
సర్ కట్టమంచి రామలింగారెడ్డి గొప్ప విద్యావేత్త, సాహితీవేత్త. ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవస్థాపక అధ్యక్షులు. చమత్కార సంభాషణా ప్రియులు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు సెనేట్ సభ్యుల్లో పి.కమలమ్మ అనే యువతి ఉండేవారు. ఆమె సమావేశాల్లో చాలా పరుషంగా, కటువుగా మాట్లాడేవారు. అయితే ఆమెకు పెళ్లి కావడంతో ఇంటిపేరు ‘బి’గా మారింది. అదే సమయంలో ఆమె మాట కూడా కొంత మృదువుగా మారింది. సిఆర్ రెడ్డి గారు శ్లేష చమత్కారంతో పరుషంగా ఉన్న పి.కమలమ్మ పెళ్లి కావడంతో సరళంగా (బి.కమలమ్మ) మారారని చమత్కరించారు. దానికి కమలమ్మ సహా అందరూ నవ్వుకున్నారు.-డాక్టర్ పి.వి.సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment