మోదీజీ ఫీల్డ్‌లోకి రాక ముందే మనకో సెలబ్రిటీ ‘చాయ్‌వాలా’ ఉన్నాడు! చాయ్‌వాలా అంటే చాయ్‌వాలా కాదు. చాయ్‌వాలాల్ని పైకెత్తిన సినీవాలా.. మన చిరంజీవి! ‘యే.. చాయ్, చటుక్కునా తాగరా భాయ్’ అని చిరు డాన్స్ చేసిన ‘మృగరాజు’ మూవీ 2012లో రిలీజ్ అయింది. ‘ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్’ అని కూడా అందులో చిరు పాడారు.
చాయ్ చేసిన ఓ చమక్కు.. మోదీజీ మన ప్రధాని కావడం! మృగరాజుతో ఒక్క ఆంధ్రాలోనే (అప్పటికింకా తెలంగాణ రాలేదు) చాయ్ ఫేమస్ అయితే, 2014లో మోదీరాజు రాకతో అన్నీ రాష్ట్రాల్లోనూ చాయ్ సెలబ్రిటీ అయింది. చాయ్ తాగేవాళ్లూ సెలబ్రిటీలు అయ్యారు. హార్డ్‌వర్క్‌కి, మంచి ఆడ్మినిస్ట్రేషన్‌కీ, మాటకారితనానికీ చాయ్ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్! ‘నేనూ ఒకప్పుడు చాయ్‌వాలానే’ అని మోదీ చెప్పాకా, చాయ్‌వాలాలందరికీ పీయెంకి వచ్చినంత ఫేమ్ వచ్చేసింది. విషయం ఏంటంటే.. హైదారాబాద్ అంటే బిర్యానీ అన్నట్లు, ఇండియా అంటే ‘చాయ్’ అనే పేరొచ్చేసిందని తాజా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment