
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్రేమ జంట సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ శుక్రవారం ఉదయం 11.30 ప్రాంతంలో రాయదుర్గంలోని తమ నివాసం ఓరియన్ విల్లాలో రిజిస్టర్ వివాహం చేసుకున్నట్లు సైనా తండ్రి హర్వీర్ సింగ్ తెలిపారు. నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమానికి ఇరువైపుల బంధువులు 40 మంది హాజరయ్యారని, ఆదివారం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. మరోవైపు కశ్యప్‌తో కలిసి ఉన్న ఫొటోను సైనా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దానికి ‘బెస్ట్ మ్యాచ్ ఆఫ్ మై లైఫ్’ అనే శీర్షికతో ‘జస్ట్ మ్యారీడ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్ జత చేసింది.
Comments
Please login to add a commentAdd a comment