దేశంలో యువజనుల సంఖ్య మాత్రమే కాదు, వయోజనుల సంఖ్య కూడా పెరుగుతోంది. పెరుగుతున్న వైద్య ప్రమాణాలతో సగటు జీవిత కాలం కూడా మెరుగవుతూ సీనియర్ సిటిజన్స్ సంఖ్య అంతకంతకూ హెచ్చుతోంది. మరోవైపు పెద్దల్ని పట్టించుకునే తీరిక లేని వేగవంతమైన జీవనశైలి పిల్లలకు అనివార్యమవుతోంది. ఈ నేప«థ్యంలో సీనియర్స్‌ను ఆన్‌లైన్ దగ్గరకు తీసుకుంటోంది. సామాజిక మాధ్యమాలు సన్నిహితం అవుతున్నాయి. అయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో పెద్దలు మెళకువగా ఉండాలి అంటోంది ‘ఉన్ముక్త్’.
సామాజిక పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరంగా వెళ్లిపోతున్నారు. మహిళలూ పనుల్లో కూరుకుపోతున్నారు. దీనితో వయోవృద్ధులు స్వంతంగా తమకై తాము జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ పాప్యులేషన్ ఫండ్ రిపోర్ట్ ప్రకారం.. 2050 కల్లా భారతీయ జనాభాలోని ప్రతి 5గురిలో ఒకరు 60 ఏళ్ల వయసు దాటిన వ్యక్తయి ఉంటారు. అందుకోసమే... భారత్‌లో పెద్ద వయసు వ్యక్తుల ఎంచుకోదగిన జీవనశైలికి సంబంధించిన పలు అంశాలను వివరిస్తోంది సీనియర్ సిటిజన్స్‌కు సంబంధించిన భారతదేశపు అతిపెద్ద సంస్థ.. ఉన్ముక్త్. హైదరాబాద్‌లో ఉన్ముక్త్ నిర్వహిస్తోన్న వర్క్‌షాపులలో విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటూ వయోజనులు అనుసరించాల్సిన జీవనశైలిపై సూచనలు, సలహాలు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల వారు ‘ఆన్‌లైన్ సేఫ్టీ ఫర్ సీనియర్ సిటిజన్స్’ అనే అంశంపై ప్రజెంటేషన్‌ను సమర్పించారు.
పెద్దలూ... ఆన్‌లైన్
వయసులో పెద్దవాళ్లు టెక్నాలజీని బాగా వినియోగించుకోవలసిన అవసరం ఏర్పడుతోంది. అందుకే చాలామంది సీనియర్లు టెక్ సావీలుగా మారుతున్నారు. స్కైపింగ్ చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి ట్రావెల్ చేస్తున్నారు. వాట్సాప్‌లో చర్చలు, వాదోపవాదాలు సాగిస్తున్నారు. సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ‘‘తమ ఈ–కామర్స్ పోర్టల్‌లో 60 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య వయస్కులే అతిపెద్ద కొనుగోలు దారులని ఈ వర్క్‌షాప్‌కు హాజరైన ఒక ఇ కామర్స్ పోర్టల్ యజమాని చెప్పారు. తమ íసీనియారిటీ డాట్ ఇన్ సైట్‌ని ప్రతి నెలా 2 లక్షల మంది సందర్శిస్తారని తెలిపారు. అపరిచితులతో అప్రమత్తంసాంకేతిక పరిజ్ఞానం ఎంతగా మన పనుల్ని సులభతరం చేసిందో అంతే స్థాయిలో మోసాల్ని కూడా అవలీలగా చేయిస్తోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా ఎవరితో ఏ సమాచారం ఎందుకు షేర్ చేస్తున్నారనేది సీనియర్స్‌కి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మరోవైపు వ్యక్తిగత, ఆర్థ్ధిక లావాదేవీల వివరాలు తెలుసుకోవడానికి ఆన్‌లైన్ స్కామర్స్ విభిన్న రకాల మెళకువలు ఉపయోగిస్తున్నారు.
