persistently
-
థైరోకేర్- పెర్సిస్టెంట్ సిస్టమ్స్.. దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ పనితీరును చూపనుందన్న అంచనాలతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ థైరోకేర్ టెక్నాలజీస్‌కు డిమాండ్ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పతన మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు ఇలా.. థైరోకేర్ టెక్నాలజీస్ ఈ ఏడాది క్యూ2 ఫలితాలపై అంచనాలు పెరగడంతో డయాగ్నోస్టిక్ సేవల కంపెనీ థైరోకేర్ టెక్నాలజీస్ కౌంటర్ జోరు చూపుతోంది. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 1,165కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 6.6 శాతం జంప్‌చేసి రూ. 1,129 వద్ద ట్రేడవుతోంది. క్యూ2 ఫలితాల విడుదలకు వీలుగా బుధవారం(28న) బోర్డు సమావేశంకానున్నట్లు థైరోకేర్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఇదేవిధంగా వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ చెల్లించే అంశంపైనా బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. గత నెల రోజుల్లో థైరోకేర్ టెక్నాలజీస్ షేరు 50 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇందుకు క్యూ1లో సాధించిన పటిష్ట ఫలితాలు దోహదపడినట్లు నిపుణులు చెబుతున్నారు. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ ఏడాది క్యూ2లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతంపైగా ఎగసి రూ. 102 కోట్లకు చేరినట్లు పెర్సిస్టెంట్ సిస్టమ్స్ పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం 1.7 శాతం పుంజుకుని రూ. 1008 కోట్లను తాకింది. ఇబిటా 13 శాతం బలపడి రూ. 166 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 1,220ను తాకింది. ప్రస్తుతం 2.4 శాతం లాభంతో రూ. 1,200 వద్ద ట్రేడవుతోంది. -
నిలకడగా కరోనా బాధితుని ఆరోగ్యం..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న మహేంద్రహిల్స్‌కు చెందిన యువకుడి (24) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. బాధితుడు న్యుమోనియోతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. మరో ఏడుగురు అనుమానితుల మెడికల్ రిపోర్టులు మంగళవారం వచ్చాయి. వీరిందరికీ నెగిటివ్ అని తేలింది. తాజాగా గాంధీ ఆస్పత్రిలో మరో 45 మంది అనుమానితుల నుంచి నమానాలు సేకరించారు. వీరిలో 12 మందిని ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేసి, మిగిలినవారిని హోం ఐసోలేషన్‌కు సిఫార్సు చేశారు. వీరి రిపోర్టులు బుధవారం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కోవిడ్ అనుమానిత లక్షణాలతో ఓ వ్యక్తి నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో చేరారు. నెదర్లాండ్‌కు చెందిన ఆ వ్యక్తి(45) దుబాయ్ మీదుగా హైదరాబాద్ కోకాపేటకు వచ్చారు. ఆయనకు జ్వరం రావడంతో చికిత్సం కోసం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి వెళ్లగా.. కోవిడ్ అనుమానంతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో ఆయన మంగళవారం ఫీవర్ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు ఆయన్ను ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేసుకుని, నమూనాలు సేకరించి, వ్యాధినిర్ధారణ పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి పంపించారు. -
జగమొండి సేనాని
అమెరికన్ సైన్యానికి డగ్లస్ మెక్ అర్థర్ అనే జగమొండి సేనాని ఉండేవాడు. ఇతగాడు ఎంతటి మొండిఘటం అంటే, సర్వసైన్యాదిపతి అధ్యక్షుడి ఆదేశాలను సైతం బేఖాతరు చేసేటంత! ఫిలిప్పీన్స్‌లోని అమెరికన్ బలగాలకు ఫీల్డ్ మార్షల్‌గా, అమెరికన్ ఆర్మీ జనరల్‌గా ఫైవ్‌స్టార్ హోదా పొందిన అర్థర్ మహాశయుడు తనది అధ్యక్షుడి కంటే పైస్థాయి అనుకునేవాడు. హెర్బర్ట్ హూవర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు వాషింగ్టన్ నగరంలో ఒక కాలనీని నిర్మించుకున్నారు. అయితే, అధ్యక్షుడి ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా అర్థర్ దొరవారు ఆ కాలనీని నేలమట్టం చేసి పారేశాడు. హ్యారీ ట్రూమన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడైతే, అర్థర్ దొరవారు మరీ దూకుడు ప్రదర్శించాడు. ‘అణు’దాడి ప్రచారంతో కొరియాకు, చైనాకు యుద్ధం తెచ్చిపట్టే ప్రయత్నాలు చేశాడు. అదే గనుక జరిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని భయపడ్డ ట్రూమన్... సొంత అభిప్రాయాలను సైన్యంపై రుద్దవద్దంటూ జనరల్ అర్థర్‌ను హెచ్చరించాడు. సాదాసీదా సేనానులైతే, సర్వసైన్యాధ్యక్షుడైన అధ్యక్షుడి మాటకు ఎదురు చెప్పేవారు కాదు. కానీ, అర్థర్ దొరవారు అలా కాదు కదా! తన అభిప్రాయాన్ని, దానిపై అధ్యక్షుడి హెచ్చరికను బట్టబయలు చేశాడు. ఈ విషయంపై అప్పటి విపక్షమైన రిపబ్లికన్ పార్టీ ద్వారా అమెరికన్ కాంగ్రెస్‌లో చర్చ లేవనెత్తి రచ్చ రచ్చ చేశాడు. ఈ తలబిరుసుతనం భరించలేక అధ్యక్షుడు ట్రూమన్ ఇతగాడికి 1964లో బలవంతంగా పదవీ విరమణ ఇచ్చేశాడు. అయితే, పదవీ విరమణ సందర్భంగా అమెరికన్ కాంగ్రెస్‌లోని ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన ఏకైక జనరల్‌గా డగ్లస్ మెక్ అర్థర్ చరిత్రలో నిలిచిపోయాడు. పీచేముడ్