ఫ్యాషన్
హైనెక్ వేసుకుంటే హైనెస్‌లా గొప్పగా ఉంటారు. మహారాణుల్లాగా ఉంటారు మీరూ ట్రై చేయండి..
పెళ్లిళ్ల సీజన్‌లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ చక్కర్లు కొడుతుంది. పట్టుచీరలు అనగానే బ్లౌజుపై మగ్గం వర్క్, మిర్రర్ వర్క్.. అంటూ రకరకాల ఎంబ్రాయిడరీలు గ్రాండ్‌గా హల్ చల్ చేస్తుంటాయి. అవేవీ లేకుండా సింపుల్‌గా హై నెక్‌తో ఇలా హైగా కనిపించవచ్చు.
ఒకటే ప్యాటర్న్
చీర రంగులోనే బ్లౌజ్ ప్యాటర్న్ ఉండేలా చూసుకోవాలి. దీనికి హై నెక్ పెట్టించాలి. చేతులకు అంచు వేయిస్తే చాలు. చెవులకు పెద్ద పెద్ద ఝుంకాలు, మెడలో ఒక చోకర్ హారం లేదంటే లాంగ్ హారం అదీ కాస్త వెడల్పుగా ఉండేది ధరిస్తే చాలు మహారాణి కళ వచ్చేస్తుంది.
పూర్తి కాంట్రాస్ట్
చీరకు పూర్తి కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని హై నెక్‌తో డిజైన్ చేయించుకుంటే చాలు. వేరే ఎంబ్రాయిడరీ అవసరమే లేదు. చెవులకు పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ లేదా బుట్టలు పెట్టేస్తే మెడలో ఏం ధరించకపోయినా గ్రేస్‌గా కనిపిస్తారు.
ఎరుపు రంగు
గంధం రంగు చీరలకు ఎరుపు రంగు బెనారస్ క్లాత్ లేదా రా సిల్క్ క్లాత్‌తో డిజైన్ చేసిన హైనెక్ బ్లౌజ్ వేసుకుంటే చాలు. మెడలో గ్రాండ్‌గా కనిపించే టెంపుల్ జువెల్రీ అలాగే చెవులకు పెద్ద పెద్ద బుట్టాలు అలంకరించుకుంటే వివాహ వేడుకలో గ్రాండ్‌గా వెలిగిపోతారు.
ఎంబ్రాయిడరీ
బ్లౌజ్ ప్లెయిన్‌గా ఉంటే ఏం బాగుంటుంది అంటారా! నిజమే ప్లెయిన్ పట్టు చీరల మీదకు ఎంత కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ధరిస్తే అంత గ్రాండ్‌గా కనిపించకపోవచ్చు. అందుకని నెక్ ప్లేస్‌గా వెడల్పాటి హారం అమరినట్టుగా ఉండే వర్క్ చేయిస్తే సూపర్బ్‌గా కనిపిస్తారు.
ప్రింటెడ్ ఫ్యాబ్రిక్
పట్టు చీర అంచు రంగులో గ్రాండ్‌గా కనిపించేందుకు బెనారస్ పట్టు ఫ్యాబ్రిక్ బాగుంటుంది. అలాగే కలంకారీ ఫ్యాబ్రిక్ బాగా నప్పుతాయి.
ఆభరణాల అలంకరణ
హైనెక్ బ్లౌజ్‌లతో ధరిస్తే సింపుల్ లుక్ అనిపిస్తూ హై ఫై ఫ్యాషన్ జాబితాలో ఉన్నారన్న కితాబు పొందవచ్చు. హై నెక్ వల్ల ఆభరణాల అలంకరణ అవసరం ఉండదు. నేటి తరం అమ్మాయిలు కోరుకునే గొప్ప స్టైల్‌గా హై నెక్‌బ్లౌజ్ నిలిచిపోయింది.
- నిర్వహణ ఎన్.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment