
►నల్లూరి రుక్మిణి నవల ‘మేరువు’ ఆవిష్కరణ నవంబర్ 5న సాయంత్రం 5:30కు ద కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ మరియు అమరావతి, మొగల్రాజపురం, విజయవాడలో జరగనుంది. ఆవిష్కర్త: అల్లం రాజయ్య. నిర్వహణ: విప్లవ రచయితల సంఘం.
►యువకళావాహిని–గోపీచంద్ 2019 జాతీయ పురస్కారాన్ని ఓల్గాకు నవంబర్ 5న సాయంత్రం 6 గంటలకు సారథి స్టూడియోస్ ప్రీవ్యూ థియేటర్, అమీర్‌పేట, ►హైదరాబాద్‌లో ప్రదానం చేయనున్నారు. నందిని సిధారెడ్డి, సారిపల్లి కొండలరావు, ఆవుల మంజులత, కె.శివారెడ్డి, సి.మృణాళిని, త్రిపురనేని సాయిచంద్ పాల్గొంటారు.
►మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి 27వ వర్ధంతి సభ నవంబర్ 7న ఉదయం 10 గంటలకు శ్రీగౌతమి ప్రాంతీయ పరిశోధన గ్రంథాలయం, రాజమహేంద్రవరంలో జరగనుంది. వక్త: కనకదండి సూర్యనారాయణమూర్తి. నిర్వహణ: మధునాపంతుల ట్రస్టు.
► ఆదికవి నన్నయ భట్టారక జయంతి మహాసభ నవంబర్ 7న ఉదయం 11 గంటలకు శ్రీగౌతమి ప్రాంతీయ పరిశోధన గ్రంథాలయం, రాజమహేంద్రవరంలో జరగనుంది. వక్త: గొట్టుముక్కల సత్య వెంకట నరసింహశాస్త్రి. నిర్వహణ: శరన్మండలి.
►తెలంగాణ సాహిత్య అకాడమీ నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా నవంబర్ 8న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్‌లో బోయ జంగయ్య ‘జగడం’పై గోగు శ్యామల ప్రసంగిస్తారు.
► ‘2019–విమలాశాంతి సాహిత్య పురస్కారం’ను అద్దేపల్లి ప్రభు కథల సంపుటి ‘సీమేన్’కు ప్రకటించారు. డిసెంబరులో జరిపే సాహిత్య సభలో దీన్ని ప్రదానం చేస్తామని ట్రస్టు ఛైర్మన్ శాంతి నారాయణ తెలియజేస్తున్నారు.
►గతంలో సి.వి.కృష్ణారావు సమర్పణలో సాగిన నెలనెలా వెన్నెల కార్యక్రమాన్ని ఇకపై తెలంగాణ చైతన్య సాహితి కొనసాగించనుందని ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్ తెలియజేస్తున్నారు. మొదటి కార్యక్రమం నవంబర్ 9న (రెండో శనివారం) సాయంత్రం 5 గంటలకు ఎన్బీటీ హాల్, ఆంధ్ర మహిళా సభ, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదులో జరగనుంది.
►వెన్నెల సత్యం కవితా సంపుటి ‘బతుకుచెట్టు’ ఆవిష్కరణ నవంబర్ 10న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ హైస్కూల్, షాద్ నగర్, రంగారెడ్డి జిల్లాలో జరగనుంది. ఆవిష్కర్త: ఎన్.గోపి. నిర్వహణ: తెలంగాణ సాహితి, తెలుగు పూలతోట.
Comments
Please login to add a commentAdd a comment