Ramp Show
-
మియా బై తనిష్క్ ఫ్యాషన్ ర్యాంప్‌పై మహిళల తళుక్కులు..(ఫొటోలు)
-
సల్మాన్ గర్ల్ ఫ్రెండ్.. తొలిసారిగా.!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలతోనే కాదు లవ్ ఎఫైర్స్‌తో కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటూ ఉంటాడు. తను పాల్గొనే ప్రతి పబ్లిక్ ఫంక్షన్స్‌కు తన గర్ల్ ఫ్రెండ్స్‌ను వెంట తీసుకురావటం సల్మాన్‌కు అలవాటు. అందుకే ఆయన గర్ల్ ఫ్రెండ్స్‌కు కూడా మీడియాలో ఫుల్ పబ్లిసిటీ వచ్చేస్తోంది. సల్మాన్ గర్ల్ ఫ్రెండ్‌గా ఇండియన్ మీడియాకు సుపరిచితురాలైన రొమానియన్ మోడల్ లులియా వాంటుర్. తాజాగా ఈ ఇంగ్లీష్ మోడల్ ఇండియన్ ర్యాంప్ మీద వేడి పుట్టించింది. లాక్మీ ఫ్యాషన్ వీక్ 2017లో లులియా సందడి చేసింది. సమ్మర్ కలెక్షన్స్‌ను ర్యాంప్‌పై ప్రజెంట్ చేసిన ఈ బ్యూటి ఈవెంట్‌కే స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. బ్లాక్, గోల్డ్ కలర్స్‌తో డిజైన్ చేసిన డ్రస్ వేసుకొని తొలిసారిగా ఇండియన్ ర్యాంప్ దర్శనమిచ్చి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. -
ట్రెడిషనల్ Qu...
అందానికి చిరునామా అతివ. అందులోనూ తెలుగమ్మాయి అంటే ఠక్కున గుర్తొచ్చేది చక్కని చీరకట్టు. అలా మన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ అమ్మాయిలు ర్యాంప్‌పై హొయలొలికించారు. మిస్ ట్రెడిషనల్ వైజాగ్ పోటీలకు వేదికైంది పోర్టు కళావాణి స్టేడియం. - టంగుటూరి యశోదకృష్ణ మొన్న మిస్ వైజాగ్.. నిన్న మిసెస్ వైజాగ్.. ఇప్పుడు మిస్ ట్రెడిషనల్ వైజాగ్... ఇలా వరుస అందాల పోటీలతో విశాఖ కళకళలాడుతోంది. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో షోలను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. పోర్టు కళావాణి ఆడిటోరియంలో శనివారం రాత్రి నిర్వహించిన మిస్ ట్రెడిషనల్ వైజాగ్ ఫైనల్స్‌లో 19మంది యువతులు పాల్గొన్నారు. చిన్నారులు డ్యాన్సులతో, పాటలతో అలరించారు. అడ్వకేట్ మంజుల, లలితారెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. డ్రాలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. షో నిర్వహణ ద్వారా వచ్చిన మొత్తాన్ని హెచ్ఐవీతో బాధపడుతున్న చిన్నారులకు అందించడం మరో విశేషం. సంస్కృతీ సంప్రదాయాలపై తనకున్న గౌరవాన్ని వివరించి జడ్జిలను మెప్పించింది విన్నర్ నికిత. ఎంఏ చేస్తున్నానని, మోడలింగ్‌పై ఆసక్తితో కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపింది. తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులే తన విజయానికి కారణమని చెబుతోంది. గ్రాడ్యుయేషన్ చేస్తున్న మృదుల ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. గేమ్స్‌తో పాటు చిన్నప్పటి నుంచి ఇలాంటి కాంపిటీషన్స్‌లో పాల్గొనడం తనకు ఉపయోగపడిందని తెలిపింది. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన షో కావడంతో ఎక్కువమంది ప్రోత్సహించారని తెలిపింది. సెకండ్ రన్నర్అప్గా నిలిచిన సుమన్ పట్నాయక్ పుట్టింది ఒడిశాలో అయినా పెరిగింది కోల్‌కతాలో. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా వైజాగ్‌లోనే సెటిల్ కావడం ఈ పోటీలో పాల్గొనగలిగానని చెప్పింది. సంప్రదాయం అనేది వేసుకునే దుస్తుల్లోనే కాకుండా పెంపకంలో కూడా ఉండాలని, అప్పుడే యువత వెళ్లే మార్గాలు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా సాగుతాయని చెప్పింది. -
సయొనరా సందడి
-
వాక్ ఫర్ చారిటీ
-
ముంబైలోని ర్యాంప్ షోలో బాలీవుడ్ తారలు
అధితిరావు జూహీ చావ్లా సుస్మితా సేన్