రెపరెపలాడే రుచులు | special flavors | Sakshi
Sakshi News home page

రెపరెపలాడే రుచులు

Published Fri, Jan 23 2015 10:15 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

రెపరెపలాడే  రుచులు

రెపరెపలాడే రుచులు

రంగులు జెండాలకే కాదు... వంటలకూ ఉన్నాయి... ఒక్కో రంగు వంటకం ఒక్కో విటమిన్‌ని అందిస్తుంది... మూడు రంగుల మేళవింపు జెండా... లెక్కలేనన్ని రంగులు సమాహారం పోషకాహారం... రిపబ్లిక్‌డే జాతీయ పండుగ... ఈ సందర్భంగా విభిన్న రాష్ట్రాల రుచులను ఆస్వాదిద్దాం... భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపిద్దాం...
 
కావలసినవి: నూనె - 200 గ్రా.; ఆవాలు, మెంతులు, జీలకర్ర - పోపుకి తగినన్ని; ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; పసుపు - అర టీ స్పూను; చింతపండు - 125 గ్రా. (నానబెట్టి, చిక్కగా పులుసు తీయాలి); పచ్చి మిర్చి - అర కేజీ (శుభ్రంగా కడిగి మధ్యకు గాటు పెట్టాలి); కొబ్బరి తురుము - 125 గ్రా.; టొమాటోలు - 8 (మీడియం సైజువి); కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - చిన్న కట్ట
 
మసాలా పేస్ట్ కోసం: నువ్వులు - 50 గ్రా.; జీలకర్ర పొడి - 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు; (ఈ మూడు పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేస్తే మసాలా తయారవుతుంది)
 
తయారీ:  బాణలిలో నూనె కాగాక ముందుగా పచ్చి మిర్చి వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి  అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి  ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి  మసాలా, చింతపండు పులుపు జత చేసి కలియబెట్టి, కొద్దిగా నీళ్లు, వేయించి ఉంచుకున్న పచ్చి మిర్చి, టొమాటోలు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాక కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి దింపేయాలి.
 
బెల్ పెపర్స్ అండ్ టొమాటో  కర్రీ

 
కావలసినవి: పనీర్ - కప్పు (మెత్తగా మెదపాలి); బంగాళదుంపలు - 3 (ఉడికించి, తొక్కు తీసి మెదపాలి); కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను; కిస్‌మిస్ - 3 టేబుల్ స్పూన్లు; మిరియాల పొడి - తగినంత; ఉప్పు - తగినంత; గరం మసాలా పొడి - పావు టీ స్పూను; కారం - పావు టీ స్పూను; జీలకర్ర పొడి - అర టీ స్పూను; రెడ్ క్యాప్సికమ్ - 4 (పెద్దవి); నూనె - తగినంత కూర కోసం...: ఏలకుల పొడి - అర టీ స్పూను; బిరియానీ ఆకు - 1 ; వెల్లుల్లి రేకలు - 6 (కచ్చాపచ్చాగా చేయాలి); ఉల్లిపాయ - 1 (చిన్న ముక్కలుగా తరగాలి); టొమాటోలు - 3 (చిన్న ముక్కలుగా వచ్చేలా తరగాలి); పాలు - అర కప్పు; జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద - టీ స్పూను; కారం - టీ స్పూను; గరం మసాలా పొడి - పావు టీ స్పూను; జీలకర్ర పొడి - అర టీ స్పూను; క్రీమ్ - టేబుల్ స్పూను; నూనె - 4 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; నీళ్లు - తగినన్ని; జీడిపప్పులు - కొద్దిగా; పుదీనా ఆకులు - కొన్ని

తయారీ:  ఒక పాత్రలో పనీర్, ఉడికించిన బంగాళదుంప వేసి, వాటికి కొత్తిమీర, కిస్‌మిస్, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా, కారం, జీల కర్ర పొడి జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి  రెడ్ క్యాప్సికమ్ పై భాగం కొద్దిగా కట్ చేసి అందులోని గింజలను బయటకు తీసేయాలి  ఒక్కో క్యాప్సికమ్‌ను ముందుగా తయారుచేసి ఉంచుకున్న మిశ్రమంతో స్టఫ్ చేయాలి  స్టౌ మీద పాన్ ఉంచి కొద్దిగా నూనె వేసి కాగాక స్టఫ్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్‌లను వేసి వేయించి కొద్దిసేపయ్యాక రెండవ వైపు కూడా తిప్పి బాగా వేగాక తీసి పక్కన ఉంచాలి.

