అపహాస్యమే హాస్యమాయెను | Sahithya Maramaralu On Actor Charlie Chaplin | Sakshi
Sakshi News home page

అపహాస్యమే హాస్యమాయెను

Published Mon, Apr 13 2020 1:23 AM | Last Updated on Mon, Apr 13 2020 1:23 AM

Sahithya Maramaralu On Actor Charlie Chaplin - Sakshi

చార్లీ చాప్లిన్‌ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఇది. ఇంగ్లండ్‌లోని వాడెవిక్‌ మ్యూజిక్‌ హాల్‌ వేదిక మీద రంగస్థల నటి అయిన చాప్లిన్‌ తల్లి పాడుతుండగా– పాట మధ్యలో ఆమె గొంతు బొంగురు పోయింది. దాంతో ఆమె వేదిక మీద నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. నిర్వాహకులు పిల్లాడైన చాప్లిన్‌ను ఏదో ఒకటి పాడమని పైకి ఎక్కించడంతో, ఏం పాడాలో తెలియక తనకు వచ్చిన రీతిలో పాడుతుంటే ప్రేక్షకులు నవ్వడం ప్రారంభించారు. దాన్ని అపహాస్యంగా భావించిన చాప్లిన్‌ మరింత బిగ్గరగా పాడటంతో ప్రేక్షకులు నవ్వును ఆపుకోలేక నాణేల్ని వేదిక మీదకు విసరడం మొదలుపెట్టారు. చాప్లిన్‌ ఆ డబ్బుని ఏరుకోవడానికి ప్రయత్నిస్తుంటే, నిర్వాహకులు తామే ఏరి పెడతామనీ, చాప్లిన్‌ను పాట కొనసాగించమనీ చెప్పారు. ఆ ఘటన చాప్లిన్‌లోని హాస్యనటుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. సరికొత్త హాస్యాన్ని వెలుగులోకి తెచ్చింది.
- చందన రవీంద్ర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement