ఎటు చూసినా ఇసుకమేటలే... పచ్చదనం జాడ కనుచూపుమేరలో లేదు... ఎవరికీ పట్టకుండా ఉండిపోయిన ఆ ఎడారిలో కాస్తంత ఫన్ పండిస్తే అదొక పర్యాటక క్షేత్రం అవుతుంది కదా అనుకొన్నాడొక కళాకారుడు. అయితే... అలా అనుకుని ఊరుకోలేదు. సాధించాడు కూడా! ఒక భిన్నమైన ఐడియాతో అతడు రూపొందించిన ఒక ‘హౌస్’ ఆ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చింది. అతను చేసిందల్లా ఏమీ లేదు... చాలా సింపుల్.
చెక్కలతో ఒక క్యాబిన్ నిర్మించాడు. వాటి మధ్యలో అద్దాలను పెట్టాడు. అంతే...ఆ అద్దాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ క్యాబిన్‌ను ఆసక్తికరమైన నిర్మాణంగా మార్చా యి. ఎడారి పరిసరాలు ఆ అద్దాలలో ప్రతిబింబిస్తుంటే... ఈ క్యాబిన్ ‘సీ త్రూ’ నిర్మాణమా? అనే అనుమానం వస్తుంది. తొలిసారి ఈ క్యాబిన్‌ను చూసిన వారికి ఆ అద్దాల్లో ప్రతిబింబం కనిపిస్తోందా? లేక క్యాబిన్ ఆవలనున్న నిర్మాణాలు కనిపిస్తున్నాయా? అనేది చెప్పడం కష్టం.
దీంతో ఈ మిర్రర్ హౌస్ మ్యాజిక్ హౌస్‌గా మారింది. దీనికి ఎడారి పరిసరాలు ఒక విధమైన కారణం అయితే... ఈ నిర్మాణాన్ని చేపట్టిన ఫిలిప్ స్మిత్ ఐడియా మరో కారణం. కాలిఫోర్నియాలోని ఒక ఎడారిలో దీన్ని నిర్మించారు. రాత్రిపూట ఈ క్యాబిన్ హౌస్‌లో లోపలి వైపు వేసిన లైట్లు మిరుమిట్లు గొలుపుతాయి. ఇది మరో ఆకర్షణ. ఈ విధంగా ఈ మిర్రర్ హౌస్ ఎడారికి పర్యాటక శోభను తీసుకువచ్చింది.
ఎడారిలో...అద్దాల మ్యాజిక్!
Published Thu, Dec 12 2013 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement
Advertisement