
సంస్కృతం శరణం గచ్చామి!
విశేషం
సంస్కృతం గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటాం. అయితే ఆచరణ విషయానికి వస్తే మాత్రం ఇంగ్లిష్‌కు ప్రాముఖ్యం ఇస్తాం. దీనికి భిన్నంగా పాశ్చాత్య దేశాల్లో సంస్కృతానికి ఆదరణ పెరుగుతోంది. స్విట్జర్లాండ్‌లోని సౌత్ ఏషియా ఇన్‌స్టిట్యూట్, యూనివర్శిటీ ఆఫ్ హైడల్‌బెర్గ్‌లలో ‘స్పోకెన్ శాన్‌స్క్రీట్’ క్లాసులకు విపరీతమైన స్పందన లభిస్తోంది. ఇటలీ, జర్మనీలలో కూడా ఇలాంటి తరగతులకు హాజరు కావడానికి విద్యార్థులు ఉత్సాహం చూపుతున్నారు.
జర్మనీలో అయితే 14 టాప్ యూనివర్శిటీలు సంస్కృతాన్ని బోధిస్తున్నాయి. 34 దేశాలకు చెందిన 254 మంది విద్యార్థులు జర్మనీలో వివిధ యూనివర్శిటీలలో సంస్కృతాన్ని అభ్యసిస్తున్నారు. ‘‘బౌద్ధానికి సంబంధించిన ఎన్నో ఆలోచనలు, తత్వం, చారిత్రక విశేషాలు, శాస్త్ర, సాంకేతిక విశేషాలు సంస్కృతంలో ఉండడమే ఆ భాష పట్ల ఆదరణకు కారణం’’ అంటున్నారు హైడెల్‌బెర్గ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ మైఖేల్.