
ఓవర్ డోస్ యాంటీబయాటిక్స్‌తో.. పెద్దపేగు క్యాన్సర్!
పరిపరిశోధన
డాక్టర్ సలహా లేకుండా మీ అంతట మీరే చాలా దీర్ఘకాలం పాటు యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారా? దాదాపు రెండు వారాలకు పైగా యాంటీబయాటిక్స్ వదలకుండా వాడేవారిలో పెద్దపేగు వృద్ధి చెంది అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మిగతా ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోలిస్తే ఇలా 15 రోజులకు పైగా యాంటీబయాటిక్స్ తీసుకునేవారిలో ఇలా పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం 73 శాతం అధికంగా ఉందంటున్నారు అధ్యయనవేత్తలు. అరవై ఏళ్లకు పైబడ్డ దాదాపు 16,000 మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ మాంఛెస్ట్‌ర్‌కు చెందిన ఇమ్యునాలజీ నిపుణులు డాక్టర్ షీనా క్య్రూక్‌షాంక్ వెల్లడిస్తూ... ‘‘కొన్ని వ్యాధులు తగ్గడానికి యాంటీబయాటిక్స్ తీసుకోవడం అవసరమే. అయితే దీన్ని చాలా విచక్షణతో వాడాలి. అందుకే డాక్టర్ సలహా మేరకు తగిన ప్రిస్క్రిప్షన్‌తోనే దీన్ని కొనాలి. డాక్టర్ సలహా లేకుండా ఆన్‌కౌంటర్ మందుగా యాంటీబయాటిక్స్ వాడటం తగదు’’ అంటారు డాక్టర్ షీనా.