ఏమన్నారు?
‘‘ఒకసారి బరోడా ఆర్ట్ క్యాంప్‌కి పోయిన. అక్కడ ఇండియన్ ఆర్ట్ మీద పెద్ద చర్చ జరిగింది. ఇండియన్ ఆర్ట్ అంతా వెస్ట్రన్ ఇన్‌ఫ్లూయెన్సే అని కొందరు కామెంట్ చేసిండ్రు. అప్పటి నుంచి నేను ఆలోచనలో పడిన. గీతల్లో రంగుల్లో కొత్తదనం ఉండాలి మన బతుకు కల్చర్, శ్రమ కనిపించాలి అనుకున్న. దాని కోసం మళ్లీ మా బూరుగుపల్లి పోయినా. నా గ్రామాన్నే కాన్వాసుగా చేసుకున్నా. కష్టజీవులు, పల్లెపడుచులు వారి కట్టూ బొట్టూ తెలంగాణ పండుగలు అన్నీ స్టడీ చేసినా.
నా పెయింటింగ్స్‌లో ఎక్కువగా ప్రైమరీ కలర్స్ ఉంటాయి. ఎందుకంటే నా ప్రాంతపు ప్రజలు ఆ రంగుల దుస్తులే వాడుతరు. నా పెయింటింగ్స్‌లో డైమన్షన్స్ ఉండవు. అన్నీ ఫ్లాట్‌గా మారని మా పల్లె బతుకుల్లా ఉంటాయి. తెలంగాణ ప్రజల కష్టం, శ్రమించే చేతులు, తరతరాల కన్నీళ్లకు దర్పణంగా నా చిత్రాల్లో వారి శరీరాలను డార్క్ కలర్‌లో చూపిస్త. నా రంగులను చూస్తే నా తెలంగాణ చరిత్రలోకి తొంగి చూసినట్టే’’
- తోట వైకుంఠం, టఠట్చఝ్ఛఛీజ్చీ.జీలో శ్యామ్‌మోహన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి...