భళి భళి భళిరా భళి రాజమౌళి | special story to ssrajamouli | Sakshi
Sakshi News home page

భళి భళి భళిరా భళి రాజమౌళి

Published Fri, May 5 2017 11:29 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

భళి భళి భళిరా భళి రాజమౌళి - Sakshi

భళి భళి భళిరా భళి రాజమౌళి

రాజమౌళి సక్సెస్‌కు రాజముద్ర. ఆ స్టాంప్‌ పడిందంటే పోస్టర్‌ పేలాల్సిందే. కలెక్షన్లు కట్టప్పల్లా చెప్పినట్టు వినాల్సిందే. స్టయిల్‌ – ఎస్‌. సక్సెస్‌ – ఎస్‌. ఎస్‌.ఎస్‌. రాజమౌళి భళి భళి భళిరా భళి. ఆయన రికార్డ్స్‌లో కొన్ని తెలిసినవి. కొన్ని తెలియనివి. కాని అన్నీ అందరినీ అబ్బుర పరిచేవి. ఎంజాయ్‌  రికార్డ్స్‌ మౌళి.


స్టూడెంట్‌ నం. 1 (27.09.2001)
దర్శకుడిగా రాజమౌళికి ఇది తొలి సినిమా
చిన్న ఎన్టీఆర్‌ ముందు కమిట్‌ అయిన సినిమా ఇదే. అయితే సెట్స్‌కి వెళ్లడానికి టైమ్‌ పట్టడంతో ‘నిన్ను చూడాలని’ ద్వారా హీరోగా పరిచయం అయ్యారు
ఫస్ట్‌ సినిమా ఎన్టీఆర్‌కి సక్సెస్‌పరంగా కలసి రాలేదు. సెకండ్‌ సినిమా ‘స్టూడెంట్‌ నం.1’ సక్సెస్‌ టేస్ట్‌ ఎలా ఉంటుందో పరిచయం చేసింది దర్శకుడిగా ఫస్ట్‌ సినిమాతోనే రాజమౌళి సక్సెస్‌ అయ్యారు ∙రెండు కోట్ల వ్యయంతో తీసిన ఈ సినిమా 12 కోట్లు వసూలు చేయడం ఓ రికార్డ్‌
73 సెంటర్లలో 50 రోజులు, 42 సెంటర్లలో 100 రోజులాడటం ఓ రికార్డ్‌ ∙ఆదోని నిర్మల్‌ థియేటర్‌లో 217 రోజులాడటం మరో రికార్డ్‌ ‘బాహుబలి’ కట్టప్ప సత్యరాజ్‌ కొడుకు శిబిరాజ్‌ హీరోగా తమిళంలో ఈ సినిమా రీమేక్‌ అయింది. ఒరియాలోనూ రీమేక్‌ అయింది.


సింహాద్రి (09.07.2003)
‘స్టూడెంట్‌ నం.1’ తర్వాత ఎన్టీఆర్‌ ‘సుబ్బు, ఆది, అల్లరి రాముడు, నాగ’ సినిమాలు చేశారు. వీటిలో ‘ఆది’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌. మళ్లీ ఎన్టీఆర్‌కి అంతకు మించిన హిట్‌ ఇచ్చిన సినిమా రాజమౌళి ‘సింహాద్రి’
సుమారు 6 కోట్ల నిర్మాణ వ్యయంతో తీసిన ఈ సినిమా 55 కోట్లు వసూలు చేసి, కొత్త రికార్డ్స్‌ సృష్టించింది ∙191 సెంటర్లలో 50 రోజులు, 160 సెంటర్లలో 100 రోజులు, 55 సెంటర్లలో 175 రోజులు, 25 సెంటర్లలో 200 రోజులు ఆడిన రికార్డ్‌ ‘సింహాద్రి’ సొంతం
అప్పట్లో మాస్‌ సినిమాలకు ఒక కొత్త ఒరవడి చూపించిన సినిమా ‘సింహాద్రి’ అనొచ్చు
ఎన్టీఆర్‌ని మంచి మాస్‌ హీరోగా ఆది ఆవిష్కరిస్తే, ‘సింహాద్రి’ తిరుగు లేని మాస్‌ హీరోగా నిలబెట్టింది. రాజమౌళికి మంచి మాస్‌ దర్శకుడనే ఇమేజ్‌ తెచ్చింది
తమిళంలో ‘గజేంద్ర’గా, కన్నడంలో ‘కంఠీరవ’ గా ‘సింహాద్రి’ రీమేక్‌ అయింది.


సై (23.09.2004)
‘సింహాద్రి’కి పూర్తి భిన్నంగా సాగే సినిమా ‘సై’. కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీ ∙ఇంటర్నేషనల్‌ గేమ్‌ ‘రగ్బీ’ని తొలిసారి తెలుగు స్క్రీన్‌పై చూపించిన చిత్రం ‘సై’
సినిమాలో కీలక పాత్రధారులకు రగ్బీ గేమ్‌లో రాజమౌళి శిక్షణ ఇప్పించారు. చిత్రీకరణ ప్రారంభించక ముందు నితిన్‌ దాదాపు రెండు నెలలు ఈ ఆట నేర్చుకున్నారు
సుమారు 8 కోట్ల నిర్మాణ వ్యయంతో తీసిన ఈ సినిమా దాదాపు 12 కోట్లు వసూలు చేసింది
ఒక సెంటర్‌లో 365 రోజులు ఆడిన రికార్డ్‌ను ‘సై’ దక్కించుకుంది
2015 ‘రగ్బీ వరల్డ్‌ కప్‌’ అప్పుడు ‘సై’లోని కొన్ని సన్నివేశాలు సోషల్‌ మీడియాలో బాగా హల్‌చల్‌ చేయడం విశేషం.


ఛత్రపతి (30.09.2005)
‘వర్షం’తో మంచి మాస్‌ హీరోగా బ్రేక్‌ తెచ్చుకున్న ప్రభాస్‌ రేంజ్‌ని ‘ఛత్రపతి’ పెంచింది ∙  ఈ చిత్రంలోని మదర్‌ సెంటిమెంట్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
8 కోట్ల నిర్మాణ వ్యయంతో తీసిన ఈ సినిమా ఏకంగా 22 కోట్లు వసూలు చేసి, రికార్డ్‌ సృష్టించింది.
54 సెంటర్లలో 100 రోజులు ఆడింది
కన్నడంలో ‘ఛత్రపతి’గా బెంగాలీలో ‘రెఫ్యూజీ’గా రీమేక్‌ అయింది.

విక్రమార్కుడు (23.06.2006)
రవితేజలోని మాస్‌ హీరోని భిన్న కోణంలో చూపించారు రాజమౌళి ∙ సుమారు 11 కోట్ల బడ్జెట్‌తో ‘విక్రమార్కుడు’ తీశారు.
⇒  దాదాపు 25 కోట్లు వసూలు చేసి, రవితేజ గ్రాఫ్‌ని పెంచిన సినిమా
54 సెంటర్లలో 100 రోజులు ఆడింది.
హిందీలో ‘రౌడీ రాథోడ్‌’గా రీమేక్‌ అయి, అక్కడా  సంచలన విజయం సాధించింది.
తమిళంలో ‘సిరుతై’గా, కన్నడంలో ‘వీరమడక్కరి’, బెంగాలీలో ‘బిక్రమసింగ’గా రీమేక్‌ అయింది.
అప్పటి వరకూ రాజమౌళి తీసిన సినిమాల్లో నాలుగు భాషల్లో రీమేక్‌ అయిన తొలి సినిమా ఇది.
 
యమదొంగ (15.08.2007)
రాజమౌళి తీసిన సినిమాల్లో ఎక్కువ నిడివి ఉన్న సినిమా ‘యమదొంగ’. లెంగ్త్‌ 3 గంటల 5 నిమిషాలు.
‘స్టూడెంట్‌ నం. 1’, ‘సింహాద్రి’ తర్వాత ఎన్టీఆర్‌–రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా.
ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్‌ కొన్ని సినిమాలు చేశారు. కానీ, ‘యమదొంగ’తో ఆయన కెరీర్‌ మళ్లీ ఊపందుకుంది.
యమలోకంలో సాగే ఈ ఫ్యాంటసీ మూవీ బడ్జెట్‌ సుమారు 20 కోట్లు. వసూళ్లు దాదాపు 30 కోట్లు.
  92 సెంటర్లలో 100 రోజులు, 405 సెంటర్లలో 50 రోజుల రికార్డ్‌ను దక్కించుకుంది.

మగధీర (31.07.2009)
పునర్జన్మల మీద రాజమౌళి తీసిన మొదటి సినిమా ‘మగధీర’
దాదాపు 35 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 70 కోట్లకు పైగా వసూలు చేసింది ∙ కేవలం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసమే 4 కోట్లు ఖర్చు పెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా 1250 స్క్రీన్స్‌లో విడుదలైన మొదటి సినిమా
రామ్‌చరణ్‌ కెరీర్‌లో తొలి భారీ బడ్జెట్, అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ∙2 గంటల 35 నిమిషాల నిడివిలో 1 గంటా 40 నిమిషాలు సీజీ (కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌) నిడివి ఉండటం విశేషం.
నార్త్‌ అమెరికాలో 21 స్క్రీన్లలో విడుదలైన తొలి సినిమా రికార్డ్‌ ‘మగధీర’కు దక్కింది.
బ్లూ–రే డీవీడీ రూపంలో విడుదలైన మొదటి తెలుగు సినిమా ఇదే
బెంగాలీలో ‘యోధ: ది వారియర్‌’ పేరుతో ఈ సినిమా రీమేక్‌ అయింది.

మర్యాద రామన్న (23.07.2010)
‘మగధీర’ వంటి భారీ బడ్జెట్‌ యాక్షన్‌ మూవీ తర్వాత రాజమౌళి చిన్న బడ్జెట్‌తో ‘మర్యాద రామన్న’ తీశారు.
ఇది సునీల్‌ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమా కావడం విశేషం ∙2010లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో కామెడీ హీరో సునీల్‌ సినిమా నిలవడం ఓ రికార్డ్‌.
సుమారు 12 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా దాదాపు 30 కోట్లు వసూలు చేసింది.
హిందీలో ‘సన్నాఫ్‌ సర్దార్‌’గా రీమేక్‌ అయంది. యాక్షన్‌ హీరో అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించారు. పెద్ద హిట్టయింది.
తమిళంలో ‘వల్లవనుక్కు పుల్లుమ్‌ ఆయుధమ్‌’, మలయాళంలో ‘ఇవన్‌ మర్యాదరామన్‌’గా, కన్నడంలో ‘మర్యాదె రామన్న’గా, బెంగాలీలో ‘ఫాండే పొరియా భోగ కాండే రే’ పేరుతో రీమేక్‌ అయింది.
ఐదు భాషల్లో రీమేక్‌ అయిన రాజమౌళి మొదటి సినిమా ఇది.

ఈగ (06–07–2012)
రాజమౌళి సృష్టించిన టెక్నికల్‌ వండర్‌ ‘ఈగ’ ∙తెలుగులో హాలీవుడ్‌ తరహా సినిమాలు సాధ్యమనడానికి తొలి మెట్టు ‘ఈగ’.
సుమారు 26 కోట్ల నిర్మాణ వ్యయంతో తీసిన ఈ సినిమా 85 కోట్లు వసూలు చేసి, రికార్డ్‌ సాధించింది
1990లో తండ్రి విజయేంద్రప్రసాద్‌ మనిషిపై ఈగ పగ తీర్చుకోవడం అని సరదాగా చెప్పిన మాట రాజమౌళి మస్తిష్కంలో నిలిచిపోయింది
2010లో ‘ఈగ’కు శ్రీకారం చుట్టారు
విజువల్‌ ఎఫెక్ట్స్‌కే 7 కోట్లు పెట్టారు ∙ఆఫ్రికాలో విడుదలైన తొలి తెలుగు సినిమా ఇది.

‘బాహుబలి: ది బిగినింగ్‌’ (10–07–2015)
ఒక తెలుగు సినిమాకి 180 కోట్ల బడ్జెట్టా? అని ‘బాహుబలి’ నిర్మాణ వ్యయం గురించి విన్నప్పుడు ఆశ్చర్యపోనివారు లేరు
ఈ ‘ఎపిక్‌ ఫ్యాంటసీ మూవీ’ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో సుమారు 4,000 స్క్రీన్స్‌లో విడుదల కావడం విశేషం సినిమా గురించి విని, ప్రముఖ బాలీవుడ్‌ దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ హిందీలో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు ∙ హిందీలో అనువాదమైన ఉత్తరాది చిత్రాల్లో 100 కోట్లు వసూలు చేసిన ఘనత ‘బాహుబలి’దే
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ‘పీకే’, ‘భజరంగీ భాయ్‌జాన్‌’ నిలిచాయి. ఆ తర్వాతి రికార్డ్‌ ‘బాహుబలి’దే. సుమారు 600 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది.

‘బాహుబలి: ది కన్‌క్లూజ్‌’ (28–04–2017)
‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ సినిమాపై ఏ రేంజ్‌ క్రేజ్‌ ఉందంటే... ఇతర భారతీయ భాషల్లో కూడా వేరే పెద్ద సినిమాలను విడుదల చేయలేదు ∙ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9,000 స్క్రీన్స్‌లో విడుదలైంది
సుమారు 250 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిన చిత్రం ‘బాహుబలి–2’ ∙ప్రీ–రిలీజ్‌ పరంగా కూడా ‘బాహుబలి–2’ ఓ రికార్డ్‌. శాటిలైట్, థియేటరికల్‌ రైట్స్‌ కలుపుకుని సుమారు 500 కోట్లు బిజినెస్‌ చేసింది.
అలాగే విడుదలైన మూడు రోజులకే దాదాపు 500 కోట్ల రూపాయలు వసూలు సాధించిన తొలి ఇండియన్‌ మూవీ.
ఇక ఆరో రోజుకి చేరుకునేసరికి అప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా వరల్డ్‌ వైడ్‌ రికార్డును దక్కించుకున్న హిందీ చిత్రం ‘పీకే’ రికార్డును ‘బాహుబలి–2’ బద్దలు కొట్టింది. ‘పీకే’ వసూళ్లు 743 కాగా, ‘బాహుబలి–2’ వసూళ్లు సుమారు 792 కోట్లు
ఏడో రోజు వసూళ్లు సుమారు 850 కోట్లకు టచ్‌ చేయడం ఓ రికార్డ్‌.
రజనీకాంత్‌ ‘కబాలి’ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున 87 కోట్లు కలెక్ట్‌ చేయగా, ‘బాహుబలి–2’ దాదాపు 120 కోట్లు కలెక్ట్‌ చేసి, ఆ రికార్డును చెరిపేసింది.

ప్రధాని నోట కట్టప్ప
‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనేది దేశంతో పాటు ప్రధాని మోదీకి కూడా కుతూహలం రేపింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అని ఆయన పేర్కొనడం విశేషం. ఒక తెలుగు సినిమా పాత్ర ఆ స్థాయికి చేరడం ఇంకా పెద్ద విశేషం!

వై కట్టప్ప కిల్డ్‌ బాహుబలి?... దీనికి సమాధానం తెలుసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ ప్రేమికులు ఎదురు చూశారు. విడుదలైన రోజే సమాధానం తెలుసుకోవాలనుకున్నారు. అయితే చాలామంది టిక్కెట్లు దొరక్కపోవడంతో... వేరే దారి లేక ‘గూగుల్‌’ని ఆశ్రయించారు. ‘వై కట్టప్ప కిల్డ్‌ బాహుబలి’ అనే ప్రశ్న గూగుల్‌ సెర్చ్‌లో సినిమా రిలీజ్‌ నాడు రికార్డ్‌ సృష్టించింది. ఆ సంగతలా ఉంచితే.. ఇదే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసం సినిమా విడుదలకు 90 రోజుల ముందు నుంచే నెటిజన్లు గూగుల్‌ సెర్చ్‌లో వీర విహారం చేశారు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లతోపాటు అహ్మదాబాద్‌నుంచి కూడా సెర్చ్‌లు వచ్చాయట. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ చేసినప్పుడు ‘బాహుబలి: ది బిగినింగ్‌’ పుల్‌ మూవీ ప్రీ–డౌన్‌లోడ్‌ అని గూగుల్లో విపరీతంగా సెర్చ్‌ చేశారట నెటిజన్లు.

సోమవారం రికార్డ్‌ సొంతం... సూపర్‌ హీరోల సినిమాలు వీకెండ్‌కి విడుదల అయితే కలెక్షన్లు రికార్డులు సృష్టిస్తాయి. సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే సోమవారం కలెక్షన్లు నిలకడగా ఉంటాయి. అయితే ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఆ రికార్డును కూడా కొల్లగొట్టింది. ఇప్పటివరకూ ఇండియన్‌ సినిమాల్లో సోమవారం కలెక్షన్స్‌ పరంగా రికార్డ్‌ సాధించిన చిత్రం ఏదంటే.. అది హిందీ సినిమా ‘క్రిష్‌ 3’. విడుదలైన మొదటి సోమవారం ఈ చిత్రం సుమారు 30 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డును ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ బ్రేక్‌ చేసింది. ఈ చిత్రం దాదాపు 40 కోట్లు వసూలు చేసింది. నిజానికి ‘క్రిష్‌ 3’ విడుదలైంది దీపావళి సమయంలో. సో... పండగ సెలవులను క్యాష్‌ చేసుకుంది. ‘బాహుబలి–2’ రిలీజ్‌  సమయంలో ఏ పండగా లేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా వసూళ్ల సునామీ సృష్టించి, పండగ చేసుకుంది.

బాలీవుడ్‌లో నంబర్‌ వన్‌ దిశగా... ఇండియన్‌ సినిమాల్లో భారతీయ బాక్సాఫీస్‌ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్‌ నిన్న మొన్నటి వరకూ ఆమిర్‌ ఖాన్‌ ‘దంగల్‌’దే. ఇక్కడ ఈ చిత్రం సాధించిన మొత్తం వసూళ్లు దాదాపు 387 కోట్ల రూపాయలు. ఇప్పుడు ‘బాహుబలి–2’ హిందీ అనువాదం ఆ రికార్డ్‌ను బ్రేక్‌ చేసే దిశగా దూసుకెళుతోంది. ఈ చిత్రం వీకెండ్‌ వసూళ్లు సుమారు 245 కోట్ల రూపాయలు. ఇప్పటివరకూ వారాంతపు వసూళ్ల పరంగా సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’ 208 కోట్లు సాధించి, మొదటి స్థానంలో నిలిచింది. ‘బాహుబలి–2’ 245 కోట్లు సాధించి, దాన్ని అధిగమించింది. ఇక, ‘దంగల్‌’ రికార్డ్‌ని బ్రేక్‌ చేయడానికి ఎన్నాళ్లో లేదు మామా.

ఢాకా టు కోల్‌కత్తా...!
‘సెకనుకు 12 టిక్కెట్లు బుక్‌ అయ్యాయి. ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా ప్రీ బుకింగ్‌ బిజినెస్‌ జరిగింది’... ఈ విషయాన్ని స్వయంగా బుక్‌ మై షో నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అంటే.. ‘బాహుబలి’ సినిమాపై ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సంగతలా ఉంచితే.. ఈ సినిమాకి నెలకొన్న క్రేజ్‌కి మరో నిదర్శనం చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్‌కు చెందిన 40మంది ఏకంగా ఒక ఛార్టెడ్‌ ఫ్లైట్‌లో ఢాకా నుంచి కోల్‌కత్తాకు వచ్చి సోమవారం ‘బాహుబలి–2’ సినిమాను చూశారు. ‘‘బాహుబలి: ది బిగినింగ్‌’ చూసినప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు...? అన్న విషయంపై మా దగ్గర చర్చ బాగానే సాగింది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో  బాగా పాపులార్టీ వచ్చింది. అందుకే ఇంత దూరం వచ్చి సినిమా చుశాం. దక్షిణ భారతదేశ సినిమాల గురించి అవగాహన ఉన్నప్పటికీ బంగ్లాదేశీయులు ఎక్కువగా బాలీవుడ్‌ సినిమాలను చూస్తారు. కానీ, బాహుబలితో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా తెలుసుకోగలుగుతున్నాం’’ అని కోల్‌కత్తా వచ్చి, సినిమా చూసినవాళ్లల్లో ఉన్న ఓ బంగ్లాదేశ్‌ స్టూడెంట్‌ అన్నాడు.
- (గణాంకాలన్నీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement