గీత స్మరణం | Pooja velayera ...song from Bhakta Tukaram | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Tue, Aug 20 2013 11:58 PM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM

గీత స్మరణం

గీత స్మరణం

 పల్లవి :


 ఆమె: పూజకు వేళాయెరా...
 రంగపూజకు వేళాయెరా... ఆ...
 పూజకు వేళాయెరా...
 ఇన్నినాళ్లు నేనెటుల వేచితినో
 ఎన్ని రేలు ఎంతెంత వేగితినో
 ॥
 పిలుపును విని విచ్చేసితివని
 నా పిలుపును విని విచ్చేసితివని
 వలపులన్నీ నీ కొరకె దాచితిని     (2)
 ఎవరూ పొందని ఏకాంతసేవలో
 ఈవేళ తమిదీరగా నిన్నె అలరించు
       ॥
 
 చరణం :


 ఆ: ఈ నీలినీలి ముంగురులు... ఇంద్రనీలాల మంజరులు
 ఈ వికసిత సిత నయనాలు... శతదళ కోమల కమలాలు
 అరుణారుణమీ అధరము... తరుణమందార పల్లవము
 ఎదలో పొంగిన ఈ రమణీయ పయోధరాలు
 పాలకడలిలో ఉదయించు సుధాకలశాలు...
 ఎంత సుందర ము శిల్ప బంధురము
 ఈ... జఘన మండలము
 సృష్టినంతటిని దాచుకున్న ఆ పృథివీ మండలము
 అతడు: ఓ... అభినవ సౌందర్యరాశీ
 ఓ... అపూర్వ చాతుర్యమూర్తీ
 నీ కటాక్షముల లాలనమ్ములో...
 నీ మధురాధర చుంబనమ్ములో...
 ॥కటాక్షముల॥
 
 మధురిమలెన్నో పొదుగుకున్న
 నీ స్తన్య సుధల ఆస్వాదనమ్ములో
 అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో
 హాయిగా నిదురించ గలిగే
   పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే
   లేదాయె తల్లీ తల్లీ తల్లీ...
 ఆ: స్వామీ అ: అవునమ్మా నీవు ప్రదర్శించిన
   సౌందర్యం అనిత్యం
 నీవు నమ్ముకున్న యవ్వనం అశాశ్వతం
 దువ్వుకున్న ఆ నీలిముంగురులె దూదిపింజలై పోవునులే
 నవ్వుతున్న ఆ కంటి వెలుగులే దివ్వెల పోలిక ఆరునులే
 వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే వాడి వక్కలై పోవునులే
 పాలుపొంగు ఆ కలశాలే తోలుతిత్తులై పోవునులే
 నడుము వంగగా నీ ఒడలు కుంగగా
 నడుము వంగగా ఒడలు కుంగగా
 నడువలేని నీ బడుగు జీవితం... వడవడ వణకునులే
 ఆశలు రేపే సుందర దేహము అస్థిపంజరంబౌనులే
 
 చిత్రం : భక్త తుకారాం (1973)
  రచన : డా॥సి.నారాయణరెడ్డి
 సంగీతం : పి.ఆదినారాయణరావు, గానం : ఘంటసాల, పి.సుశీల

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement