♦ సాంబారు, రసం పొడులను డీప్ ఫ్రీజర్‌లో నిల్వ ఉంచితే ఎక్కువ రోజులు వాసనపోకుండా తాజాగా ఉంటాయి.
♦ పచ్చళ్ళు, ఊరగాయల్లో స్టీల్ స్పూన్లు వాడకూడదు. కోడిగుడ్డు పొరటు మెత్తగా రావాలంటే మూడు టీ స్పూన్ల పాలు కలపాలి.
♦ ఉల్లిపాయలను గ్రైండ్ చేసిన వెంటనే వాడాలి, ఆలస్యమైతే చేదవుతుంది. గ్రైండ్‌చేసే ముందు ఉల్లిపాయలను కొద్దిగా నూనెలో వేయిస్తే ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి.
♦ క్యారట్ పైభాగాన్ని కోసేసి గాలి దూరని కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి.
♦ అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నల్లని కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజులైనా తాజాగా ఉంటాయి. క్యారట్ వండేటప్పుడు నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపితే రంగు ఆకర్షణీయంగా ఉంటుంది.
♦ పచ్చిమిరపకాయలు తరిగిన తర్వాత వేళ్ళమంట తగ్గాలంటే చల్లటి పాలలో కొద్దిగా చక్కెర వేసి అందులో వేళ్లను ముంచాలి.
ఇన్‌టిప్స్
Published Thu, Nov 30 2017 12:40 AM | Last Updated on Thu, Nov 30 2017 12:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment