లేని కాళ్లతో... స్కేటింగ్!
స్కేటింగ్... చలాకీగా ఉండే టీనేజర్లకు చాలా ఇష్టమైన ఆట. స్కేట్‌బోర్డ్‌ను కాళ్లతో నియంత్రించుకొంటూ వేగంగా దూసుకెళ్లడం, దాంతో విన్యాసాలు చేయడం చాలా థ్రిల్‌ను ఇస్తుంది. అయితే చేతులు, కాళ్లు, అన్నీ బాగున్న వాళ్లు స్కేటింగ్ చేయడమే గొప్ప అనుకొంటే.. ఇటాలో రోమనోని నిజంగా చాలా గ్రేట్ అనుకోవాల్సిందే! ఎందుకంటే.. అతడికి రెండు కాళ్లూ లేవు. అయినా చూసే వాళ్ల కళ్లు చెదిరేలా స్కేట్ బోర్డ్‌ను ఆపరేట్ చేయగలడు ఇటాలో.
బ్రెజిల్‌కు చెందిన 26 యేళ్ల ఇటాలోకు సాహసోపేతమైన, డేంజరస్ గేమ్స్ పైన ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తే 13 యేళ్ల క్రితం అతడి కాళ్లు పోవడానికి కారణమయ్యింది. అయినా కూడా అతడు వెనక్కు తగ్గలేదు. తన ఆసక్తిని చంపుకోలేదు. మోకాళ్ల వరకూ కాళ్లు తెగిపోయినా, అలాగే నిలబడి స్కేటింగ్‌ను ప్రాక్టీస్ చేయసాగాడు. అందులో ప్రావీణ్యత సంపాదించాడు. చేతులతో స్కేట్‌బోర్డ్‌ను పట్టుకొని రకరకాల విన్యాసాలు చేస్తుంటాడు. చూసిన వాళ్ల చేత ‘ఔరా..’ అనిపిస్తుంటాడు!