉండేవాళ్లంటే మీకు ఏమాత్రం నచ్చదు. ఎ. అవును బి. కాదు 4. ఆలోచనాశక్తి మీలో ఎక్కువగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు మీకు ఎన్నో సందేహాలని తెస్తుంటాయి. వాటి పరిష్కార దిశలో పయనిస్తుంటారు. ఎ. అవును బి. కాదు 5. నిర్ణయాలు వెంటనే తీసుకోరు. ఒక పనిని ఫైనల్ చేసేముందు చాలాసేపు ఆలోచిస్తారు. మీ జీవితంలో బోర్ అనే మాటకు స్థానం ఉండదు. ఎ. అవును బి. కాదు 6. మీకు సంబంధించిన వృత్తి గురించే కాకుండా ఇతర వృత్తుల గురించి కూడా తెలుసుకుంటుంటారు. తెలుసుకోవటం ద్వారానే విజ్ఞానం వస్తుందనుకుంటారు. ఎ. అవును బి. కాదు 7. ‘‘ఈ రోజు ఈ పని చేయలేను, ఆ పనిపై ఆసక్తిలేదు ’’ ఇలా అనుకోరు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఎ. అవును బి. కాదు 8. మనుషులను చూసి ఆందోళన చెందరు. అందరితో కలిసిమెలసి ఉంటారు. ఎ. అవును బి. కాదు 9. సృజనాత్మకంగా ఉంటారు. పరిశీలనాశక్తి మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎ. అవును బి. కాదు 10. మీకు ఆత్మవిశ్వాసం పాళ్లెక్కువ. అన్వేషించే తత్వం మీలో దృఢంగా ఉంటుంది. దీనివల్ల మీరెప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఎనిమిది దాటితే మీలో క్యూరియాసిటీ అధికం. ప్రతి దాని గురించి తెలుసుకోవాలని తపన పడుతుంటారు. దీనికోసం ఎంత శ్రమనైనా పొందటానికి సిద్ధంగా ఉంటారు. ఇతరుల సలహాలకన్నా మీ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. ఇలాంటి ఆటిట్యూడ్ వల్ల విజయాన్ని సులభంగా చేరుకోగలరు. ‘బి’ లు ఆరు దాటితే మీలో కుతూహలం పెద్దగా ఉండదు. తెలుసుకోవాలనే తత్వం మీకుండదు, నేర్చుకోవటం పై శ్రద్ధ చూపలేరు. క్యూరియాసిటీని పెంచుకోవటానికి ప్రయత్నించండి. -
ఉప ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఉత్కంఠ
-
నిప్పు లో తడి
నిప్పులో నిమ్ము ఉంటుంది. అబ్బ ఛా! నిప్పులో తడి ఉంటుందా? కావాలంటే కాలుతున్న కట్టెను చూడు... నిప్పు అంచున నీరు కనపడుతుంది. భగభగ మండే గుండె అంచున కూడా చెమ్మ ఉంటుంది. దేహం కాలే ముందు.. ఖననం అయ్యే ముందు.. చాలా ముందు... ప్రక్షాళన జరగాలి.. మనలని మనం.. నిప్పుతో కడుక్కోవాలి. ఇక్కడే.. వీలైతే ఇప్పుడే.. మన బాధను, కష్టాన్ని, కోపాన్ని, నష్టాన్ని.. మనసులో ఒక పీడలా మిగిలిపోకుండా... ఇక్కడే కడిగేసుకోవాలి. నిప్పులో ఉన్న తడితో కడిగేసుకోవాలి. మసాన్ సినిమా చూస్తే అదే అర్థమయింది.. దేహం కంటే ముందు.. చాలా ముందు.. మనసును నిప్పులాంటి సత్యంతో.. తడితడిగా ఉండే ప్రేమతో... కడిగేసుకోవాలి. కాశికి పోయినవాడు కాటికి పోయినట్టే లెక్క. కాని కాదు. కాశిలో ఉన్నా సరే కాటికి పోయేంత వరకూ జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ముందుకు సాగాల్సి ఉంటుంది. ఒక్కో దశలో ఒక్కో బాధను వదిలేసుకుంటూ ముందుకు ప్రవహించాల్సి ఉంటుంది. అదే ఈ కథ. మసాన్. కాశి పవిత్ర పుణ్యక్షేత్రం. భూలోక కైలాసం. మానవులను ముక్తిని పొందే అంతిమస్థలం. కాని అక్కడా ప్రజలు ఉంటారు. వాళ్లకూ జీవన వ్యాపారాలు ఉంటాయి. అక్కడా హోటళ్లు ఉంటాయి. ఇళ్లు ఉంటాయి. ఇంటర్నెట్ సెంటర్లు ఉంటాయి. మనుషుల చేతుల్లో ఫోన్లు ఉంటాయి. వాటిలో అవసరమైనవీ అవసరం లేనివీ కూడా అందుబాటులో ఉంటాయి. ఆ అమ్మాయి అలాంటివి కొన్ని చూసింది. ఒక అబ్బాయి అమ్మాయి చేసుకునే పనిని చూసింది. అదెలా ఉంటుంది? క్యూరియాసిటీ. దానిని తెలిసేసుకుంటే. తనేం చిన్న పిల్ల కాదు. డిగ్రీ చదివింది. ప్రస్తుతం కంప్యూటర్ సెంటర్లో ట్యూటర్‌గా పని చేస్తూ ఉంది. అక్కడికి వచ్చి వెళ్లే ఒక కుర్రవాడితో స్నేహం కూడా ఉంది. ఇద్దరూ మంచివాళ్లే. ప్రేమలో ఉన్నారు. వయసులో ఉన్నారు. తెలుసుకోవాల్సిందేదో తెలుసుకోవాలనే ఆసక్తిలో ఉన్నారు. అమ్మాయి ఒప్పుకుంది. అతడు ఏర్పాట్లు చేశాడు. హోటల్ గది. ఇద్దరూ దగ్గర దగ్గరగా కూడి... కావలించుకుని... అంతలో తలుపు దడదడలాడింది. పెద్ద చప్పుడుతో ఊగిపోయింది. పోలీసులు. అమ్మాయి అబ్బాయి అదిరిపోయారు. ఒణికిపోయారు. ఏం చేయాలో గ్రహించే లోపు తలుపు బద్దలు కొట్టుకుంటూ పోలీసులు వచ్చేశారు. పట్టేసుకున్నారు. అబ్బాయి బెదిరిపోయి బాత్రూమ్లో దూరాడు. అమ్మాయిని ఇన్స్పెక్టర్ సెల్ఫోన్లోకి ఎక్కించేశాడు. తప్పులు ఏవైనా కావచ్చు. చట్టాలు ఎన్నైనా ఉండొచ్చు. కాని ఒక తప్పును నిరోధించడానికి ఎదుటివాళ్ల దగ్గర పైశాచిక శక్తి దుర్మార్గమైన పద్ధతి మాత్రం ఉండటానికి వీల్లేదు. కాని ఇక్కడ ఉంది. పోలీసులకు ఉంది. వాళ్లు తలుచుకుంటే ఎంత దూరమైనా పోగలరు. ఎంత ఘోరమైనా చేయగలరు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే? అబ్బాయి అంతకు మించి ఊహించలేకపోయాడు. బాత్రూమ్లో చేయి కోసేసుకున్నాడు. అంతకు కాసేపటి ముందు వరకూ ఎంతో సంతోషంగా గడిపిన అబ్బాయి... ఎంతో భవిష్యత్తు ఉండి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్న అబ్బాయి... ఇప్పుడు లేడు. చనిపోయాడు. కాశిలో ఒక చావు. బలవన్మరణం. ఎందరో అక్కడ చావు కోరుకుని వస్తారు. ఇక్కడ బతుకు కోరేవాడు చావును పొందాడు.కాశిలో ఎన్నో ఘాట్స్ ఉంటాయి. మృతదేహాలను దహనం చేసే ఘాట్స్. ఈ కుర్రాణ్ణి కూడా అలాంటి ఘాట్స్‌లో దహనం చేశారు. అంత తీరుబడి, శోకాన్ని అనుభవించేంత వెసులుబాటు ఏమీ ఉండవు. రోజూ వచ్చే అనేకానేక శవాల్లో ఇదీ ఒకటి. వాటి నడుమ దీనినీ వేసి తగులబెట్టాల్సిందే. ఆ అమ్మాయి దూరం నుంచి తన ప్రియుడి దహనకాండను చూసి వెను తిరుగుతుంది. కానీ అక్కడే మరో కథ మొదలవుతుంది. ఆ ఘాట్‌లోనే ఒక కుర్రాడుంటాడు. పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్లో ఉంటాడు. దళితుడు. శవాలను దహనం చేసే అతడి కుటుంబంలో తండ్రి, అన్న వృత్తిలో ఉంటే వారికి చేదోడువాదోడుగా ఉంటూ చదువుకుంటూ ఉంటాడు. ఘాట్‌లో శవాల రద్దీ ఉంటే ఇతడూ పొడవైన కట్టె పట్టుకుని మంటకు పైకి లేస్తున్న పుర్రె మీద అయినవారితో అయిదు దెబ్బలు కొట్టించే పని చేయాల్సిన వాడే. ఇతడికి ఒకమ్మాయి మీద మనసవుతుంది. ఇతడు వాడ అబ్బాయైతే ఆమె ఊరి అమ్మాయి. వైశ్యుల ఇంటిపిల్ల. కాని ప్రేమకు ఈ కులం మతం ఏముంటాయి. వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. ఆ అమ్మాయికి కవిత్వం ఇష్టం. మిర్జా గాలిబ్, బషీర్ బద్ ్రఅని ఏవేవో పేర్లు చెబుతుంటుంది. వాళ్లెవ్వరూ ఆ కుర్రాడికి తెలియదు. కాని ఆ కవిత్వం అంత స్వచ్ఛంగా నవ్వడం తెలుసు. అంత కన్నా స్వచ్ఛంగా ప్రేమించడం తెలుసు. మాది తక్కువ కులం. చండాలుల వృత్తిలో ఉన్న కులం. నన్ను నీవు స్వీకరించగలవా? ఆ కుర్రాడు అడిగాడు. ఇది సాధ్యం కాదు. ఒక వైశ్యుల ఇంటి అమ్మాయి ఒక చండాలుని భార్య ఎప్పటికీ కాబోదు. ఇందుకు ఆమె తల్లిదండ్రులు ఎన్నటికీ సమ్మతించబోరు. కాని ప్రేమకు ఒక నిమిత్తాలతో నిమిత్తం ఏముంది? ఎవరు ఏమైనా అననీ నేను నీతో వచ్చేస్తాను అంటుంది ఆ అమ్మాయి. ఆ నిర్ణయం విన్నాక ఆ రోజు రాత్రి ఆ కుర్రాడు హాయిగా ఆదమరిచి నిద్రపోతాడు. బహుశా తెల్లవారుజాము. ఘాట్‌కు చాలా శవాలు వస్తాయి. ఆ కుర్రాడి అన్నకు, తండ్రికి చేతికి మించిన పని. వచ్చి ఈ కుర్రాణ్ణి నిద్ర లేపి సాయానికి పిలుస్తారు. ఇన్ని శవాలా? ఒక్కో శవాన్ని అగ్ని ఆహుతి చేయడంలో నిమగ్నం అవుతాడు. ఒక శవం దగ్గర ఎందుకో అనుమానం వస్తుంది. ఆ చేతికి ఉన్న ఉంగరం ఎక్కడో చూసిన గుర్తు. అదిరిపడే గుండెలతో పైవస్త్రం తొలిగించి చూస్తాడు. అదే... ఆ అమ్మాయే. వైశ్యుల అమ్మాయి. తను ప్రేమించిన అమ్మాయి. బస్సు యాక్సిడెంట్ అయ్యి నదిలో పడిపోయిందట. ఒక్కరూ మిగల్లేదట. కుటుంబంతో పుణ్యక్షేత్రాల యాత్రకు బయలు దేరిన ఆ అమ్మాయి పాపం పుణ్యం ఎరగని ఆ కుర్రాడిని ఏకాకిని చేసి వెళ్లిపోయింది. ప్రేమకు స్త్రీలింగం పుంలింగం లేదు. శవం అనే మాటకు కూడా స్త్రీలింగం పుంలింగం లేదు. ఆ అమ్మాయి తను ప్రేమించినవాడి చేతిలోనే చితి మంటకు చితచితలాడుతూ అంతిమవీడ్కోలు తీసుకుంటుంది. సృష్టిని నువ్వు తప్పించలేవు. లయను కూడా.ఈ రెంటి మధ్య జీవితం మాత్రం నీదే. నడూ. పరిగెత్తు. కింద పడు. పైకి లెయ్. తప్పులు చెయ్. ప్రాయశ్చిత్తం పొందు. ప్రక్షాళనం చేసుకో. కాని బతుకు. ముందుకు సాగు. హోటల్లో ప్రియుడి చావుకు కారణమైన ఆ అమ్మాయి తాను చనిపోవాలనుకోదు. తనను హేళనగా, తిరుగుబోతుగా, బరితెగించినదానిగా చూస్తున్న సమాజానికి భయపడిపోవాలనుకోదు. జరిగిన తప్పును ఒక తప్పుగా స్వీకరిస్తుంది. అది ఇరువురు కలిసి చేసిన తప్పుగా భావిస్తుంది. నిరాశ వల్లో నిస్పృహ వల్లో కృశించకుండా ఇంకా ముందుకు ఎలా వెళ్లాలా ఆలోచిస్తుంది. యూనివర్సిటీకి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అంత వరకూ ఉద్యోగం చేయాలని కూడా అనుకుంటుంది. ఆమె తండ్రి కూడా జరిగిన దారుణానికి ఉరి పోసుకోడు. కూతురి గొంతు నులిమి చంపేయాలని అనుకోడు. ప్రేమిస్తాడు. ఆమె తప్పును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమెకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇదంతా అంత సులువైన పని కాదు. చావు కంటే కష్టమైన పనే. ఎన్నో అవమానాలు ఈసడింపులు... ఇద్దరూ పడతారు... కాని నిలబడతారు. బతుకును కొనసాగిస్తారు. తన ప్రియురాలిని కోల్పోయిన ఆ దళిత కుర్రాడు కూడా అంతే. మొదట పిచ్చివాడైపోతాడు. వెర్రివాడైపోతాడు. ఆమె జ్ఞాపకాలలో తనను తాను మర్చిపోతాడు. కాని మెల్లగా ఆ దు:ఖం నుంచి కోలుకొని ఉద్యోగంలో చేరి కొత్త జీవితాన్ని మొదలుపెడతాడు. కాశిలో ప్రాణశక్తి ఉంది. అవును. అక్కడ ప్రాణం పోసే శక్తే ఉంది. మసాన్- కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. రెండు కాన్స్ అవార్డులు పొందింది. తాజాగా విడుదలయ్యి దేశంలో అనేకమంది ప్రశంసలు పొందుతోంది. దర్శకుడు నీరజ్ ఘేవాన్ కొత్తవాడు. నటించినవాళ్లూ కొత్తవాళ్లే. కానీ అందులో కనిపించిన జీవితం మాత్రం సనాతనమైనది. సుపరిచితమైనది. మానవ రక్త సంచయంలో ఏదో ఒక పురాస్మృతిని తట్టి లేపేది. సినిమా మొదలు నుంచి దర్శకుడు గంగానది ప్రక్షాళనను ప్రస్తావిస్తుంటాడు. అయితే అంతకన్నా ముందు ప్రక్షాళనం కావలసినవి ఈ దేశంలో ఎన్నో ఉన్నాయని చెబుతాడు. కుల వ్యవస్థ ప్రక్షాళన, హోటల్లో దొరికిన అమ్మాయినీ అతడి తండ్రినీ మూడు లక్షలు ఇవ్వమని పీక్కు తీనే పోలీసు వ్యవస్థ వంటి పాలనా వ్యవస్థల ప్రక్షాళన, ఆ డబ్బు కోసం అంత మంచి తండ్రి కూడా ఒక అనాథ పిల్లవాణ్ణి నదిలో దూకే ఆటకు ప్రేరేపించి ఆ పిల్లవాణ్ణి చావు వరకూ తీసుకెళ్లడానికి వెనుదీయని మానవ బలహీనతల నుంచి ప్రక్షాళన, ఈ జన్మలో చేసిన తప్పులకు ఈ జన్మలోనే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి చేసే ప్రక్షాళన... ఇవన్నీ అవసరం అంటాడు. ఒక్క గుడి కూడా చూపించడు.కాని మానవ హృదయాలలోని గర్భగుడులలో ఉండే చీకటిని చూపిస్తాడు. మసాన్ అంటే- స్థానిక పలుకుబడిలో శ్మశానం అని అర్థం. అక్కడ ఇంత సుందరమైన బంతిపువ్వు పూయడమే ఇటీవలి విడ్డూరం. - ఖదీర్ -
మార్స్ ఆర్బిటార్ ప్రయోగం సక్సెస్
-
మౌంట్ షార్ప్ పర్వతపాదం చేరుకున్న క్యూరియాసిటీ
వాషింగ్టన్: అంగారకుడిపై గేల్‌క్రేటర్ ప్రాంతంలో రెండేళ్ల క్రితం దిగిన క్యూరియాసిటీ శోధక నౌక ఎట్టకేలకు తన తుది గమ్యానికి చేరువైంది. గేల్‌క్రేటర్ మధ్యలో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్‌షార్ప్ పర్వతం వద్దకు క్యూరియాసిటీ చేరుకుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. భౌగోళికంగా ప్రత్యేకమైన పర్వత పాదం వద్ద కొంత అన్వేషణ తర్వాత రోవర్ ఐదున్నర కిలోమీటర్ల ఎత్తైన పర్వతం పైకి చరిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించనుంది. గేల్‌క్రేటర్‌లో 2012 ఆగస్టులో దిగిన క్యూరియాసిటీ తన రెండేళ్ల ప్రయాణంలో మార్స్‌పై ఒకప్పటి నీటి ప్రవాహ జాడలను కనుగొనడంతో పాటు అక్కడి శిలలు, మట్టిని విశ్లేషించి ఖనిజలవణాల సమాచారాన్ని, అనేక ఫొటోలను భూమికి పంపిన సంగతి తెలిసిందే. -
అంతరిక్షం గురించి అప్డేట్స్..!
అంతరిక్ష పరిశోధనల గురించి, ఇతర గ్రహాల గురించి పరిశోధనలు కొత్త ఆసక్తులను రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో... నట్టింట్లో అంతరిక్షాన్ని ఆవిష్కరించవచ్చు. చూపుడు వేలితో నక్షత్రాలను టచ్ చేయవచ్చు. ఖగోళాన్ని ఒళ్లోకి తీసుకోవచ్చు. అందుబాటులోకి వచ్చిన సరికొత్త అప్లికేషన్లతో అనుక్షణం అప్డేట్స్ను అందుకోవచ్చు. అంతరిక్ష పరిశోధన సంస్థల సహకారంతో ఇవి సాకారం అవుతాయి. ఒకవైపు సోషల్నెట్వర్కింగ్ గురించి... దీనివల్ల ఉపయోగాలేమిటి? అనార్థలేమిటి? అని చర్చలు కొనసాగుతుండగానే... సోషల్సైట్లు తమ ప్రాధాన్యతను మరింత పెంచుకొంటున్నాయి. విశ్వం గురించి వివరాలు అందిస్తూ దూసుకెళ్తున్నాయి. టెక్ స్టూడెంట్స్, అంతరిక్ష పరి శోధనల గురించి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం కొన్ని సోషల్నెట్ వర్కింగ్ అకౌంట్లు అనుక్షణం నాలెడ్జ్‌ను అప్డేట్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని... నాసా నుంచి... అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) విశ్వానికి సంబంధించిన అబ్బురాలను ఇన్స్టాగ్రామ్, ఫ్లికర్ల ద్వారా షేర్ చేస్తోంది. తమ టెలిస్కోప్‌లకు చిక్కిన అద్భుతమైన అంతరిక్ష ఛాయాచిత్రాలను, వీడియోలతో కూడిన విశ్లేషణలను వీడియోషేరింగ్, ఫోటో షేరింగ్‌లకు అవకాశమున్న ఈ సోషల్నెట్వర్కింగ్ సైట్ల ద్వారా షేర్ చేస్తోంది నాసా. విశ్వాంతరాలపై ఆసక్తి ఉన్నవారు నాసా సోషల్నెట్వర్కింగ్ అకౌంట్లకు సబ్‌స్క్రైబ్ అయితే, నిరంతరం అప్డేట్స్ వస్తుంటాయి. రోవర్ ను ఫాలో అవ్వండి... అరుణగ్రహంలో జీవి జాడ గురించి, నీటి వనరుల గురించి శోధిస్తున్న ‘క్యూరియాసిటీ’రోవర్‌కు సొంత ట్విటర్ అకౌంట్ ఉంది. రోవర్ పరిశోధనల గురించి అప్డేట్స్ ఇందులో ఉంటాయి. ఈ అకౌంట్‌ను ఫాలో కావడం ద్వారా అరుణగ్రహ పరిశోధన ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసే ఫొటోలు ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తాయి. స్పేస్ ఎక్స్... అంతరిక్ష పరిశోధనలు సాగిస్తున్న ఒక ప్రైవేట్ సంస్థ ఇది. సిటిజన్స్‌ను ఇది స్పేస్టూర్లకు తీసుకెళ్తుంటుంది. అదంతా లక్షల డాలర్లతో ముడిపడిన వ్యవహారం. అందుకు బదులుగా వీడియోల రూపంలో అంతరిక్షం గురించి ఎన్నో అనుభవాలను అందిస్తోంది ఈ సంస్థ. ఫేస్‌బుక్‌లోనూ, యూట్యూబ్‌లోనూ స్పేస్ ఎక్స్ పేజ్‌లు, వీడియో చానళ్లు అందుబాటులో ఉన్నాయి. స్పేస్ క్రాఫ్ట్స్‌తో చేసిన విన్యాసాలు, అంతరిక్ష వివరాలు, ఆసక్తికరమైన ట్రివియా ఈ చానళ్లలో లభిస్తాయి. హబుల్ టెలీస్కోప్ అకౌంట్...అంతరిక్ష పరిశోధనల వివరాల పట్ల ఆసక్తి ఉన్న వారికి చిరపరిచితమైనది ‘హబుల్ టెలిస్కోప్’. విశ్వంలో ఈ టెలిస్కోప్ అన్వేషణలను ట్విటర్‌కు అనుసంధానించారు. హబుల్ టెలిస్కోప్ తీసే ఛాయాచిత్రాలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ఒక ట్విటర్ అకౌంట్‌ను ఏర్పాటుచేశారు. ఆర్బిటల్ సెన్సైస్... ఇది కూడా ఒక ప్రైవేట్ ఖగోళ పరిశోధన సంస్థ. తన పరిశోధన వివరాలను ఫేస్బుక్, ట్విటర్ల ద్వారా అందుబాటులో ఉంచడం ద్వారా విజ్ఞాన వారధిగా ఉంటోంది. నాసా అప్లికేషన్లెన్నో... ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పై విశ్వవిజ్ఞానాన్ని పంచడానికి ఎన్నో అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది నాసా. నాసా టెలివిజన్, ది నాసా ఆప్, త్రీడీ సన్, హబుల్ సైట్, నాసా స్పేస్ వెదర్ మీడియా వ్యూవర్, స్పేస్ షటిల్ క్రూ... వంటి అప్లికేషన్లను అందుబాటులో ఉంచింది. ఇవన్నీ ఐఫోన్, ఐప్యాడ్లపై పనిచేస్తాయి. -
జగన్ బెయిల్ తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