
మెహమూద్ ఇంటి ఉప్పు
అమితాబ్ బచ్చన్, కమెడియన్ మెహమూద్ ఇంట్లో చాలాకాలం ఆశ్రయం పొందాడని చాలామందికి తెలీదు. అమితాబ్ కెరీర్ తొలిరోజుల్లో మెహమూద్ అతడ్ని తన ఇంట్లో ఉంచుకున్నాడు. తను నిర్మాతగా తీసిన ‘బాంబే టు గోవా’ సినిమాలో హీరో అవకాశం ఇచ్చి పైకి రావడంలో సహకరించాడు.
అమితాబ్ స్టార్ అయ్యాక కూడా చెల్లెలు అతడ్ని సొంత సోదరుడిగా భావిస్తూ అతని బాగోగులు చూసేది. అంత క్లోజ్‌గా ఉన్న మెహమూద్, అమితాబ్ ఆ తర్వాత మాటలే లేని దూరాన్ని పాటించారు. ఇండస్ట్రీ అంటే అంతే!