హోమియో కౌన్సెలింగ్
నా వయసు 57 ఏళ్లు. నాకు చేతుల్లోని కీళ్లలో విపరీతమైన నొప్పి వస్తోంది. కీళ్లవద్ద ఎర్రబారుతోంది. ఏమిటీ సమస్య? హోమియోలో తగిన పరిష్కారం దొరుకుతుందా? – సత్యనారాయణ, భువనగిరి
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పెరిగేకొద్దీ కీళ్ళలో వచ్చే అరుగుదల వలన, ఎముకలలో క్యాల్షియం తగ్గిపోవడం వలన వస్తూ ఉంటుంది. దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. ఇందుకు భిన్నంగా ముప్పై నుండి నలబై ఏళ్ళ మధ్యలో ఉండే యువతులలో చేతుల్లో, పాదాలలో ఉండే చిన్న చిన్న కీళ్లలో వచ్చే కీళ్ళ వాపులు, నొప్పులు రావడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు. అయితే ఇది పురుషుల్లోను, పిల్లల్లో్ల కూడా రావచ్చు. చిన్న పిల్లల్లో వచ్చే ఈ తరహా వ్యాధిని ‘స్టిల్స్ డిసీజ్’ అని అంటారు.
లక్షణాల తీవ్రతలో వివిధ మార్పులు కన్పిపిస్తాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకే కీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్ళు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్ళలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ని నిర్ధారించడానికి రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాలి. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్‌ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధిని నియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాదు... డిఫార్మిటీలు రాకుండా కూడా నివారించవచ్చు.
డాక్టర్‌టి.కిరణ్ కుమార్
డైరక్టర్,పాజిటివ్ హోమియోపతి
విజయవాడ, వైజాగ్
మీ సమస్య రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు...
Published Wed, Apr 19 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM
Advertisement