మోసుల్ చంద్రుడు! | Spain traveler Ibn said visited Mosul in 1250 | Sakshi
Sakshi News home page

మోసుల్ చంద్రుడు!

Published Mon, May 12 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM

మోసుల్ చంద్రుడు!

మోసుల్ చంద్రుడు!

సంస్కృతి
 
నిండు చంద్రుడిలో ఎంత కళ ఉంటుందో...మోసుల్ పట్టణంలోనూ అంతే ఉంటుందని, ఆ పట్టణాన్ని నిండుచంద్రుడితో పోలుస్తుంటారు భావుకులు.

ఇరాక్‌లోని మోసుల్ పట్టణం 13వ శతాబ్దంలో కళలకు పెట్టింది పేరు. అరబ్బులు, ఇరానీయులు, కుర్దులు, క్రిస్టియన్లు, ముస్లింలు...మొదలైన వారితో అందమైన సాంస్కృతిక వైవిధ్యం అక్కడ కనిపించేది. లోహపు పనితనానికి ఈ పట్టణం ప్రసిద్ధి పొందింది. ఇక సిల్క్‌తో రూపొందించిన కళాకృతులు చూపు తిప్పుకోలేనంత ఆకర్షణీయంగా ఉండేవి.

 మోసుల్‌ను 1250లో దర్శించిన స్పెయిన్ యాత్రికుడు ఇబ్న్ సాసిడ్ ఇలా రాశాడు:
 ‘‘పట్టణంలో ఎటు వైపు చూసినా... అందమైన కళాకృతులు కనిపించాయి. చూడడానికి రెండు కళ్లు చాలవేమో అనిపించింది. ఎన్నో ప్రాంతాలు తిరిగిన నాకు ఇక్కడ చూసిన అద్భుతమైన పనితనం ఎక్కడా కనిపించలేదు’’ఖానిద్ రాజుల పరిపాలనలో ఈ పట్టణంలో కళా సంస్కృతులు బాగా పరిఢవిల్లాయి.

ఈ పట్టణాన్ని మంగోలులు ఆక్రమించినప్పుడు తాత్కాలిక సంక్షోభం ఏర్పడినప్పటికీ...కళాప్రవాహం మాత్రం ఆగిపోలేదు. స్థానిక కళలకు మంగోలు కళా నైపుణ్యం కూడా తోడు కావడంతో ప్రపంచం కీర్తించే స్థాయిలో సరికొత్త కళాకృతులు తయారుకావడం మొదలైంది. మట్టితో చేసివని కావచ్చు. బంగారంతో రూపొందించినవి కావచ్చు...తయారీకి ఉపయోగించింది ఏదైనా... ప్రతి కళాకృతి వెలకట్టలేని బంగారమే!

 తాజా ఖబర్: 13వ శతాబ్దానికి చెందిన మోసుల్ వర్ణచిత్రాలు, కళాకృతులను లండన్‌లోని కొర్ట్‌లాడ్ గ్యాలరీలో ఇప్పుడు తొలిసారిగా ప్రదర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement