
వైట్ వాటర్ రాఫ్టింగ్
సవాల్‌తో కూడిన సాహస క్రీడ వైటర్ వాటర్ రాఫ్టింగ్. పరవళ్లు తొక్కే నీటిలో తెప్పలు వేసుకొని, తెడ్లను కదిలిస్తూ అలలతో పోటీపడటమనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్.
1980లో అమెరికాలోని థండర్ నదిలో జరిపిన ఈ సాహసక్రీడ ప్రపంచంలోనే మొదటి రాఫ్టింగ్ రైడ్‌గా పేరుపొందింది.
అమెరికాలోని కొలరెడో నదీ ప్రవాహం 1,100 అడుగుల ఎత్తు. ఇక్కడ రాఫ్టింగ్‌కి లెక్కకు మించి తెప్పలు ఉన్నాయి. కొలరెడో దగ్గర రైడింగ్ మొదలుపెడితే గ్రాండ్‌కాన్యన్ లోయవరకు హుషారుగా రాఫ్టింగ్ చేయవచ్చు.
మన దేశంలోని హిమాలయాల్లో రిషీకేశ్ దగ్గర గంగా నదీ ప్రవాహం ప్రపంచంలోనే పేరొందిన అద్భుతమైన రాఫ్టింగ్ ప్లేస్. ఇక్కడ 16 కిలోమీటర్ల మేర పరవళ్లు తొక్కే నదిలో 1 నుంచి 4 గ్రేడ్‌లలో రాఫ్టింగ్ ప్రాంతాలు 13 ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి జూన్ వరకు ఇక్కడ రాఫ్టింగ్‌కి అనుకూలమైన కాలం.
ప్రపంచంలో రాక్ అండ్ రోల్ ర్యాపిడ్ క్లాస్ 5 ఉన్న నది ఉగాండాలోని వైట్ నైల్. ఇక్కడ అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన తెప్పలున్నాయి.