కూర తయారీ:  బాణలిలో 2 టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఏలకుల పొడి, బిరియానీ ఆకు వేసి రెండు నిమిషాలు వేయించాలి  వెల్లుల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు కలపాలి  ఉల్లి తరుగు వేసి బాగా వేగాక, టొమాటో తరుగు, జీడి పప్పు పలుకులు, పాలు వేసి వేయించి సుమారు ఐదారు నిమిషాలు మీడియం మంట మీద ఉంచి టొమాటో తరుగు గుజ్జులా మెత్తబడే వరకు కలపాలి  బాగా చల్లారాక అందులో నుంచి బిరియానీ ఆకు తీసేయాలి  అదే బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించాలి  కారం, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, ఉప్పు, అర కప్పు నీళ్లు వేసి బాగా కలియబెట్టి, మూత పెట్టి సుమారు 5 నిమిషాలు ఉడికించాక మూత తీసి క్రీమ్, కొత్తిమీర తరుగు వేసి క లిపి, చివరగా స్టఫ్‌డ్ క్యాప్సికమ్ వేసి ఉడికించి దించేయాలి  పుదీనా తరుగు, జీడిపప్పులతో అలంకరించి వేడివేడిగా వడ్డించాలి.
 
దిల్ బహార్

 
కావలసినవి: పాలు - లీటరు; పంచదార - ముప్పావు కప్పు; పాల పొడి - అర కప్పు; పచ్చి కోవా  - అర కప్పు; జీడిపప్పులు - తగినన్ని; చెర్రీ - తగినన్ని; పిస్తా పప్పులు - కొన్ని; కుంకుమ పువ్వు - చిటికెడు
 
తయారీ:  ముందుగా పాలను మరిగించాలి  నిమ్మరసం నీళ్లు జత చేసి పాలను పనీర్‌గా చేయాలి  పనీర్‌ను ప్లేట్‌లోకి తీసి, మీకు నచ్చిన ఆకృతిలో తయారుచేసి పక్కన ఉంచాలి  ఒక పాత్రలో మూడు కప్పుల నీళ్లు, ముప్పావు కప్పు పంచదార వేసి స్టౌ మీద ఉంచి, మరిగించాక అందులో గుండె ఆకారంలో తయారుచేసిన వాటిని వేసి, అవి పాకం పీల్చుకుని రెట్టింపు పరిమాణంలోకి పెరగ్గానే, స్టౌ మీద నుంచి దింపేసి, సుమారు నాలుగు గంటలు వాటిని అందులోనే నాననివ్వాలి  ఒక పాత్రలో అర కప్పు పంచదార, పచ్చి కోవా వేసి స్టౌ మీద ఉంచి, మిశ్రమం బాగా చిక్కబడ్డాక కిందకు దింపేయాలి  ఒక ట్రేలో పనీర్‌తో తయారుచేసి ఉంచుకున్న దిల్ బహార్‌లను వేసి వాటి మీద కోవా మిశ్రమం వేసి, జీడిపప్పు, చె ర్రీ, పిస్తా పప్పులు, కుంకుమ పువ్వులతో అలంకరించి చల్లగా అందించాలి.
 
 
 కాజు కట్లీ
 
కావలసినవి:  జీడిపప్పు - కప్పు; పంచదార - అర కప్పు; నీళ్లు - 5 టేబుల్ స్పూన్లు; నెయ్యి - టేబుల్ స్పూను; రోజ్ వాటర్ - టీ స్పూను; బటర్ పేపర్‌లు - తగినన్ని; జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూను; ఫుడ్ కలర్ - కొన్ని చుక్కలు (ఆరెంజ్, గ్రీన్)
 
తయారీ:  ముందుగా జీడిపప్పులను మిక్సీలో వేసి పొడి చేయాలి. (ముద్దగా కాని, జిడ్డుగా కాని ఉండకూడదు)  బాణలిలో పంచదార, నీళ్లు వేసి సన్న మంట మీద ఉంచాలి  ఈలోగా ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి ఉంచుకోవాలి. బటర్ పేపర్‌లు సిద్ధంగా ఉంచుకోవాలి  పంచదార బాగా కరిగాక, జీడిపప్పు పొడి వేసి ఉండ కట్టకుండా బాగా కలుపుతుండాలి  మిశ్రమం బాగా చిక్కబడ్డాక జీడిపప్పు పలుకులు వేసి, బాగా కలిపి మంట మీద నుంచి దింపి, గరిటెతో బాగా కలిపి పళ్లెంలో వేసి అట్లకాడ సహాయంతో సమానంగా పరచాలి  పూర్తిగా చల్లారాక మనకు కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి  బటర్ నైఫ్‌తో జాగ్రత్తగా కాజు కట్లీలను విడిగా తీసి గాలి చొరని డబ్బాలో నిల్వ ఉంచాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement