ఈ వేసవి పర్యటనలలో మంచి ఫొటోలు కావాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకే.
టిప్: 01: బరువైన కెమేరాలు విమానాల్లో తీసుకెళ్లడానికి నిబంధనలు ఉంటాయి. దుస్తులంత తేలికైన కెమేరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వెంట తీసుకెళ్లడానికి ఇబ్బందిలేని పాకెట్ కెమెరాలు ఉత్తమం. ముందుగా మీరు వెళ్లబోయే చోటు ఎలాంటిదో తెలుసుకోండి.
టిప్: 02: సూర్యాస్తమయానికి ముందే నిద్రలేవాలి. అప్పుడే ఉషోదయ వేళలో ఉండే ప్రకృతి అద్భుత సౌందర్యాన్ని కెమేరాలో బంధించవచ్చు. అలాగే సూర్యాస్తమ సమయమూ అత్యద్భుతంగా ఉంటుంది.
టిప్: 03: ప్రయాణంలో కెమేరా ఫీచర్స్ గురించి తెలుసుకుంటూ వెళితే, సరైన ఫొటో మీకు లభించదు. బయల్దేరకముందే కెమరా, లెన్స్, ఫ్లాష్.. వంటివి ఇంటి వద్దే చూసి, నేర్చుకోవాలి.
టిప్: 04: దేవాలయాలు, ఆర్ట్ గ్యాలరీలు, నృత్యం, సంగీతం.. వంటివి ఫొటోలలో బంధించేముందు వాటికి సంబంధించిన కొన్ని పుస్తకాలను చదవడం వల్ల మరింత పరిజ్ఞానం లభిస్తుంది. దీని వల్ల ఒక క్రమపద్ధతిలో కళాత్మకంగా ఫొటోలు తీసే నేర్పు అలవడుతుంది.
టిప్: 05: టూర్ అన్నాం కదా అని అన్నీ వేగంగా చూసేస్తే సరిపోతుంది అనుకోకూడదు. దారిలో ఎంతో మంది వ్యక్తులు ఉంటారు. ఆ ప్రాంత ప్రత్యేకత ఫొటోల ద్వారా తెలియజేయాలను కుంటే స్థానికులతో మాట్లాడితే సరైన సమాధానం లభిస్తుంది.
ట్రావెల్ టిప్స్
Published Sat, Apr 28 2018 12:40 AM | Last Updated on Sat, Apr 28 2018 12:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment