దక్షిణ భారతదేశంలో మలై కాజా పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది నెల్లూరు. రాజకీయ నాయకులు, సినీతారలకు ఫ్యాన్స్ ఉంటారు. విచిత్రం ఏంటంటే, నెల్లూరు మలై కాజాకు రాజకీయనాయకులు, సినీతారలు ఫ్యాన్స్ అయిపోయారు. నగరంలోని మురళీకృష్ణ స్వీట్స్ దుకాణం 1970లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ దుకాణ యజమాని గోపాలకృష్ణయ్య మలై కాజాకు ప్రత్యేకత తీసుకొచ్చారు. నాణ్యత, రుచి కలిగిన మలై కాజాను తయారు చేస్తుండటంతో, నెల్లూరు నుంచి ప్రతిరోజూ సుమారు 300 కేజీల కాజాలు ఎగుమతి అవుతున్నాయి.
దుబాయ్, అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాలకు ఇవి నిత్యం ఎగుమతి అవుతుంటాయి. ఆయా దేశాల్లో ఉండే వారి స్నేహితులకు మలై కాజా తీసుకు వెళ్లేందుకు పార్శిల్స్ చేయించుకోవడం విశేషం. ప్రముఖ సినీ హీరోలు కొందరు నేటికీ మలై కాజాలు తెప్పించుకుంటున్నారు. కేజీ మలై కాజా విలువ రూ 300 నుంచి 360 రూపాయల వరకు ఉంటుంది. ఇటీవల సంక్రాంతి పండుగకు కొందరు ప్రముఖ నాయకులకు ప్రత్యేకంగా మురళీకృష్ణ స్వీట్స్ దుకాణం వారు మలై కాజాలు అందచేశారు. ఆన్‌లైన్‌లో కూడా మలై కాజాలకు గిరాకీ ఉంది.
– కొలగాని శ్రీనివాసులు, సాక్షి, నెల్లూరు సిటీ
20 ఏళ్ళుగా చేస్తున్నాను..
గత 20 ఏళ్లుగా మలై కాజా మాత్రమే తయారు చేస్తున్నాను. కోవా, మైదా, చక్కెర, జీరా, సోడా ఉప్పు, జాజికాయ, ఏలకులు, జాపత్రి వంటివి ఉపయోగించి మలై కాజా తయారుచేస్తాం. ప్రతి రోజూ 200 కేజీలు తయాచేస్తుంటాం.
– మహబూబ్ బాషా, తయారీదారుడు
Comments
Please login to add a commentAdd a comment