దీనిని ఎలా ఎదుర్కోవాలి అనేదానికి అవసరమైతే సంబంధిత నిపుణులను ముందుగా సంప్రదించాలి. సైబర్ బుల్లీయింగ్‌కు గురి అవుతున్నట్లు తెలిస్తే వెంటనే సదరు అకౌంట్‌ను మ్యూట్ లేదా బ్లాక్ చేయాలి. సంబంధిత ప్రభుత్వ విభాగానికి ఫిర్యాదు చేయాలి. వీలున్నంత వరకూ ఆన్‌లైన్ సంభాషణలు పాజిటివ్‌గా, మర్యాద పూర్వకంగా ఉండేలా చూడాలి. సేఫ్టీ గైడ్ వచ్చిందిహిందీ ఇంగ్లీషు భాషల్లో రూపొందించిన ఆన్‌లైన్ సేఫ్టీ గైడ్ ఫర్ సీనియర్ సిటిజన్స్‌ను గూగుల్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ రిసెర్చ్ అండ్ అవుట్ రీచ్ లీడ్ సుజాతా ముఖర్జీ ఉన్ముక్త్ వర్క్‌షాప్స్‌లో ఆవిష్కరించారు. ఈ గైడ్ సీనియర్స్‌కు సులభంగా అర్ధమయ్యే భాషలో దీనిలో ప్రొటెక్టింగ్ ఆన్‌లైన్ అక్కౌంట్స్, ఎక్సర్‌సైజింగ్ కేర్, స్కామ్స్ గుర్తింపు, నిరోధించడం... తదితర విశేషాలను అందిస్తుంది. త్వరలోనే తెలుగు సహా ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తున్నారు.
– ఎస్.సత్యబాబు
ఆన్‌లైన్... కేర్...
వయసు పెరుగుతున్న కొద్దీ బ్రెయిన్ కుంచించుకుపోతుంటుంది. మన వయసు 40 దాటాక పదేళ్లకు 5శాతం చొప్పున మెదడు తరిగిపోతుంటుందని వైద్యులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి సమస్యలు సాధారణం కాబట్టి పెద్దలు తమ పాస్ వర్డ్స్‌ని జాగ్రత్తగా అమర్చుకోవాలి. లోయర్ అప్పర్ లెటర్స్‌ని, నెంబర్స్, సింబల్స్‌ని కలిపి కనీసం 8 లేదా 9 మిక్స్‌డ్ క్యారెక్టర్స్ వినియోగించాలి.ఉదాహరణకు ఇంట్లో టామ్ అండ్ జెర్రీ పేరుతో పిల్లులు ఉన్నాయనుకోండి. అప్పుడు ప్రతి పదం తాలూకు తొలి అక్షరాన్ని తీసుకుని లోయర్ కేస్, అప్పర్‌కేస్ అక్షరాలు ఉపయోగిస్తూ ఐజ్టిఛ్చిజిnఖ్చీఒ అని పాస్ వర్డ్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇందులోని అక్షరాలనే నంబర్స్, సింబల్స్‌తో మారుస్తూ పాస్ వర్డ్‌ని ఐజి2ఛిఃజిnఖీ–ఒ లా పెట్టుకోవాలి. అలాగే గుర్తు పెట్టుకోవాల్సిన పాస్‌వర్డ్స్ ఎక్కువగా ఉంటే పాస్‌వర్డ్ మేనేజర్‌ని ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం 2 మైళ్లు నడిచేవారికి డిమెన్షియా సమస్య రాదని పరిశోధనలు తేల్చాయి. మానసికంగా చురుకుగా ఉండడానికి క్రాస్‌వర్డ్స్ సాల్వ్ చేయడం, సుడోకు చేయడం, పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం వంటివి జ్ఞాపకశక్తి తగ్గకుండా, డిమెన్షియా ఆలస్యం అయ్యేలా సహకరిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment