మండుటెండల్లో...మంచుకొండలు | Maybe ... avalanches | Sakshi
Sakshi News home page

మండుటెండల్లో...మంచుకొండలు

Published Thu, Apr 24 2014 11:47 PM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM

మండుటెండల్లో...మంచుకొండలు - Sakshi

మండుటెండల్లో...మంచుకొండలు

హార్స్‌లీ హిల్స్
 
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి విడిదిగా పేరొందిన పర్వత ప్రాంతం హార్స్‌లీ హిల్స్. తిరుపతికి 144 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని నాటి కడపజిల్లా కలెక్టర్ డబ్ల్యుడి హార్స్లీనివాసప్రాంతంగా నిర్ణయించుకున్నారు. ఆయన పేరు మీదుగానే ఈ ప్రాంతానికి హార్స్లీఅనే పేరు వచ్చింది. ఇక్కడి అడవులలో ఆకాశాన్నంటినట్టుండే వృక్షాలు, దట్టంగా అల్లుకుపోయిన పచ్చని పొదలు, అడవి జంతువుల మధ్య ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి వేసవి ఉష్ణోగ్రత 29 - 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మార్చ్ నుంచి జూన్ వరకు ఈ ప్రాంతం సందర్శనకు అనుకూలం.
 
ఇలా వెళ్లాలి:
హైదరాబాద్ నుంచి 556 కి.మీ, విజయవాడ నుంచి 525 కి.మీ, విశాఖపట్టణం నుంచి 891 కి.మీ దూరంలో ఉంది. దగ్గరలో బెంగళూరు విమానాశ్రయం ఉంది. చిత్తూరు, మదనపల్లిలలో రైల్వేస్టేషన్‌లు ఉన్నాయి. చిత్తూరు నుంచి రోడ్డు మార్గంలో 90 కి.మీ.
 
వసతి: గవర్నర్ బంగ్లా, చిత్తూరు కో ఆపరేటివ్‌సొసైటీ గెస్ట్ హౌజ్, ఫారెస్ట్ గెస్ట్ హౌజ్‌లు ఉన్నాయి. పున్నమి హోటల్ ఫోన్ నెం: 08571279, 279 324, సెల్ నెం. 9440272241
 
చూడదగినవి: దట్టమైన గుల్మొహర్, యూకలిప్టస్ చెట్లు, గంగోత్రి సరస్సు, రిషీ వ్యాలీ స్కూల్, లేపాక్షి దేవాలయం, కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం.. మొదలైనవి.
 
బడ్జెట్: రైలు, బస్సులలో వెళ్లిరావడానికి, ఒక రోజు ఉండటానికి ఒకరికి రూ.5,000/- నుంచి రూ.10,000/- లోపు ఖర్చు అవుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement