ట్రెడిషనల్ Qu... | Miss traditional comipition will conduct in port kalawaani stadium | Sakshi
Sakshi News home page

ట్రెడిషనల్ Qu...

Published Tue, May 5 2015 12:16 PM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM

Miss traditional comipition will conduct in port kalawaani stadium

అందానికి చిరునామా అతివ. అందులోనూ తెలుగమ్మాయి అంటే ఠక్కున గుర్తొచ్చేది చక్కని చీరకట్టు. అలా మన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ అమ్మాయిలు ర్యాంప్‌పై హొయలొలికించారు. మిస్ ట్రెడిషనల్ వైజాగ్ పోటీలకు వేదికైంది పోర్టు కళావాణి స్టేడియం.   

- టంగుటూరి యశోదకృష్ణ
 
మొన్న మిస్ వైజాగ్.. నిన్న మిసెస్ వైజాగ్.. ఇప్పుడు మిస్ ట్రెడిషనల్ వైజాగ్... ఇలా వరుస అందాల పోటీలతో విశాఖ కళకళలాడుతోంది. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో షోలను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. పోర్టు కళావాణి ఆడిటోరియంలో శనివారం రాత్రి నిర్వహించిన మిస్ ట్రెడిషనల్ వైజాగ్  ఫైనల్స్‌లో 19మంది యువతులు పాల్గొన్నారు. చిన్నారులు డ్యాన్సులతో, పాటలతో అలరించారు. అడ్వకేట్ మంజుల, లలితారెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. డ్రాలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. షో నిర్వహణ ద్వారా వచ్చిన మొత్తాన్ని హెచ్‌ఐవీతో బాధపడుతున్న చిన్నారులకు అందించడం మరో విశేషం.
 
సంస్కృతీ సంప్రదాయాలపై తనకున్న గౌరవాన్ని వివరించి జడ్జిలను మెప్పించింది విన్నర్ నికిత. ఎంఏ చేస్తున్నానని, మోడలింగ్‌పై ఆసక్తితో కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపింది. తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులే తన విజయానికి కారణమని చెబుతోంది.
 
గ్రాడ్యుయేషన్ చేస్తున్న మృదుల ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. గేమ్స్‌తో పాటు చిన్నప్పటి నుంచి ఇలాంటి కాంపిటీషన్స్‌లో పాల్గొనడం తనకు ఉపయోగపడిందని తెలిపింది. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన షో కావడంతో ఎక్కువమంది ప్రోత్సహించారని తెలిపింది.
 
సెకండ్ రన్నర్‌అప్‌గా నిలిచిన సుమన్ పట్నాయక్ పుట్టింది ఒడిశాలో అయినా పెరిగింది కోల్‌కతాలో. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా వైజాగ్‌లోనే సెటిల్ కావడం ఈ పోటీలో పాల్గొనగలిగానని చెప్పింది. సంప్రదాయం అనేది వేసుకునే దుస్తుల్లోనే కాకుండా పెంపకంలో కూడా ఉండాలని, అప్పుడే యువత వెళ్లే మార్గాలు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా సాగుతాయని చెప్పింది.

Advertisement

పోల్

Advertisement