ఆస్తమాకు పేదరికం తోడైతే... అగ్నికి ఆజ్యమే!
పరిపరిశోధన
సాధారణ రోగుల్లో కంటే... పట్టణ ప్రాంతాల్లోని పేద పిల్లల్లో వచ్చే ఆస్తమా మరింత తీవ్రంగా ఉంటుందని ఇటీవలి తాజా అధ్యయనాల్లో తేలింది. పట్టణాలలో అల్పాదాయ వర్గాల వాళ్లు ఫ్యాక్టరీలకు సమీపంలోనే ఎక్కువగా నివసిస్తుంటారు. వాటి నుంచి వెలువడే కాలుష్యం పిల్లలను తీవ్రంగా బాధిస్తుంటుంది.
పైగా పేదరికం కారణంగా పిల్లలకు సరైన చికిత్స అందకపోవడం వల్ల ఆస్తమా పేట్రేగిపోతోందని ప్రతిష్ఠాత్మకమైన జాన్ హాప్‌కిన్స్ సంస్థ అధ్యయనాల్లో తేలింది. పట్టణాలలో స్థోమత కలిగిన ప్రాంతాల రోగులతో పోలిస్తే... పేదరికం అధికంగా ఉన్న చోట్ల ఆస్తమా రోగులు ఎక్కువ, మరణాలూ ఎక్కువే. ఈ అధ్యయన ఫలితాలు ‘ద జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యూనాలజీ’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.