
‘షాక్’లతోఅందాల రాశి
బొద్దుగా ఉన్నా తీరైన ఫిజిక్‌తో ఆకట్టుకునే రాశిఖన్నా గత కొంతకాలంగా హైదరాబాద్‌కు చెందిన సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ కులదీప్ సేథీ ఆధ్వర్యంలో వర్కవుట్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో రాశి వర్కవుట్ విశేషాలను ట్రైనర్ కులదీప్ ఇలా వివరించారు.
ప్రస్తుతం రాశి ఖన్నాది బిజి షెడ్యూల్. అయినప్పటికీ రోజులో ఒక గంట వర్కవుట్స్‌కి కేటాయిస్తుంది. అది కూడా చాలా రెగ్యులర్‌గా చేస్తుంది. ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ కుదరకపోయినా మధ్యాహ్నం టైమ్‌లో కూడా చేస్తుంది. వీలునిబట్టి వర్కవుట్ టైమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటుంది.
కాంబినేషన్... ఆమెకి కరెక్ట్
రాశిఖన్నా శరీరతత్వం చాలా విభిన్నం. తనకి మజిల్ మాస్ ఎక్కువ. కాబట్టి తన శరీరాన్ని తీర్చిదిద్దే క్రమంలో ఓన్లీ వెయిట్ ట్రైనింగ్ చేయిస్తే అది మరింత మజిల్‌మాస్‌కి కారణమవుతుంది.. అందుకని ఒక వారం ఫంక్షనల్ ట్రైనింగ్, ఒక వారం హై ఇంటెన్సిటీ వర్కవుట్, ఒక వారం వెయిట్ ట్రైనింగ్ ఇలా విభజించి చేయిస్తాను. సన్నగా మాత్రమే కాదు మంచి టోనింగ్ బాడీతో కనపడడం ఆమె లక్ష్యం. ఆమె దేహం స్పందిస్తున్న తీరు, ఆమె వర్క్ షెడ్యూల్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేస్తాను.
వ్యాయామ శైలులను తరచు మార్చడం ద్వారా ఆమె దేహానికి షాక్స్ ఇస్తాను. షూటింగ్స్ కారణంగా తను ఊర్లో లేకపోయినా సరే వాట్సప్ ద్వారా తన వర్కవుట్ రొటీన్‌ని గైడ్ చేస్తుంటాను. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ జిమ్ ఫొటోలు పంపుతుంది. వాటిని పరిశీలించి నేను దాని ప్రకారం ఆమెకి గైడ్ చేస్తాను. ఒకవేళ ఎక్కడైనా సరైన జిమ్ అక్విప్‌మెంట్ అందుబాటులో లేకపోతే స్పాట్ జంపింగ్, రన్నింగ్, యాబ్స్, ఫ్రీ స్వ్వాట్స్, ప్లాంక్స్ వంటివి, పలు రకాల ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లు, బాడీవెయిట్‌తో చేసే వ్యాయామాలు చేయిస్తాను.
అయిదుసార్లు... ఆహారం
ఆమె న్యూట్రిషన్ షెడ్యూల్‌ని కూడా చాలా క్లోజ్‌గా ఫాలో చేస్తాను. ఆమె డైట్ రొటీన్‌లో భాగంగా రోజుకు నాలుగు నుంచి 5 సార్లు ఆహారం తీసుకుంటుంది. అమెరికాలో ఉంటే ఒకలా, చెన్నైలో ఉంటే ఒకలా ఆమె ఉన్న ప్రాంతాన్ని బట్టి అక్కడ దొరికే ఫుడ్ ఏమిటి? ఎలా తీసుకోవాలో కూడా చెబుతాను. ఒక సినీ స్టార్‌గా ఉన్న తను గ్లామరస్‌గా, ఫ్రెష్‌గా స్క్రీన్ మీద కననపడాలి. అందుకని యాంటి ఆక్సిడెంట్స్ సూచిస్తాను. ఫిష్, ఎగ్స్ లాంటి లైట్ ప్రొటీన్, స్వల్పంగా కార్బొహైడ్రేట్స్, బాగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఆమె డైట్‌లో ఉంటాయి. అలాగే మంచీనీళ్లు కూడా బాగా తీసుకుంటుంది. పూర్తిగా కార్బ్స్ దూరంగా పెట్టదు. ఎందుకంటే ప్రొటీన్స్‌తో పాటు కార్బొహైడ్రేట్స్ కూడా ఎనర్జీకి అవసరం అని నేను చెబుతుంటాను. - ట్రైనర్ కులదీప్