నిద్రలో మాట్లాడే జబ్బు...!
మెడి క్షనరీ
నిద్రలో మాట్లాడే జబ్బు చిన్నపిల్లల్లో చాలా సాధారణం. దీన్ని ‘సామ్నిలాక్వి’ అని అంటారు. నిద్ర సబంధమైన రుగ్మతలు... అంటే నిద్రలో పీడకలల వంటి భయాలకు గురై అరుస్తూ నిద్రలేవడం (నైట్ ట్సై), నిద్రలో నడవడం (స్లీప్ వాకింగ్) లాంటి కోవకు చెందినదే ఈ నిద్రలో మాట్లాడే జబ్బు.
దీనితో బాధపడేవారు నిద్రలో మాట్లాడే సమయంలో అస్పష్టంగా గొణగడం మొదలుకొని, పెద్దగా అరవడం కూడా చేస్తుంటారు. ఇదేమీ ప్రమాదకరమైన రుగ్మత కాదు. కాస్త పెద్ద పిల్లల్లో కౌమార ప్రాయం (అడాలసెన్స్)లో కనిపించే ఈ రుగ్మత... వాళ్లు పెరిగి పెద్దవుతున్న కొద్దీ (అడల్ట్‌హుడ్‌కు దగ్గరవుతున్న కొద్దీ) దానంతట అదే తగ్గిపోతుంది.