shocks
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ చార్జీల పిడుగు. ఏకంగా 11వేల కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీల భారం మోపే చాన్స్
-
నాజూగ్గా ప్రియాంక చోప్రా, స్టైయిలిష్ లుకికి ఫ్యాన్స్ ఫిదా (ఫొటోలు)
-
పవన్ కళ్యాణ్, ప్రభాస్ లకు షాక్!?
న్యూఢిల్లీ: ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్ అధికారికంగా ప్రకటించిన సినీ, క్రీడారంగ తదితర రంగ ప్రముఖులతో కూడిన 2016 , టాప్ 100 జాబితాలో తెలుగు సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిందా? దేశంలో రెండవ అతిపెద్ద పరిశ్రమగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు అన్యాయం చేసిందా? టాప్ 100 లిస్ట్ లో కేవలం నలుగురికి మాత్రమే చోటు కల్పించి తెలుగు సినీ అభిమానులను నిరాశలో ముంచిందా? శుక్రవారం వెల్లడించిన తాజా జాబితాపై ఇవే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు తెలుగుపరిశ్రమకు, తెలుగు స్టార్ హీరోలకు అన్యాయం జరిగిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్ టీఆర్, రామ్ చరణ్ మాత్రమే ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో స్థానం సంపాదించారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ ల పేర్లు ఆ జాబితాలో కనిపించకపోవడంపై సినీ పండితుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఫోర్బ్స్ అందించిన సమాచారం ప్రకారం ఆదాయం, కీర్తి, గూగుల్ ర్యాంకింగ్స్ , పత్రికల కవర్ పేజీ లాంటి ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రముఖులను ఎంపిక చేస్తారు. అయితే ముఖ్యంగా ఆదాయంలో గానీ, రాజకీయాల్లో గానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ లో గానీ కీలకంగా ఉన్న పవర్ స్టార్, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ , మరో ముఖ్యమైన హీరో, బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ ఖ్యాతి గడించిన ప్రభాస్ కు ఫోర్బ్స్ టాప్ 100 జాబితాలో చోటు దక్కకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఈ ఇరువురు సాధించిన నేమ్ అండ్ ఫేమ్ సరిపోలేదా అనే అనుమానాలను వ్యక్తం చేశారు. అటు టాలీవుడ్ జక్కన్న గా పేరు గడించిన బాహుబలి దర్శకుడు రాజమౌళికి 100 జాబితాలో ప్లేస్ దక్కక పోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
‘షాక్’లతోఅందాల రాశి
బొద్దుగా ఉన్నా తీరైన ఫిజిక్‌తో ఆకట్టుకునే రాశిఖన్నా గత కొంతకాలంగా హైదరాబాద్‌కు చెందిన సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ కులదీప్ సేథీ ఆధ్వర్యంలో వర్కవుట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రాశి వర్కవుట్ విశేషాలను ట్రైనర్ కులదీప్ ఇలా వివరించారు. ప్రస్తుతం రాశి ఖన్నాది బిజి షెడ్యూల్. అయినప్పటికీ రోజులో ఒక గంట వర్కవుట్స్‌కి కేటాయిస్తుంది. అది కూడా చాలా రెగ్యులర్‌గా చేస్తుంది. ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ కుదరకపోయినా మధ్యాహ్నం టైమ్‌లో కూడా చేస్తుంది. వీలునిబట్టి వర్కవుట్ టైమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటుంది. కాంబినేషన్... ఆమెకి కరెక్ట్ రాశిఖన్నా శరీరతత్వం చాలా విభిన్నం. తనకి మజిల్ మాస్ ఎక్కువ. కాబట్టి తన శరీరాన్ని తీర్చిదిద్దే క్రమంలో ఓన్లీ వెయిట్ ట్రైనింగ్ చేయిస్తే అది మరింత మజిల్మాస్కి కారణమవుతుంది.. అందుకని ఒక వారం ఫంక్షనల్ ట్రైనింగ్, ఒక వారం హై ఇంటెన్సిటీ వర్కవుట్, ఒక వారం వెయిట్ ట్రైనింగ్ ఇలా విభజించి చేయిస్తాను. సన్నగా మాత్రమే కాదు మంచి టోనింగ్ బాడీతో కనపడడం ఆమె లక్ష్యం. ఆమె దేహం స్పందిస్తున్న తీరు, ఆమె వర్క్ షెడ్యూల్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేస్తాను. వ్యాయామ శైలులను తరచు మార్చడం ద్వారా ఆమె దేహానికి షాక్స్ ఇస్తాను. షూటింగ్స్ కారణంగా తను ఊర్లో లేకపోయినా సరే వాట్సప్ ద్వారా తన వర్కవుట్ రొటీన్‌ని గైడ్ చేస్తుంటాను. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ జిమ్ ఫొటోలు పంపుతుంది. వాటిని పరిశీలించి నేను దాని ప్రకారం ఆమెకి గైడ్ చేస్తాను. ఒకవేళ ఎక్కడైనా సరైన జిమ్ అక్విప్‌మెంట్ అందుబాటులో లేకపోతే స్పాట్ జంపింగ్, రన్నింగ్, యాబ్స్, ఫ్రీ స్వ్వాట్స్, ప్లాంక్స్ వంటివి, పలు రకాల ఫ్లోర్ ఎక్సర్సైజ్లు, బాడీవెయిట్తో చేసే వ్యాయామాలు చేయిస్తాను. అయిదుసార్లు... ఆహారం ఆమె న్యూట్రిషన్ షెడ్యూల్‌ని కూడా చాలా క్లోజ్‌గా ఫాలో చేస్తాను. ఆమె డైట్ రొటీన్లో భాగంగా రోజుకు నాలుగు నుంచి 5 సార్లు ఆహారం తీసుకుంటుంది. అమెరికాలో ఉంటే ఒకలా, చెన్నైలో ఉంటే ఒకలా ఆమె ఉన్న ప్రాంతాన్ని బట్టి అక్కడ దొరికే ఫుడ్ ఏమిటి? ఎలా తీసుకోవాలో కూడా చెబుతాను. ఒక సినీ స్టార్‌గా ఉన్న తను గ్లామరస్‌గా, ఫ్రెష్‌గా స్క్రీన్ మీద కననపడాలి. అందుకని యాంటి ఆక్సిడెంట్స్ సూచిస్తాను. ఫిష్, ఎగ్స్ లాంటి లైట్ ప్రొటీన్, స్వల్పంగా కార్బొహైడ్రేట్స్, బాగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఆమె డైట్లో ఉంటాయి. అలాగే మంచీనీళ్లు కూడా బాగా తీసుకుంటుంది. పూర్తిగా కార్బ్స్ దూరంగా పెట్టదు. ఎందుకంటే ప్రొటీన్స్తో పాటు కార్బొహైడ్రేట్స్ కూడా ఎనర్జీకి అవసరం అని నేను చెబుతుంటాను. - ట్రైనర్ కులదీప్ -
వల్డ్ నెంబర్ వన్ జొకోవిచ్ ఔట్
-
ముహూర్తం ముంచుకొస్తున్నా మీనమేషాలేనా?
దేవీచౌక్ (రాజమహేంద్రవరం) : అంత్యపుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులతో చర్చించకపోవడం శోచనీయమని శాసనమండలి సభ్యుడు, భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన కోటిలింగాలఘాట్, పుష్కరఘాట్, టీటీటీ ఘాట్, సరస్వతిఘాట్, వీఐపీ ఘాట్లను సందర్శించారు. సోమువీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు నాలుగే రోజులే గడువున్నా, అధికారులు అలసత్వం వీడలేదన్నారు. ఆది పుష్కరాలలో నీరు లేక, సీలేరు నుంచి విడుదల చేశారని, ఇప్పుడు ముందుగానే వరదలు రావడంతో గోదావరిలో తగినంత నీరు ఉందన్నారు. ఘాట్లలో పరిశుభ్రతపై దృష్టి సారించాలని, స్త్రీలు దుస్తులు మార్చుకునేటందుకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఘాట్లలో పేరుకుని పోయిన బురదను తొలగించుడానికి అగ్నిమాపక విభాగం సేవలు వినియోగించుకోవాలని సూచించారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ఓఎన్జీసీ, ఇంటర్నేషనల్ పేపర్ మిల్స్వంటి సంస్థలనుంచి మోటార్లు తెప్పించుకుని నల్లా చానెల్ వద్ద అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. త్వరలో కలెక్టర్‌ను కలసి, సమస్యలపై చర్చిస్తామన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు పొట్లూరి రామ్మోహనరావు, కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణారావు, మీడియా ఇన్చార్జి దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కిరణ్ కు సాయిప్రతాప్ షాక్