Skating board
-
స్కేటింగ్ చిన్నారి ఘనత
చెన్నై ,టీ.నగర్: మహాబలిపురానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక కమలిమూర్తి స్కేటింగ్‌లో అసాధారణ ప్రతిభ చూపించింది. గౌను ధరించి స్కేటింగ్బోర్డ్ను ఉపయోగించిన సమయంలో తీసిన ఫోటో అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ స్కేట్ బోర్డరైన డోనీ హాకిన్స్ కళ్లలో పడింది. పాదరక్షలు కూడా లేకుండా ఒక బాలిక అసాధ్యమైన స్కేటింగ్ బోర్డును ఉపయోగించడం గమనించిన డోని ఈ ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేయగా ప్రపంచస్థాయిలో పేరుపొందింది. దీంతో న్యూజిలాండ్‌కు చెందిన షషా రెయిన్బో అనే డైరెక్టర్ తమిళనాడు చేరుకుని కమలి పేరుతోనే 24 నిమిషాల నిడివితో డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ గత నెల జరిగిన అట్లాంటా చిత్రోత్సవంలో ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అవార్డు పొందింది. గత ఏడాది డిసెంబర్లో ముంబై అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుని అవార్డును చేజిక్కించుకుంది. కమలి, ఆమె తల్లి సుగంధి, అవ్వ గురించి వివరిస్తూ ఉన్న ఈ చిత్రం 2020 ఆస్కార్ అవార్డు సిఫార్సుల జాబితాలో చోటు సంపాదించుకుంది. కమలి తల్లి సుగంధి సోమవారం ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ కుమార్తె తర్వాత తమకు లభించిన పెద్ద గౌరవమని వ్యాఖ్యానించారు. -
లేని కాళ్లతో... స్కేటింగ్!
స్కేటింగ్... చలాకీగా ఉండే టీనేజర్లకు చాలా ఇష్టమైన ఆట. స్కేట్‌బోర్డ్‌ను కాళ్లతో నియంత్రించుకొంటూ వేగంగా దూసుకెళ్లడం, దాంతో విన్యాసాలు చేయడం చాలా థ్రిల్‌ను ఇస్తుంది. అయితే చేతులు, కాళ్లు, అన్నీ బాగున్న వాళ్లు స్కేటింగ్ చేయడమే గొప్ప అనుకొంటే.. ఇటాలో రోమనోని నిజంగా చాలా గ్రేట్ అనుకోవాల్సిందే! ఎందుకంటే.. అతడికి రెండు కాళ్లూ లేవు. అయినా చూసే వాళ్ల కళ్లు చెదిరేలా స్కేట్ బోర్డ్‌ను ఆపరేట్ చేయగలడు ఇటాలో. బ్రెజిల్‌కు చెందిన 26 యేళ్ల ఇటాలోకు సాహసోపేతమైన, డేంజరస్ గేమ్స్ పైన ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తే 13 యేళ్ల క్రితం అతడి కాళ్లు పోవడానికి కారణమయ్యింది. అయినా కూడా అతడు వెనక్కు తగ్గలేదు. తన ఆసక్తిని చంపుకోలేదు. మోకాళ్ల వరకూ కాళ్లు తెగిపోయినా, అలాగే నిలబడి స్కేటింగ్‌ను ప్రాక్టీస్ చేయసాగాడు. అందులో ప్రావీణ్యత సంపాదించాడు. చేతులతో స్కేట్‌బోర్డ్‌ను పట్టుకొని రకరకాల విన్యాసాలు చేస్తుంటాడు. చూసిన వాళ్ల చేత ‘ఔరా..’ అనిపిస్తుంటాడు!