
ఆ నేడు ఆగస్ట్ 29, 2007
వీరుడా... నిను తలచీ!
నెల్సన్ మండేలా అంటే వ్యక్తి కాదు... నిలువెత్తు ఉద్యమ సంతకం. ఈ నల్లసూర్యుడిని తలుచుకుంటే చాలు.. తెలియని ఉత్తేజమేదో దరి చేరుతుంది. ఇక ఈ వీరుడి రూపాన్ని కళ్లారా చూస్తే... క్షణక్షణం మనసు తేజోమయం అవుతుంది. లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్‌లో మండేలా విగ్రహ ఆవిష్కరణ జరిగిన రోజు ఇది.
ప్రముఖ శిల్పి ఇయాన్ వాల్టర్స్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. తొమ్మిది అడుగుల ఈ కాంస్య విగ్రహాన్ని చూస్తే... కేవలం విగ్రహాన్ని చూసినట్లుగా అనిపించదు. గతం వర్తమానంలోకి వచ్చినట్లు ఉంటుంది... తెలియకుండానే నిప్పు నినాదంతో పిడికిలి బిగుసుకుంటుంది.