కోకిలమ్మకు స్వార్థం ఎక్కువే!
ప్రపంచంలో మొత్తం 54 రకాల కోకిలలు ఉన్నాయి. ఐరోపాలో రెండు రకాలు మాత్రమే ఉంటాయి. మిగతావన్నీ ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో జీవిస్తున్నాయి!
వీటి ప్రధాన ఆహారం... గొంగళి పురుగులు. ఆకులు, పండ్లు కూడా తింటాయి కానీ, గొంగళిపురుగులను చాలా ఇష్టంగా తింటాయి!కాకికీ కోకిలకీ తేడా కనిపెట్టాలంటే వాటి ఈకలు చూడాలి. మగకోకిల మెడ నుంచి తల వరకు నలుపు కాకుండా నీలం, బూడిదరంగు కలిసినట్టుగా ఉంటుంది. కొన్ని ఆడవి కూడా ఇలానే ఉంటాయి కానీ... వాటికి ఛాతీ మీద ఈకల రంగు ముదురుగా ఉంటుంది. పిల్లలుగా ఉన్నప్పుడు కొన్ని ఎరుపు, బ్రౌన్ కలర్స్‌లో కూడా ఉంటాయి. కాకపోతే... బాగా దగ్గర్నుంచి చూస్తే తప్ప ఈ తేడాలను గమనించలేం!
వీటి రెక్కలు పొడవుగా, సూటిగా ఉంటాయి. ముక్కు కూడా సూటిగా ఉంటుంది. ఎగిరినప్పుడు గ్రద్దల మాదిరిగా కనిపిస్తాయివి!
మగ కోకిలలు పాడలేవు. కూ అన్న కూత పెట్టేది కేవలం ఆడకోయిలలే!
ఇవి గూళ్లు కట్టుకోవు. పిల్లల్ని పొదగవు. వేరే పక్షుల గూళ్లలో గుడ్లు పెడతాయి. పట్టుకు పది నుంచి 22 గుడ్లు పెడతాయి. అయితే అన్నీ ఒక గూటిలో పెట్టవు. వేర్వేరు చోట్ల పెడతాయి. ఆయా పక్షులన్నీ తమ గుడ్లతో పాటు తన గుడ్లను పొదుగుతున్నాయో లేదో గమనిస్తూ ఉంటాయి. వీటికి స్వార్థం ఎంత ఎక్కువంటే... గుడ్లు పిల్లలైన తరువాత మిగతా పక్షి పిల్లలను గూటి