జగమొండి సేనాని
అమెరికన్ సైన్యానికి డగ్లస్ మెక్ అర్థర్ అనే జగమొండి సేనాని ఉండేవాడు. ఇతగాడు ఎంతటి మొండిఘటం అంటే, సర్వసైన్యాదిపతి అధ్యక్షుడి ఆదేశాలను సైతం బేఖాతరు చేసేటంత! ఫిలిప్పీన్స్‌లోని అమెరికన్ బలగాలకు ఫీల్డ్ మార్షల్‌గా, అమెరికన్ ఆర్మీ జనరల్‌గా ఫైవ్‌స్టార్ హోదా పొందిన అర్థర్ మహాశయుడు తనది అధ్యక్షుడి కంటే పైస్థాయి అనుకునేవాడు. హెర్బర్ట్ హూవర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు వాషింగ్టన్ నగరంలో ఒక కాలనీని నిర్మించుకున్నారు.
అయితే, అధ్యక్షుడి ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా అర్థర్ దొరవారు ఆ కాలనీని నేలమట్టం చేసి పారేశాడు. హ్యారీ ట్రూమన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడైతే, అర్థర్ దొరవారు మరీ దూకుడు ప్రదర్శించాడు. ‘అణు’దాడి ప్రచారంతో కొరియాకు, చైనాకు యుద్ధం తెచ్చిపట్టే ప్రయత్నాలు చేశాడు. అదే గనుక జరిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని భయపడ్డ ట్రూమన్... సొంత అభిప్రాయాలను సైన్యంపై రుద్దవద్దంటూ జనరల్ అర్థర్‌ను హెచ్చరించాడు.
సాదాసీదా సేనానులైతే, సర్వసైన్యాధ్యక్షుడైన అధ్యక్షుడి మాటకు ఎదురు చెప్పేవారు కాదు. కానీ, అర్థర్ దొరవారు అలా కాదు కదా! తన అభిప్రాయాన్ని, దానిపై అధ్యక్షుడి హెచ్చరికను బట్టబయలు చేశాడు. ఈ విషయంపై అప్పటి విపక్షమైన రిపబ్లికన్ పార్టీ ద్వారా అమెరికన్ కాంగ్రెస్‌లో చర్చ లేవనెత్తి రచ్చ రచ్చ చేశాడు. ఈ తలబిరుసుతనం భరించలేక అధ్యక్షుడు ట్రూమన్ ఇతగాడికి 1964లో బలవంతంగా పదవీ విరమణ ఇచ్చేశాడు. అయితే, పదవీ విరమణ సందర్భంగా అమెరికన్ కాంగ్రెస్‌లోని ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన ఏకైక జనరల్‌గా డగ్లస్ మెక్ అర్థర్ చరిత్రలో నిలిచిపోయాడు.
పీచేముడ్